హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాదాద్రి దివ్యక్షేత్రం కొత్త అందాలతో తొణికిసలాడుతోంది. పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలోని లక్ష్మీనృసింహ ఆలయం పునరుద్ధరణ పనులు పూర్తవడంతో భక్తులు సందర్శిం చేందుకు అనుమతులు ఇచ్చారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా భాసిల్లేలా ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేశారు. ఈ ఆలయంలో ప్రపంచస్థాయిలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీలను కొలు వుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని పునర్ణి ర్మించారు. నేడు సీఎం కేసీఆర్ తొలిభక్తునిగా ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది.
యాదాద్రిలో లక్ష్మీనరసింహుడు స్వయంభువుగా వెలి శారు. ఈ దివ్యక్షేత్రాన్ని అపురూపంగా అభివృద్ధి చేశారు. పునర్నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు.ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. విమాన గోపురాన్ని ద్రవిడ శిల్పకళారీతిలోను, అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోను రూపొందించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖ మంటపాలను కాకతీయ శైలిలో నిర్మించారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ పునర్నిర్మాణం కోసం భారీస్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనులశాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి, నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజపల్లి గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్’ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను ‘మెస్సెర్స్ సివిల్స్ ఇంజినీర్స్’ సంస్థలు పరిశీలించి, ధ్రువీకరించాయి. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు.
శ్రీవైష్ణవ భకి ్తసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను, రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు, ఇలా ఆలయంలోని ప్రతి నిర్మాణంలోనూ అణువణువునా విష్ణుతత్త్వం ప్రతిఫలించేలా రూపొందించారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో విరామమెరుగకుండా శ్రమించారు. వైటీడీఏ చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కిషన్‌రావు వైస్‌చైర్మన్‌గా వ్యవ#హరిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, వ్యయం రూ.1200 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కో సమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు రెండువేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు నలభైవేల మంది భక్తులు వచ్చినా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 15 వీవీఐపీ కాటేజీలను నిర్మించారు. దాతల సహకారంతో 252 వీఐపీ కాటేజీలను నిర్మించనున్నారు. ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. ఇక గుట్ట కింద తులసి కాటేజీలో అదనంగా 120 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా, ఇంకా ఫైవ్‌స్టార్ హూటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు.
సప్త గోపురాలు… బంగారు తాపడం
యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్తగోపురాలను సర్వాంగ సుందరంగా మలచారు. ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు గోపురాలను, మూడు పంచతల గోపురాలను, ఒక సప్తతల మహారాజ గోపురాన్ని నిర్మించారు. పశ్చిమదిశలో మహారాజ గోపురాన్ని 85 అడుగుల ఎత్తున, ఒక్కో పంచతల గోపురాన్ని 57 అడుగుల ఎత్తున, తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో 30.8 అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని, గర్భాలయంపైన విమాన గోపురాన్ని నిర్మించారు. విమానగోపురానికి భక్తుల విరాళాలతో 125 కిలోల బంగారు తాపడం చేయిస్తున్నారు. బ్ర#హ్మూత్స వాలు ముగిసే నాటికి భక్తుల నుంచి రూ.17.59 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం వచ్చింది. గర్భగుడి గోడలపై స్వామివారి శంఖుచక్రనామాలు, పంచనారసిం#హ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి.
యాదాద్రి వైభవం
Advertisement
తాజా వార్తలు
Advertisement