Saturday, November 23, 2024

స్త్రీల సౌభాగ్య వ్రతం… అట్లతద్ది

ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ‘అట్లతద్ది’ ఒకటి. దీనినే ‘ఉయ్యాల పండగ’, ‘గోరింటాకు పండగ’ అని కూడా అంటా రు. పరమేశ్వరుడిని వివాహం చేసుకోవాలన్న పార్వతీదేవి కోరి క ఫలించడానికి నారద మహర్షి చెప్పిన వ్రతం ”అట్లతద్ది వ్రతం”. పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది. అటు వంటి ఈ వ్రతాన్ని స్రీలు సౌభాగ్యానికై చేస్తారు. తెలుగునాట వివా#హతలు సౌభాగ్యాన్నీ, పెళ్ళి కావలసిన అమ్మాయిలు మంచి వరుడినీ ఆశిస్తూ చేస్తారు. ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాల పాటు సుఖంగా ఉం డాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.
మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారతదేశ స్త్రీలు చేసుకునే ‘కార్వా చౌత్‌’ వేడుకతో సమానం. రోమ్‌లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జన వరి 20, 21వ తేదీన వచ్చే ‘సెయింట్‌ ఆగ్నెస్‌ ఈవ్‌’
మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది. పశ్చిమ దేశాల ప్రభావంతో ‘అట్లతద్ది’లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదా యం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ‘అట్లతద్ది’ జరుపుకుంటున్నారు. ఇది ఆశ్వీయుజ బ#హుళ తదియ నాడు చేసుకుంటాం. పల్లె ప్రాంతాల్లో తెలుగింటి ఆడపడుచులం తా తెల్లవారు ఝామున లేచి శుభ్రంగా తలస్నానం చేసి ఉపవాసం తో ఇంటిలో తూర్పున మంటపాన్ని ఏర్పరచి గౌరీదేవిని ప్రతిష్టిస్తా రు. ముందుగా వినాయకుని పూజించి, ఆయన తల్లి ఐన గౌరీదేవిని స్తుంతించి, పాటలు పాడుతారు. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, చంద్రోదయమయ్యాక మరలా గౌరీమాతను పూజించి, పది అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తారు. అట్ల తద్ది నోము కథ చెప్పుకుంటారు. పది పువ్వుల ముడితో తోరం కట్టు కుం టారు. చిన్న అమ్మాయిలు, కన్నె పిల్లలంతా సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి చద్దన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, గడ్డ పెరుగుతో కడుపు నిండా తింటారు. ఆ తరువాత ఆటలాడు తూ, తోటల్లో చెట్లకు వేసుకున్న ఊయ్యాలలు ఊగుతూ ”అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌- ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌” అంటూ పాట లు పాడుతూ ఆనందంగా గడుపుతారు. ఈ పండుగలో విశేషమేమంటే ఉయ్యాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ముఖ్య ఘట్టాలు. ఇలా గోరింటాకు పెట్టుకోడంలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది. పూర్వం మ#హళలు పని చేసేప్పుడు ఎక్కువగా నీటి లో చేతులు, కాళ్ళు తడిసేవి. ఇలా గోరింటాకు పెట్టుకోడం వలన గోరింటలోని వ్యాధి నిరోధక శక్తి వలన శరీరం చల్లబడి వివిధ రకా ల క్రిములవల్ల వచ్చే రోగాల నుంచి వేళ్ళకు, గోళ్ళకు, అరికాళ్ళకు రక్షణ లభిస్తుంది. ఈ వ్రతంలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే మహా ప్రీతి! అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజ దోష పరిహారమై సంసారంలో ఎటువంటి అడ్డంకులు రావన్న విశ్వాసం. మినుములు రా#హువునకు, బియ్యము చంద్రునకు ఇష్ట మైన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే అట్లనే వాయనమివ్వాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement