హైదరాబాద్, ప్రభన్యూస్: భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రం శ్రీరామనగరాన్ని సందర్శిం చాలని, సమతామూర్తి ప్రాంగణాన్ని చూడాలని బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. తానుకూడా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని వీలైనన్నిసార్లు దర్శించుకుంటానని అన్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలో భగవద్రామానుజుల216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చరిత్రలో నిలిచిపోయారన్నాని ఆయన కొనియా డారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మధ్యాహ్నం శ్రీరామనగరానికి బాబా రాందేవ్ విచ్చేశారు. సమతా మూర్తిని, 108 దివ్యక్షేత్రాలను తిలకించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రామానుజాచార్యుల స్ఫూర్తితో అందరూ ముందుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కాగా భగవద్రామానుజాచార్యులు సనాతన ధర్మం కోసం చేసిన కృషి అందరికీ స్ఫూర్తిని స్తోందని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి అన్నారు. వెయ్యేళ్ల క్రితమే హిందువులను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు రామా నుజాచార్యుల న్నారు. భారత్ విశ్వగురువు కావా లంటే జగద్గురు రామాను జాచార్యుల సిద్ధాంతాలను పాటిం చాలని అభిప్రాయపడ్డారు. సమతామూర్తి 216 అడుగుల విగ్రహం భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తుందన్నారు. జగద్గురు రామానుజా చార్యులు అసమానతలను రూపు మాపి భక్తులను భగవంతు డికి చేరువ చేసిన మహనీయుడని బీహార్‌కు చెందిన శ్రీలక్ష్మీ ప్రపన్నజీయర్ స్వామీజీ అన్నారు. హిందువులంతా ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న అసమానతలు అనే వైరస్‌ను నాశనం చేసేందుకు భగవద్రా మానుజాచార్యులు కృషి చేశారని, ఆయన చూపిన మార్గం లో సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంద రూ కృషి చేయాలని చినజీయర్ స్వామి సూచించారు. బాబా రాందేవ్, శ్రీలక్ష్మీప్రపన్న జీయర్ స్వామీజీ, తమిళ నాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవీజీ, డీఆర్‌డీవో చీఫ్ సతీష్ రెడ్డిజీకి రామానుజాచార్యుల ప్రతిమను బహూక రించి చినజీయర్ సన్మానించారు.
ప్రముఖుల రాక
ఇవాళ జీహచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సమతామూర్తిని దర్శించు కున్నారు. అలాగే, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ 216 అడుగుల సమతామూర్తిని దర్శించుకున్నారు. అల్లు అర్జున్‌కు సమతామూర్తి ప్రాంగణ విశేషాలను మైహోంగ్రూప్ ఎండీ రామురావు వివరించారు.
సనాతన ధర్మానికి సాక్షి
Advertisement
తాజా వార్తలు
Advertisement