Monday, November 25, 2024

వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలి

శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన.. జన్మనక్షత్రమైన శ్రావణం పేరిట శ్రావ ణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.
చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో శ్రావణ పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వలన శ్రావణ మాసం అని అం టారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కనుక మ#హళలకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసం ”వ్రతాల మాసమని” పేరు పొందింది. శ్రావ ణ మాసంలో, వరలక్షి వ్రతం ఎంతో ప్రాశస్త్యం పొందింది. శ్రావణ మా సం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతం గా జరుపుకోవడం ఒక ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని ఈ రోజు కొలుస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని స్త్రీలు అధికంగా పూజలు నిర్వ#హస్తారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మా యిలు కూడా పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అ్టషశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభి స్తాయని ప్రగాఢ విశ్వాసం. స్కంద పురాణం ప్రకారం పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది.
లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొం దేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వ#హస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూ జిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్ర#హం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతా న్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement