పద్మం ఆకృతిలో అలంకరించిన వెదురుబుట్టలో కొద్దిగా ధాన్యం పోసి పెళ్ళికూతురును కూర్చోపెడతారు. అమ్మాయితో గౌరీపూజ చేయిస్తారు. ఆ తరువాత మేన మామలు బుట్టను పైకి ఎత్తి మంగళవాయిద్యాల నడుమ వధువును వివాహ వేదికమీదకి తీసుకొస్తారు. బుట్టలోనే ఎందుకు కూర్చుంటుంది అంటే అప్పు డు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. సనాతన ధర్మంలో పెండ్లికుమారునికి సహ ధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ ఋణం, పితృఋణం, ఋషి ఋణం తీరవు. పెండ్లి కొడుకు అభ్యున్నతి అంతా ఆమె మీదే ఆధార పడింది. ఒక యజ్ఞం చేయాలంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేని నాడు ఆయన ఏమీ చేసుకోలేడు. వెదురుబుట్ట పద్మానికి సంకేతం. ఎందుకు పద్మం లో కూర్చోవాలి? అంటే పెళ్ళి కూతురు లక్ష్మీ స్వరూపం. ”ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ కలిసిరా వాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞాలు చేయాలి. సంతానం కలగాలి. తండ్రి కావాలి, తాతకావాలి. ముత్తాత కావాలి. ఆయన అభ్యు న్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితేనే తీరుతుంది. ఆ సంతానం నా నుండి రావాలి. ” అనుకుంటుంది. ఇన్ని లక్ష్ములకు నిలయం అయిన పెళ్ళికూతురు వేదిక మీదరకు నడి చి వెళ్ళకూడదు. లక్ష్మిగా నారాయణమూర్తిని పొందేందుకు వెళుతోంది. అందుకే పద్మం లో వెళ్ళాలి. ‘అయ్యా! మా అక్కచెల్లెళ్ళ కన్నబిడ్డ అయిన ఈ ప్రేమమూర్తి నీ లక్ష్మి” అంటూ మేనమామలు పరవశంతో ఆమెను లక్ష్మిగా భావించి బుట్టలో కూర్చో బెట్టి తీసుకుని వెళ్ళి పెళ్ళికొడుకు ఎదురుగుండా కూర్చోబెడతారు. ”లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి. అందుకే ”అయ్యా మీరు ఇంత ఆదరభావంతో నారాయణ స్వరూపుడైన నా కొడుక్కి లక్ష్మీదేవిని తెచ్చినారు మీరు పదికాలాలు చల్లగా వుండండి” అంటూ అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement