Friday, November 22, 2024

కలలు కనేదెవరు

తస్మిన్‌ పురుషీ కాని స్వపన్తి, కాన్యస్మిన్‌ జాగ్రతి, కతర ఏష దేవ: స్వప్నాన్‌ పశ్యతి, కస్యైత త్సుఖం భవతి, కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవస్తీతి? ”ఓ దేవర్షీ! ఈ పురుషుడిలో ఏవేవి నిద్రిస్తున్నాయి? (ఏవేవి హచ్చరిక లేకుండా ఉన్నాయి), ఏవేవి మేల్కొని ఉన్నాయి? ఏ దేవత స్వప్నాలను చూస్తున్నాడు? (కలలు కనే దేవుడెవరు) సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు? చివరకు అన్నీ దేనిలో లయమై పోతున్నాయి?” సూర్యుని మను మడైన గార్గ్యుడు పిప్పలాదుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు.
పిప్పలాదుడు గార్గ్యునికి చెబుతున్నాడు. ”సూర్యుడు అస్తమించేటప్పుడు అతని నుం చి వచ్చిన అన్ని కిరణాలూ జ్యోతిర్మండలంలో ఐక్యమైపోతాయి. ఆయన తిరిగి ఉదయిస్తు న్నప్పుడు అతడిలోని అన్ని కిరణాలు తిరిగి బైటకి వ్యాపిస్తాయి. ఒక మనిషి నిద్రపోతున్న ప్పుడు అతడిలో ఉన్న ఇంద్రియాలన్నీ ప్రధాన ఇంద్రియమైన మనసులో లీనమౌతాయి. ఆ స్థితిలో అతడు మాట్లాడలేడు, వినలేదు, చూడలేడు, వాసన, రుచి కూడా చూడలేడు. దేన్నీ తాకలేడు. ఆనందించలేడు, దేన్నీ వదిలేయలేడు, కదలలేడు. అలా ఉన్నప్పుడు ఆ మనిషిని నిద్రపోతున్నాడు అని అంటారు.
మనిషి నిద్రపోతున్నప్పుడు అతని శరీరం అనే నగరంలోని ప్రాణ శక్తులైన అగ్నులు మాత్రం మేలుకొని ఉంటాయి. ఆ అగ్నులలో అపాన వాయువు- గార్హపత్యాగ్ని- దీనిని ‘పిత’ అంటారు. వ్యాన వాయువు అన్వహార్య పచనాగ్ని అంటే దక్షిణాగ్ని- దీనిని ‘మాత’ అంటా రు. ఇందులో గార్హపత్యాగ్ని నుంచి రూపొందినదే ఆహవనీయాగ్ని: కనుక ఆహవనీయా గ్ని అంటే ప్రాణమే. దీనినే ‘గురువు’ అంటారు. శౌతాగ్నులని, త్రేతాగ్నులని ఈ అగ్నులను పిలుస్తారు. యాజ్ఞికాలలో ఈ అగ్నుల అమరిక ఆహుతుల అర్పణ విధానం ఈ రకంగా ఉంటుంది.

శ్రౌత్ర క్రియలలో నిత్యాగ్నిహోత్రులు అనుసరించే విధానం

యజ్ఞశాల యందు గార్హపత్య కుండము గుండ్రని ఆకారములో పడమటి వైపున ఉంటుంది. దీనిలో అరుణుల (ఉత్తరారణి, ఆధరారణి) రాపిడితో అగ్నిని ప్రజ్వలింప జేస్తా రు. గార్హపత్యాగ్ని నుండి అగ్నిని తీసుకొని మిగిలిన రెండు అగ్నులను ప్రజ్వలింప జేస్తారు. దక్షిణాగ్ని గుండము యజ్ఞశాలలో దక్షిణము వైపున అర్ధచంద్రా కారములో నిర్మింపబడు తుంది. ముఖ్యముగా దీనిలో పితృదేవతలకు ఆహుతులను చేస్తారు. ఆహవనీయ గుండ ము యజ్ఞశాలకు తూర్పున నలుచదరముగా ఏర్పరుస్తారు. మొత్తం అందరి దేవతలకు ఆహుతులను దీనిలోనే వేల్చుతారు.

మన యోగ పరిభాషలో…

మన శరీరంలో ఉండే వైశ్వానరాగ్నిని వృద్ధి చేసుకొని అశనోత్పత్తి చేసుకొనేందుకు ఉపయోగపడే అగ్ని ఆహవనీయాగ్ని. గార్హపత్యాగ్ని ద్వారా తేజస్సు ద్విగుణీకృత మౌతుం ది. ప్రతి దినం మనం చేసే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జనించిన ఉష్ణ శక్తి (ఆశనము) ఆ తేజస్సు. దీనినే గృహస్తు తన స్వధర్మం అంటే ప్రాణాయామముతో జనింప చేసుకొంటాడు.
మానవుడు ఉచ్చ్వాసం- నిశ్శ్వాసం అనే రెండు ఆహుతుల్ని సమానంగా జరిపించటం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి ప్రాణశక్తి సమానం అని చెప్పబడుతుంది. మనస్సే దీనికి యజ మాని, యోగం ద్వారా జీవుడు కోరిన ఇష్ట ఫలమే ఉదానం. ఎందుకంటే ఈ ఉదానమే సాధ కుణ్ణి నిత్యం భగవంతుని దగ్గరకు జేరుస్తుంది గనుక. ఈ జీవుడు స్వప్నావస్థలో తన గొప్పతనాన్ని తానే చూస్తాడు.
జాగ్రదావస్థలో తాను చూసిన వాటినే తిరిగి చూస్తాడు. విన్నవే మళ్ళీమళ్ళీ వింటా డు. వివిధ ప్రాంతాలలో వివిధ దిశలలో తాను అనుభవించినవి మళ్ళీమళ్ళీ కలలో అను భవిస్తాడు. జాగ్రదావస్థలో చూసినవి, చూడనివి, విన్నవి, విననివి అనుభవించినవి, అను భవించని వి, నిజమైనవి, నిజం కానివి ఇలా అన్నీ తానే అయి కలలో అన్నిటినీ జీవుడు (ఇక్కడ ఆత్మ కాదు మనస్సే) అనుభవిస్తాడు. ఒక్కొక్కప్పుడు పూర్వజన్మలోని ఉపాధిని (శరీరం) వదలి, ప్రస్తుత ఉపాధిలోకి చేరుకొన్న, సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు కూడా స్వప్నాలకు కారణాలవుతాయని చెబుతారు.
ఇలాంటి కలలకు జన్మాంతర అనుభవాలే ఆధారం అనుకోవచ్చు. జాగ్రదవస్త, సుషుప్త్యవస్థల మధ్యలో ఉండేది స్వప్నావస్థ. స్వప్నాన్ని మనస్సే అనుభవిస్తుంది. స్వప్నావస్థలో కళ్ళు వాటి పని నుండి నిష్క్రమిస్తాయి. అయినా స్వప్నం కనబడుతుంది. చెవులు పనిచేయవు. అయినా స్వప్నంలోని మాటలు శబ్దాలు వినగలుగుతాము. కారణం మనస్సే ఇంద్రియా ల పని కూడా చేస్తూంది. అందుకే మనస్సుని ఆరవ ఇంద్రియం అన్నారు. భగవద్గీతలో (మనషస్థానీద్రియాణి..). స్వప్నావస్థలో మనస్సు, పంచప్రాణాలు మాత్రమే పనిచేస్తాయి. ఆత్మ సాక్షీభూతంగానే ఉంటుంది. అతనికి అవస్థాత్రయంతో సంబంధం లేదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతుడు, పరిశుద్ధుడు మరియు జ్ఞాన స్వరూపుడు.
పంచభూతాలు, (పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము) వాటి తన్మాత్రలు (గం ధం, రసం, రూపం, స్పర్శ, శబ్దము) జ్ఞానేంద్రియాలు వాటి క్రియలు, కర్మేంద్రియాలు వాటి క్రియలు: అంత:కరణం (మనస్సు, బుద్ధి, అ#హంకారం, చిత్తం) వాటి విషయాలుబీ పంచ ప్రాణాలు, తేజస్సు ఈ విధంగా ప్రాణంతో సంబంధమున్న తత్వాలన్నీ ఆత్మలోనే లయమై పోతున్నాయి. పక్షులన్నీ తిరిగి తిరిగి వాటి గూడు ఉన్న వృక్షం దగ్గరకు చేరినట్టే సమస్తం ఎంతో గొప్పదైన ఆత్మలో లీనమైపోతాయి. నేను అనే స్ఫురణ, ఇంద్రియాలు, పంచప్రాణా లు, పంచభూతాలు, అన్నీ ఎక్కడ లీనమైపోతున్నాయో ఆ అమరమైన ఆత్మను ఎవరు స్వయంగా అనుభూతి చెందుతాడో వాడే సర్వజ్ఞుడు.
1. మానవుని శరీరంలో ఏవి నిద్రిస్తున్నాయి? ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతని యొక్క అవయవాలు, ఇంద్రియాలన్నీ మనసులో లీనమై పోతున్నాయి.
2. ఏవి మెలుకువగా ఉండి తమ తమ వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాయి?
ప్రాణం తనను ఐదు భాగాలుగా చేసుకొని, శరీరంలో ఎల్లవేళలా మెలుకువగానే ఉంటుంది.
3. స్వప్నాలను అనుభవించే దైవం? మనస్సు
4. స్వప్న సుఖాన్ని పొందేది? మనస్సే
కాబట్టి ఇవన్నీ ఆత్మలోనే లీనమౌతున్నాయి అని ప్రశ్నోపనిషత్‌ లోని 4వ ప్రశ్న ద్వారా
పిప్పలాదుడు గార్గ్యునికి వివరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement