Tuesday, November 19, 2024

భగవంతుడిని చూపించేదెవరు

లీలా మానుష రూపుడు… మహమాన్వితుడు అయిన ఆ భగ వంతుడిని ఒక్కసారి కనులారా చూస్తే చాలని జీవితమంతా వేదన పడేవారు ఎందరో! ఒక్క క్షణం కనిపించి జన్మ ధన్యం చేయమని, ఆ భగవంతుడికే మొరపెట్టుకునే వారు, రోదించే వారూ మరెందరో!
అలాంటి పరిస్థితుల్లో భగవంతుడ్ని నేను చూసాను అని ఎవరై నా అంటే ఏం చేస్తాం? మనకూ అతను దేవుడ్ని చూపిస్తాడేమో అనే ఆశతో మనం అతడ్ని ఆశ్రయిస్తాం. పైగా తాను చూసిన దేవుడ్ని మన కూ ఆయన చూపెట్టగలడని తెలిస్తే మహదానంద పడిపోతాం. దేవు డ్ని చూపించమని ఆయన్ని ప్రార్ధిస్తాం. ప్రాధేయపడతాం.
శ్రీ రామకృష్ణ పరమహంస సశరీరంగా ఉన్న రోజులవి. పరమ హంస దేవుడ్ని చూసారని, అవసరమైతే అందరికీ దేవుడ్ని చూపించ గలరని, చూపిస్తారని ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ మాట ఆ నోటా యీ నోటా పాకి ఓ పిల్లాడి చెవిన పడింది. అతనికి దేవుడ్ని చూడాలనే కోరిక కలిగింది.తిన్నగా రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
”ఏంటి సంగతి?” అని అడిగారు పరమహంస. ”నాకు దేవుడ్ని చూడాలని ఉంది. చూపించండి.” అని అడిగాడు కుర్రాడు. ”ఇప్పుడు కాదు. రేపు ఉదయం రా నీకు దేవుడ్ని చూపిస్తాను.” అని పరమహంస చెప్పారు. ”నిజంగానా!” అన్నాడు కుర్రా డు. ”నిజంగానే.” అని హామీ ఇచ్చారు పరమహంస. కుర్రాడు బాగా సంతోషించాడు. రేపు ఉదయం దేవుడ్ని చూస్తాను అనే ఆనందంలో రాత్రంతా బాగా నిద్రపోయాడు. తెల్లారింది. ఉదయమే శుభ్రంగా తయారై రామకృష్ణులు గారి దగ్గరకు వెళ్ళాడు. ”నిన్న సాయంత్రం వచ్చాను కదా. రేపు ఉదయం రా దేవుడ్ని చూపిస్తాను అని చెప్పారు కదా. దేవుడ్ని చూపిస్తే చూడాలని వచ్చాను. చూపించండి.” ఉత్సాహంగా అడిగాడు కుర్రాడు.
పరమహంస చిన్నగా నవ్వి ”పద. చూపిస్తాను.” అని కుర్రాడికి చెప్పి కుర్రాడిని దగ్గర లో ఉన్న నది దగ్గరకు తీసుకెళ్ళారు. కుర్రాడితోసహా నీళ్ళలో దిగారు. ”దేవుడ్ని చూడా లంటే మనం పరిశు భ్రంగా ఉండాలి. కాబట్టి శుభ్రంగా తలారా స్నానం చెయ్యి.” అని చెప్పారు. స్నానం చేయడానికి కుర్రాడు నీళ్ళలో గబుక్కున మునిగాడు. నీళ్ళలో నుంచి తల తీద్దామని కుర్రాడు నీళ్ళలోంచి తలను లేపుతున్న సమయం లో కుర్రాడి మెడ దగ్గర తన చేతిని అదిమిపెట్టి కొంచెంసేపు నీళ్ళలో నుంచి కుర్రాడు పైకి రాలేనంతగా నొక్కి ఉంచారు. కుర్రాడు నీళ్ళలో గిలగిల కొట్టుకుంటున్నాడు. అప్పుడు కుర్రాడి మెడ మీంచి తన చేతిని తీసారు పరమ#హంస. వెంటనే కుర్రాడు నీళ్ళలోంచి పైకి వచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. ఊపిరాడక ఆపసోపాలు పడుతున్నాడు. కొం చెంసేప టికి తేరుకున్నాడు. తేరుకుని పరమహంస వైపు కోపంగా చూ స్తూ ”ఏంటండి మీరు. దేవుడ్ని చూపిస్తాను అన్నారు. నీళ్ళలోకి తీసు కొచ్చా రు. తలారా స్నానం చేయి అని చెప్పి, నేను నీళ్ళలో మునగగానే, నా మెడ మీద మీ చేతితో అదిమిపెట్టారు. నన్ను చంపేద్దామనుకున్నా రా? మీకిది భావ్యమా?” అని కోపంగా ధైర్యంగా పరమహంసగార్ని కుర్రాడు అడిగాడు. పరమ హంసగారి మీద కోప్పడ్డాడు.
పరమహంస గారు మాత్రం అలా పిల్లాడ్ని చూస్తున్నారు. ఆయ న ముఖంలో ఏ భావం లేదు. నిర్మలంగా ఉన్నారు. అలా ఉన్న పరమ హంసను చూసిన కుర్రాడికి చిర్రెత్తి పోయింది. ”ఏంటండి! దేవుడ్ని చూపిస్తానన్నారు. దేవుడేడీ చూపించండి.” అని నిలదీసి అడిగాడు కుర్రాడు.పరమహంస చిరున వ్వు నవ్వి ఇలా అన్నారు. ”చూడు నాయనా! ఇందాక నీళ్ళలో ఉండిపోయినప్పుడు, నీ ప్రాణాలను కాపాడుకునేందుకు, నువ్వు నీళ్ళలో గిలగిలలాడావు చూసావా? అలా ఆ దేవుని కోసం నువ్వు గిజగిజ కొట్టుకున్నప్పుడు, దేవుని కోసం నీ ప్రాణాలన్నీ గిలగిలా లాడినప్పుడు, ఆ దేవుడ్ని నీకు ఎవరూ చూపించాల్సిన అవసరంలేదు! నీకు నువ్వే ఆ దేవుడ్ని చూడగలవు. నేను కూడా దేవుడ్ని ఆ రకంగానే చూస్తున్నాను!” అని చెప్పారు.
కుర్రాడికి విషయం అర్ధమైంది. అవును. దేవుణ్ణి మనకి ఎవరూ చూపించాల్సిన పని లేదు. మనం దేవుని కోసం తపిస్తే, తపన పడితే, ఆ దేవుడే మనకి కనిపిస్తాడు. దేవుని కోసమే అనుక్షణం పలవరిస్తే ఆ దేవుడే మనముందు సాక్షాత్కరిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement