ఒకసారి నారాయణుడు లక్ష్మీ దేవితో ”ప్రజలలో ఎంత భక్తి పెరిగింది. అందరూ ”నారాయణ” అంటూ జపిస్తున్నారు.
ఆ మాటలు విని లక్ష్మీదేవి ”అది మీ కోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీమీద భక్తి పెరిగింది అని అంటుంది.
”అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటంలేదు” అంటా డు నారాయణుడు. ”అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు” అంది. సరే అంటాడు నారాయణుడు.
నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, ”మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు?” అని అడుగుతాడు. ”నా పేరు లక్ష్మీపతి,మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకొంటున్నా ను” అంటాడు. గ్రామాధికారి ”అలాగా మహాభాగ్యం. మీరు మాఇంట్లో ఉం డండి” అన్నాడు. మొదటి రోజు పదిమంది వస్తారు, రెండవ రోజు మూడవ రోజులలో మరింత పెరిగి కూర్చోటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ వుంటారు. ప్రజ ల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళుతున్న స్త్రీతో ”దాహంగా వుంది కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా” అంటుంది. ”అమ్మా నేను హరికథ వినేందుకు వెళుతున్నాను” అంటుంది. ”నాకు కొన్ని నీరు ఇవ్వు నీకు అమి తమైన పుణ్యం లభిస్తుంది” అని లక్ష్మీ దేవి అడిగితే కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడిచెంబుతో నీళ్లు ఇస్తుంది. లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగా రం చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ”ఎంత మహమగల తల్లివి. నీకు ఆకలి వేస్తుందేమో వుండు అన్నం పెడతాను” అంటుంది. ”లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు” అంటూ అక్కడనుంచి వెళ్లిపోతుంది. ఆ స్త్రీ హరికథకు వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఆడవారికి చెబుతుం ది, దాంతో స్త్రీలందరు మధ్యలోనే లేచి వెళ్లిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీ యంగా తగ్గడంతో లక్ష్మీపతి ”భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది” అన్నాడు. ఎవరో ”ఒక మహామగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటి కైన వెళ్లి ఏ వస్తువులో ఏమి తాగిన, తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది,” అంటాడు. లక్ష్మీదేవి వచ్చిదని నారాయ ణుడికి అర్థం అవుతుంది.
గ్రామాధికారి కూడ ఆ వృద్ధు రాలి దగ్గరకు పోయి ”అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను? మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు?” లక్ష్మీదేవి ”మీ ఇంటికే నేను మొద ట వచ్చాను! మీ ఇంట్లో హరికథ చెప్పే వారు వుండటంతో నేను రాలేదు, అత ను వెళ్లిపోతే నేను వస్తాను.” అంటుంది. గ్రామాధికారి ”నేనిప్పడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను” అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ”మహారాజా! ఇక మీరు ధర్మశాలలో వుండండి. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి” అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి, గ్రామాధి కారిని ”మీరు బయటకు వెళ్లండి, నేను వారితో మాట్లాడతాను” అంటుంది. ”ప్రభూ! ఇప్పుడు ఒప్పుకున్నా రా? భక్తులు మీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని” అంటుంది . వెంటనే నారాయణుడు ”అవును ఇదంతా నీప్రభావం. కానీ నీవు నాకోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెబుతారో అక్కడనే నీవూ వుం టావు” అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో ”నేను కూడా వెళుతున్నా నారాయణు డు ఎక్కడ వుంటే అక్కడనే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడ ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను” అని వైకుంఠం చేరు కుంటుంది.
- డా. చదలవాడ హరిబాబు
9849500354