ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజులో ఈ మహా జాతర జరుగు తుంది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 16 నుండి 19వ తేదీ వరకు జర గబోతున్న ఈ జాతరకు గిరి జనులు గిరిజనేతరులు కోటి యాభై లక్షలకు పైగా వస్తారని ఒక అంచనా. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా,ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రలతో పాటు విదేశాల నుంచి సైతం అమ్మవా ర్లను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు 332 కోట్లకు పైగా ఖర్చుపెట్టి భక్తుల కోసం అనేక శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈసారి కూడా జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లకు పైగా నిధులను విడుదల చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేప ట్టింది. గిరిజన సంస్కృతి సంప్ర దాయాలకు అద్దం పట్టే మేడారం జాతరను విజ యవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసు కోవడం జరుగు తున్నది. ప్రత్యేక వైద్యశాలలు, ఆరొగ్య శిబిరాలు, అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగు తున్నది. ప్రత్యేక ఐసోలేషన్ కేం ద్రాలు కూడా ఏర్పా టు చేస్తున్నారు. భక్తులకు ఉచి తంగా మాస్క్‌లను అందించనున్నారు. పెద్ద సంఖ్యలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ జాతరలో సేవ లందిస్తున్నారు. జాతరకు వచ్చేందుకు తెలంగాణ వ్యాప్తంగా 3845కి పైగా ప్రత్యేక బస్సులు నడపడా నికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది . మేడారం జాత రను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిధులు విడుదల చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నది. 1996లోనే రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు జాతీయ హూదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం 2008 నుంచి కోరుతున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రయత్నాలను ముమ్మరం చేసినను కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అధికారులు ఎన్నోసార్లు కేంద్ర మంత్రు లను కలిసి మేడారానికి జాతీయ హోదా కల్పించాలని విన్నపాలు అందించడం జరిగింది. 2020 జాతర సమయంలో అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు మన మంత్రులు పూర్తి వివరాలతో మేడారం జాతర సమగ్ర నివేదికను సమర్పించినా కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. జాతీయ హోదా కల్పిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. దేశవ్యాప్తంగా జాతరకు గుర్తింపు వస్తుంది. మేడారం జాతర ప్రాంతం పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
-పుల్లూరు వేణుగోపాల్
97010 47002
మేడారానికి జాతీయ హోదా ఎప్పుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement