షిర్డీ సాయిబాబా తన దేహాన్ని నడపడం కో సం, దేహానికి స్వతహాగా వుండే ఆకలిని తీర్చడం కోసం షిర్డీ గ్రామంలో బిక్షాటన చేసేవారు. ఒకసారి ఆయన షిర్డీలో బిక్షాటన చేస్తుంటే ఒక ఇల్లాలు సాయి బాబాకి ఒక రొట్టె అందించింది. తాను ఇచ్చిన రొట్టె తీసుకుని బాబా తింటారని భావించింది. అయితే ఆ ఇల్లాలు ఇచ్చిన రొట్టెను అందుకున్న బాబా దానిని అక్కడే వున్న ఓ కుక్కకు అందించారు. ఆకలిగా వున్న ఆ కుక్క ఆ రొట్టెను అందుకుని ఆబగా తినడం ప్రా రంభించింది. బాబా చేసిన ఈ చర్య ఆ ఇల్లాలికి విం తగా అనిపించింది. ”అదేంటి బాబా… నా దగ్గర ఉన్న ఒకే ఒక రొట్టె మీకు ఇచ్చాను. మీరు ఆ కుక్కకి దాన్ని వేసేశారు. ఇప్పుడు మీ ఆకలి ఎలా తీరుతుం ది?” అని ప్రశ్నించింది. దానికి బాబా చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ”ఆ కుక్క ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే” అన్నారు. బాబా జీవ కారుణ్యానికి తార్కా ణంగా నిలిచే అనేక సంఘటనల్లో ఇది ఒకటి.
షిర్డీ సాయిబాబా గురించి యావత్ ప్రపంచాని కి తెలియజేసిన మొదటి గ్రంథం ‘సాయి సచ్ఛరిత్ర’. దీనిని మరాఠీ భాషలో హమడ్ పంత్ అనే సాయి భక్తుడు రచించారు. సాయిబాబాను చాలా దగ్గరగా చూస్తూ, ఆయనతో సన్నిహతంగా వుంటూ, తన ఎదుట జరిగిన ఘటనలు, భక్తులు చెప్పిన అనుభ వాలు… ఇలా అన్నిటినీ క్రోడీకరించి ఆయన ఈ గ్రం థాన్ని రాశారు. హమడ్‌పంత్ అసలు పేరు రఘు నాథ దభోల్కర్. సాయిబాబా ఆయన్ని ‘ హమడ్ పంత్’ అని పిలుస్తూ వుండటం తో ఆ పేరే ఆయనకు స్థిరపడింది. హమడ్‌పంత్ మొదటిసారి షిర్డీ సాయి ని దర్శించడానికి వచ్చినప్పుడు ఆసక్తికరమైన సం ఘటన జరిగింది.
ఆధ్యాత్మికాభిలాషి అయిన హమడ్‌పంత్ సద్గు రువును అన్వేషిస్తూ షిర్డీకి చేరుకున్నారు. హ మాండ్ పంత్ మొదటిసారి సాయిబాబాను దర్శించినప్పు డు బాబా తన ముందు తిరగలి పెట్టుకుని గోధుమ లు విసురుతున్నారు. పక్కనే వున్న గోధుమలను తిర గలిలో పోస్తూ పిండిగా మారుస్తున్నారు. షిర్డీ సాయి బిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ వుంటారని హమడ్ పంత్ అప్పటికే విని వున్నాడు. మరి బిక్షాట న చేసే బాబా తిరగలిలో ఎందుకు పిండి విసురుతు న్నాడో హమడ్‌పంత్‌కి అర్థం కాలేదు. ఏం జరుగు తుందో చూద్దామని ఆయన బాబాని గమనిస్తూ వుండిపోయారు. ఇంతలో కొందరు మహళలు బా బా దగ్గరకి వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ వున్న గోధు మలను తీసుకుని తిరగలిలో వేస్తూ వాటిని పిండి చేయడానికి సహకరించారు. వాళ్ళూ కాసేపు తిరగలి తిప్పి ఉన్న గోధుమలన్నిటినీ పిండిగా మా ర్చారు. గోధుమలన్నీ పిండి అయిపోయిన తర్వాత ఆ మహ ళలు… ”బాబా.. బిక్షాటన చేసుకునే నువ్వు ఈ పిండిని ఏం చేసుకుంటావు.. మాకు ఇచ్చేస్తే నీకు కొన్ని రొట్టెలు ఇస్తాం” అన్నారు. వారి మాటలు విన్న బాబా వారిమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ”ఈ పిండి మన పొట్టలు నింపడానికి కాదు… ఈ పిండిని తీసుకెళ్ళి ఊరవ తల పారబోసి రండి” అని గద్దించా
రు. దాంతో బాబాని పిండి అడిగి పొరపాటు చేశామ ని అర్థం చేసుకున్న ఆ మహళలు ఊరి చివర పారబో యడానికి ఆ గోధుమపిండిని తీసుకుని వెళ్ళారు.
బాబా చేసిన ఈ చర్య కూడా హమడ్‌పంత్‌కి ఎంతమాత్రం అర్థం కాలేదు. ఆ గోధుమ పిండి మన పొట్టలు నింపడానికి కాదు అని చెప్పిన బాబా, దాన్ని ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చి సద్వినియోగం చేయా లి… అలాకాకుండా ఊరి చివర పారబోసి రమ్మన్నా రెందుకో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. హ మాండ్ పంత్ సందేహానికి ఆ తర్వాత సమాధానం సాయిబాబాతో వుండే భక్తుల ద్వారా లభించింది. ఆ సమయంలో కలరా వ్యాధి వ్యాపించి వుంది. షిర్డీ గ్రామ ప్రజలు కలరా వ్యాధి నుంచి తమను కాపాడా లని సాయిబాబాకి విజ్ఞప్తి చేశారు. కలరా వ్యాధిని నివారించడం కోసమే బాబా తిరగలి విసిరి, గోధుమ పిండి తయారుచేసి ఊరి చివర పారబోసి రమ్మన్నా రని అర్థం హమడ్‌పంత్ చేసుకున్నారు. బాబా విసి రింది గోధుమలను కాదని, కలరా మహమ్మారినే పిండి చేసి ఊరి చివర పారబోయించారని అవగత మయింది. బాబా ఏ పని అయినా ఎందుకు చేస్తున్నా రో చెప్పరు. కానీ చేసే ప్రతి పని వెనుక ఓ అంతరార్థం వుంటుందని హమాండ్‌పంత్‌కి అర్థమైంది. ఆ తర్వాత షిర్డీలోనే స్థిరపడిపోయారు. ‘సాయిసచ్ఛ రిత్ర’ రాసి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు.