Friday, November 22, 2024

నాస్తికుడే ఆస్తికుడైన వేళ…

పూర్వం ఒక కట్టెలు కొట్టుకొని బ్రతికేవాడు ఉండేవాడు. అతను రోజూ వెళ్లే దారిలో ఒక గుడి వుంది. ఆ గుడిలో పూజారి మం త్రాలు చదువుతూ కనిపిస్తూ ఉండేవాడు.ఒకనాడు కట్టెలు కొట్టుకోవటా నికి వెళుతుండగా దారిలో ఎదురయ్యాడు పూజారి. నాస్తికుడైన ఆ కట్టెలవాడు ఆయనతో ఇలా అన్నాడు.”ఎందుకు? రోజూ అలా దేవుడిని పూజిస్తావు దేవుడు ఎక్కడున్నాడు” అని వాదించాడు. ఇంకా ఇలా అన్నాడు. ”నిజంగా ఆ దేవుడే కనుక వుంటే ఆయన్ని దిగివచ్చి నా గురించి నేను తెచ్చుకున్న ఈ రొట్టెలను నాకు తినిపించమను చూద్దాం” అన్నాడు. అతని మాటలు విని పూజారి చిరునవ్వు నవ్వి ”సమయం ఆసన్నమైనప్పుడు ఆ విషయం నీకు అర్థం అవుతుందిలే” అని మాట దాటవేసి తన దారిన వెళ్ళిపోయాడు. కట్టెలు కొట్టే అతను ఒకనాడు చెట్టు ఎక్కి కొమ్ములు నరుకుతూ ఉండగా ముగ్గురు దొంగలు వస్తూ ఉండటం చూసి మౌనంగా అక్కడే కొమ్ముల మధ్యన కూర్చున్నాడు. ఆ చెట్టు వద్దకు చేరుకున్న దొంగలు ఆ చెట్టు కింద కూర్చుని వారు దొంగిలించిన నగలను ముగ్గురు పంచుకుంటున్నారు. వారికి ఆ చెట్టు కింద పక్కనే రొట్టెల మూట కనబడింది. అది ఆ కట్టెలవానిది. ఆకలిగా ఉన్న దొంగలు ”దేవుడు నగలతోపాటు ఆహారాన్ని కూడా ప్రసాదించాడు” అనుకుంటూ, ఆ మూటను విప్పదీశారు. సరిగ్గా అదే సమయంలో ఆ చెట్టు నుంచి ఒక పుల్ల రాలడం జరిగింది. వారు తల పైకెత్తి గమనించగా ఆ కట్టెలతను కనిపిం చాడు. ఇంతలో వారికి ఒక సందే#హం కలిగింది. చెట్టుపైన వున్న అతను తమకు విషపు రొట్టెలను తినిపించి ఈ నగలు దొంగిలించాలని భావించాడేమో అనుకున్నారు. వెను వెంటనే చెట్టుపై వున్న అతన్ని బెదిరించి కింద కు దిగిరమ్మని చెప్పారు. చెట్టు దిగివచ్చిన కట్టెలతనిని ”ఏరా! ఈ విషపు పెట్టిన రొట్టెలు మాకు తినిపించి ఈ నగలను దొంగలించదలిచావా? ఎంత ధైర్యం నీకు” అంటూ ముగ్గురూ గద్దించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రొట్టె ముక్క అతనికే బలవంతంగా తినిపించారు. అతను మరణిస్తాడేమో అని ఎదురు చూశారు. కాని, అలా జరగలేదు. అంతట వారు తమ దారిన తాము వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది ఆ కట్టెలు కొట్టే అతనికి దేవుడు వున్నాడని. పూజారి మా టలు చెవుల్లో మారుమ్రోగినాయి. అందుకే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత ఏకో స్వరోపాసన అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement