Saturday, November 23, 2024

తృప్తిని మించిన సంపద ఏది

మనిషికి కోరికలు అనంతం. జీవితం నీటి బుడగ వంటిదని తెలిసి కలకాలం బతకాలనుకొంటా డు. నిరంతరం శుఖాల్లో తేలియాడాలని తపిస్తా డు. తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్ధంతో పూజిస్తాడు. భగవంతుడు దయామయుడు. అందరి ప్రార్ధనలు వింటాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. నిస్వార్ధంగా భగవంతుని నమ్ముకున్న వారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు. కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తికాగానే ఒక్కో తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదోతలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. మరణంలేని వరం ప్రసాదించమంటాడు. అలాంటి వరం ప్రసాదించడం అసా ధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. మానవు లు తనకు గడ్డిపరకల వంటి వారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరు కుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇచ్చాడు. కుంభకర్ణుడు గ్రీష్మ ఋతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షఋతువులో వానలో తడుస్తూ, శిశిర ఋతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీ య సంకల్పించ గానే అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవ తలు. అడ్డుపడ తారు. సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిదుర కావాలంటా డు కుంభకర్ణుడు.’తథాస్తు’ అంటాడు కమలాసనుడు.
విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవ త్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు.
అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండే సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు. ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవ త్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు.లోకాలను జయించి చిరంజీవి కావాలను కున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరం లో నిద్రావస్థలో ఉండిపోయాడు. ‘భగవంతుని శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి. తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమం టే ఆయనను శాసించినట్లవుతుం ది. ఆయనను ఒప్పించ డం ఎవరికీ సాధ్యంకాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు!’ తృప్తినిమించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడంలేదని ఆవే దన చెందేవారికి జీవితమంతా ముళ్లబాటే. తృప్తితో జీవ నం సాగిస్తే ఆనందం వెన్నంటే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement