Tuesday, November 26, 2024

భాగవత ప్రయోజనం ఏమిటి

భాగవతుల గాథలను గూర్చి చెప్పేది భాగవతము. భగవంతుని తత్త్వాన్ని గూర్చి వివరించేది భాగవతము. ఎక్కడి నుండి ఈ భూమికి వచ్చాము, ఎక్కడికి వెళతాము, రాకపోకల మధ్యనున్న ఈ జీవిత ప్రయోజనమేమిటో అవగతం చేసుకునేందుకు ఉపకరించేది భాగవతము. లక్ష్యాన్ని చేరడానికి కర్మ మార్గము, జ్ఞానమార్గము, భక్తి మార్గ ము అనే మూడు మార్గాలనూ ప్రవచించింది భాగవతము. కర్మమార్గంలో కర్తవ్య నిర్వహణ ద్వారా అమరత్వాన్ని సాధించడము, జ్ఞానాధ్య యనంలో ఆధ్యయనాధ్యాపకత్వాల ద్వారా మోక్షాన్ని సాధించడము, భక్తిమార్గంలో సర్వ సమర్పణా భావన ద్వారా భగవంతునిలో లయం కావడం, ఈ మూడూ జీవన్ముక్త స్థితికి చేరుస్తాయని భాగవతం చెపుతున్నది. జప తపములు, యోగ సాధన, జ్ఞానసాధన లాంటి వాటితో అర్హ తను పెంచుకోవడం, ధర్మా ధర్మ మార్గాలను అవగతం చేసుకోవడం తద్వారా వివేకాన్ని పొంది తన మూలాలను అన్వేషి స్తూ ఆ వివేకంలో తాదాత్మ్యతను, తన్మయతను పొందడం ఒక విధానం. అది కర్మ మార్గంలో, జ్ఞానమార్గంలో సిద్ధిస్తుంది. వీరిని జ్ఞానులుగా చెపుతారు. ఆ మార్గాన్ని అనుసరించలేని వారు భక్తి మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ప్రగతికి సర్వసమర్పణ బుద్ధియే మూల సూత్రము. వీరికి తమ అర్హతానర్హతలతో పని లేదు. అన్నీ భగవంతునికే వదలివేస్తూ తాము నిమిత్తమాత్రులుగా వ్యవహరిస్తుంటారు. వీరి ని ప్రపన్నులని అంటారు. జ్ఞానులు తమ తప్పి దాలకు తామే బాధ్యులౌతారు అదే ప్రపన్నులు తమ సర్వస్వాన్ని భగవదర్పితం చేయడం వల్ల వారికి ఆ తప్పిదాల ఫలితం అంటదని పెద్దలు చెపుతారు. నిజానికి జ్ఞానులు, ప్రపన్నులు ఇరు వురూ జిజ్ఞాసువులే. సర్వవ్యాపక శక్తియైన విష్ణువు ఈ సమస్త చరాచర సృష్టికి ఆద్యుడు. ఆ విష్ణువే నారాయ ణుడు. ఆయన నియమానుసారం బ్రహ్మ సృజించగా తాను పాలిస్తూ శంకరుని లయకారకునిగా ప్రకటించాడు. సృష్టి యొక్క గతికి భంగం కలిగిన సమయంలో తాను అవతారా లను ఎత్తుతూ ధర్మాన్ని రక్షించడం ఆయన కర్త వ్యంగా చెపుతారు. విష్ణువు సర్వవ్యాపకునిగా ఉన్నా నారాయణాంశ అవతారాలను ఎత్తడం, సృష్టి ధర్మాన్ని కాపాడడం జరుగుతుంది. వేద వ్యాసులు సమస్త వేదాది విజ్ఞానాన్ని సముపార్జించి, సంస్కరించి కలియుగానికి అవసరమైన విధానంలో అందించాడు. అలా గే పరాశరుడు వేదవాఙ్మయముననున్న విజ్ఞా నాన్ని సంస్కరించి విష్ణు పురాణముగా నిబద్ధీక రించాడు. దానిని వ్యాసులవారు 18 పురాణా లుగా విభజించి అందించాడు. ఆయన తన శిష్యుడైన సూతుని ద్వారా ఆ పురాణాలను ప్రచారం చేయించాడు. కష్టజీవులకు కావలసినది అనుభూతి. భక్తిభావనతో కూడిన అనుభూతి, అనుభవ ప్రధానమై భగవంతుని గూర్చి అనుభవ పూర్వకంగా తెలుసుకునేందుకు మార్గం చూపుతుం ది. వేద విజ్ఞానం అనుభూతిని ఇస్తుంది కాని దానిని అభ్యసించిన వేళ మనసు అనుభూతిని చెందడం కన్నా విజ్ఞాన శాఖలపైకి, మీమాంస లపైకి, చర్చోపచర్చలపైకి మళ్ళే అవకాశం ఉన్నది. జ్ఞాన సాధనలో అనుభూతికన్నా జిజ్ఞా సయే అధికం. భ్రమలు హచ్చి గుణదోష విమర్శలతో మత భేదాలు లేదా అభిప్రాయ భేదాలు కూడా ఆవిష్కృతం కావచ్చు. అంతేకాక అల్పా యుష్కులైన మానవులు సాధారణంగా అర్థ కామాదులను సాధించడంలో ధర్మాన్ని అను సరిస్తారే కాని ధర్మం కొరకు అర్థకామాలనే భావనకూ దూరమయ్యే అవకాశమూ ఉన్నది. దానిని దృష్టిలో పెట్టుకొని వ్యాసుల వారు విజ్ఞానాన్ని అభ్యసించేందుకు అవసరమైన మేధ లేని వారిని కూడా తరింపచేసేందుకు భాగవత గాథలను ప్రవచించారు. అలసత్వ భావన కలిగినవారు, మందబుద్ధి కలిగిన వారు, అల్పాయుష్కులు, పెద్దపెద్ద రోగాలతో బాధింపబడేవారు, మందభాగ్యులునైన మాన వులు కలియుగంలో ఏకాగ్రతలేని కారణంగా అర్థకామాల సాధనలో తలమునకలై సకల సౌఖ్యప్రదమైన మార్గాన్ని గుర్తించలేరు. కాబట్టి వారిని తరింపచేసే మార్గాన్ని తాను తెలుసుకోలేని కారణంగా వ్యాసమహర్షి ఆ మార్గాన్ని చెప్పమని నారదుని అడగడం… నారదుడు ఆ మార్గాన్ని వ్యాసులకు ఉపదేశిం చడం జరిగింది. సృష్టి సమయంలో విష్ణువుగా కృష్ణుడు బ్రహ్మకు ఉపదేశించిన భాగవత ధర్మ రహస్యాలు, కృష్ణ నిర్యాణకాలంలో మైత్రేయునికి, మైత్రేయునిచే విదురునికి ఉపదేశించబడ్డాయి. నాదోపాసన ద్వారా పరబ్రహ్మ మున లయంకావడం కూడా భక్తి మార్గంగానే చెప్పబడింది. ఆ మార్గమే భాగవత సంప్రదాయంగా కూడా నిలిచిందని చెపుతారు. సంకీర్తనలు, భజనలలాంటి వాటికి అదే మూలం. ఏదయినా ఆనందానుభూ తిని ప్రసాదించడమే అత్యంత ఆవశ్యకమైన విషయం. ఆ నాదోపాసనకు సమానమైనది సాహిత్యోపాసన అంటారు. నిజానికి భారతాది గ్రంథాల ప్రయోజనం విజ్ఞానార్జన కాగా భాగ వతానికి అనుభూతిని పొందడం ప్రధానము. నారదుడు (నారం దదాతి ఇతి నారద- జ్ఞానమును ఇచ్చువాడు నారదుడు) నాదోపా సనను, సాహిత్య ఉపాసనమును చేసి తరిం చాడు. అతని ఉపాసన మూడు అంతస్తరాలలో జరిగింది అంటారు. అవి- ఒకటి విష్ణూపాసనము, రెండవది వాసుదేవోపాసనము, మూడవది నారాయణో పాసనము. విశ్వమే విష్ణువు అని భావిస్తూ ఆకార భావాదులను స్మరించుకొనుచు ముందుకు సాగడం విష్ణూపాసనగా చెపుతారు. అంతటా వసించునట్టి భగవంతుడిని అన్నింటిలోనూ దర్శిస్తూ, భావిస్తూ కామక్రోధాదులకు అతీతం గా ఉపాసించడం వాసుదేవోపాసనగా చెప్ప బడింది. ఇక జీవుని అంతర్గత ప్రజ్ఞ భగవం తుని అనంత ప్రజ్ఞలో లయమై సర్వాంతర్యా మిత్వాన్ని పొందుతుందనే ”యెఱుక”ను కల గడం నారాయణోపాసనగా చెపుతారు. ఈ మూడు సోపానముల యందు లేదా అంతస్తర ముల యందు లేదా పార్శ్వముల యందు ఆచ రణీయమైన మార్గమును చూపి అనుభూతిని కలిగించి ఉపదేశమును చేయడమే భాగవత ము యొక్క పరమార్థము. ఆయా మార్గాలలో భగవంతుని దర్శించి తరించిన భాగవతుల గాథలను అస్వాదించి అనుభూతులను పెంచుకొని, ఆ మార్గాలలో ప్రయాణించి జీవితాన్ని సార్ధకం చేసుకోవ డమే భాగవత ప్రయోజ నంగా భావిస్తూ…

  • పాలకుర్తి రామమూర్తి
Advertisement

తాజా వార్తలు

Advertisement