Saturday, November 9, 2024

మనం.. మనలోని త్రిగుణాలు

మనిషి జీవితంలో సంభవించే భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాడు. తనకు సంతోషకరమైన, లాభకరమైన కార్యం సిద్ధిస్తే- మనసు ఆనందంతో ఉండి ఉరకలేస్తూంటుంది. ఆ సంతోషాన్ని కుటుంబంతో, మిత్రులతో పంచుకొంటాడు. అదే వ్యక్తి కి కొంచెం ఏమాత్రం కష్టం వచ్చినా, నష్టం కలిగినా, మనసు చింత లతో, వ్యాకులపడుతూంటుంది. అప్పుడు మనం ప్రవర్తించే తీరు మరొక రకంగా ఉంటుంది కదా!
మనిషి తన జీవిత చరమాంకంలో అంటే, వానప్రస్థానములో భగవతత్త్వాన్ని గురించి, మోక్ష సాధన చేస్తూ గడచిన జీవితంలోకి తొంగి చూస్తూ, అనుభవాలను సమాజానికి, అందివ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఇలా మూడు రకాలుగా స్పందిస్తుంటారు. ఆ మూ డూ మూడు గుణాలకు ప్రాతిపదిక.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి త్రిగుణాలు గురిం చి బోధిస్తూ-
”సత్వ రజస్త మ ఇతి గుణా: ప్రకృతి సంభవా!
నిజద్నంతి మహాబాహోదేహ దేహన మవ్యయమ్‌!” అన్నాడు.
అంటే సత్వ—రజో—తమో—గుణములు ప్రకృతి వల్ల ఈ జీవా త్మను, దేహాన్ని బంధించడం వల్ల, మనిషి ఆ త్రిగుణాలులో బందీ అవుతున్నాడు. ప్రకృతిలో అంతర్భాగమైన ఈ మానవుడు, జీవి తంలో జరిగే సంఘటనలకు, మార్పులకు, లోనవుతున్నాడు.
మనిషిని ఆశ్రయించిన ఈ మూడు గుణాలకు ‘మనస్సే’ ప్రధా న కారణం. ఆధార భూతం కూడా.మనిషి ప్రవర్తించే త్రిగుణాలు పూర్వజన్మ కర్మలవల్లనే స్పందింస్తుంటుంది. ఆ మూడు గుణాలను విశ్లేషిద్దాం! అవి-
సత్వ గుణం , రజో గుణం, తమో గుణం.
ఈ మూడు గుణాలకు లోను కాని మనిషి పుట్టలేదు.
సత్వ గుణంరజో గుణం తమోగుణం

ఈ గుణం నిర్మలమైనది. ఆరోగ్యవంతమైనది. సత్వగుణోపే తులు జ్ఞానము నందు, సుఖంనందు అనురాగం కలిగి ఉంటారు. దీనివల్ల మనుషులను ఆకర్షించ గలుగుతున్నారు. మనసులో ఏ రక మైన కల్మషం ఉండదు. భగవతత్త్వానికి, మోక్ష సాధనకు ఆరాట పడుతుంటారు. తన- పర అనే తేడా లేకుండానే పరులకు సహా యం అందిస్తారు. స్వార్థ రహితులు.
రజో గుణం

ఈ గుణంతో ఉన్నప్పుడు ఉద్రేకంగా వ్యవహరిస్తారు. ప్రేమ- అభిమానం- ఆశ లతో ఎక్కువగా ఉంటారు. అహంకారపు ఛాయలతో ఆశాపాశం, మోహావేశులై ఉంటారు. మనస్సు నందు సంకల్ప వికల్పాల శక్తి పెరిగి శాంతి లేకుండా ఉంటారు
ఆశలు ఏర్పడి, వాటి సాధనకు ఎటువంటి కర్మలనైనా చేయా లని ఆశక్తి కలిగి ఉంటారు.

తమోగుణం
తమోగుణ లక్షణం బద్ధకం. అలసత్వం. తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న రీతిలో మూర్ఖత్వంతో ఉంటారు. చెప్పుడు మాట లు వింటూ, మనసును గందరగోళం చేసుకొంటారు. ప్రజలను మోహంప చేసి, సోమరితనం, అతినిద్ర, భ్రమ లతో సతమతమవుతారు. ఈ గుణం కొంచెం ప్రమాదకరమైంది. దీనివల్ల మంచి చెడుగాను, చెడు మంచి గాను తోస్తూంటుంది. తొందరగా వ్యసన పరుడవుతాడు. ఆధ్యాత్మిక చింతన కాని, ప్రాపంచిక విషయా లు కాని చెవికి ఎక్కవు. వీరు పాడ వడమేకాక, ఇతరులను కూడా పాడు చేస్తారు. అజ్ఞానంతో వ్యవహరిస్తూ తర్వాత చింతిస్తుంటారు.
ఈ మూడు గుణాలు ప్రతీ జీవిలో మిళితమై ఉంటాయి. మనలో ఏ ఒక్క గుణం స్థిరంగా ఉండదు. దీనికి కారణం మనస్సు నియం త్రణ లేకపోవడమే!
ఇక్కడ రామాయణం చూస్తే మంథరలో రాజమాత కు సేవకురాలుగా ఉంటూ, మోక్షాన్ని పొందాలనే సంకల్పంతో కైకకు దుర్బోధ చేసింది కదా! మంథరది తమో గుణం. కైకేయి రజో గుణం. అలాగే పాండవులు సత్వ గుణోపేతులు. దుర్యోధనుడు కౌరవులు అంతా తమోగుణంతో ఉండబట్టే ఎప్పుడూ పాండవులు వినాశానికి పన్నాగం వేస్తూ ఉండేవారు. ధృతరాష్ట్రుడు రజో గుణంతో, కొడుకులు క్షేమాన్ని లోలోన ఆశిస్తూ పైకి నటించేవాడు. త్రిగుణాతీతుడు సర్వకార్యములు గుణాలవల్లనే సంభవిస్తు న్నాయని తెలుసుకొని, తనకు ఎదురయ్యే సుఖదు:ఖాలకు చలించ కుండా ఉంటాడో అట్టివాడే త్రిగుణాతీతుడు. గుణాతీతుడైన వ్యక్తి ఎవరు పొగిడిన లేక అవమానాలు చేసినా ఏమీ పట్టించుకోడు. అహంకారం, మమకారాలు ఉండవు. కీర్తిప్రతిష్టలు అక్కర్లేదు. ప్రతీ విషయంలో ఉదాసీనంగా ఉంటాడు. పూర్వం మన చిన్నప్పుడు తాతయ్యో, బామ్మో మనకు కథలు చెప్పిన సందర్భంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయడానికి ఒక నల్లమేకను తీసుకొని వెడుతుంటే, మార్గమధ్యంలో ఒక దొంగ ”అయ్యా! మీరు చూస్తే పండితులులా ఉన్నారు. ఈ కుక్కను తీసు కొని వెడుతున్నారేమిటి?” అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మ ణుడు ”ఇది కుక్క కాదయ్యా! మేక” అంటూ ముందుకుసాగాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి రెండో దొంగ ఎదురు పడి ”పంతు లుగారు! ఏమిటి? నల్లకుక్కను తీసుకుపోతున్నారు. యాగానికి పనిచేయదు కదా!” అనేసరికి ఆ బ్రాహ్మణుడు అనుమానంతో ఓసారి మేకను చూసి, ఇది మేకపిల్లే.” అని చెప్పి ముందుకుసాగాడు. కొంతదూరం వెళ్ళేసరికి మూడో దొంగ అలాగే ప్రశ్నించే సరికి, ఆ బ్రాహ్మణుడుకు తన మీద తనకే అనుమానం వచ్చి, ఆ మేకపిల్లను వదిలేసి వెళ్ళిపోయాడు.
ఈ కథ మనకు చెప్పేవారు. అప్పుడు అది కథగానే భావిస్తా ము. కాని ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, ఆ ముగ్గురు దొంగ లు మూడు గుణాలు. నల్లమేక అజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం వదిలి జ్ఞానం వైపు వెళ్ళమని. జ్ఞానం అంటే ఇక్కడ త్రిగుణాతీం.
ఆఖరికి ఆ బ్రాహ్మణుడు దైవ గుణం తెలుసుకోవడానికి పోయాడు. అలాగే మనం మనలో ఉన్న త్రిగుణాలను నియంత్రించి దైవగుణం వెపు వెడితేనే ఈ జన్మకు సాఫల్యత. మోక్ష ప్రాప్తి.

  • అనంతాత్మకుల రంగారావు, 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement