Friday, November 22, 2024

అమ్మ అనుగ్రహ మార్గాలు!

”మేము వేలు లక్షలు జపం చేయలేము, హోమాలు చేయలేము, దాన ధర్మాలు చేసే స్థితిలో లేము. మాకు అమ్మవారి అనుగ్రహం దొరకదా” అనుకోకండి. అవేమీ చేయకున్నా ధర్మవర్ధిని అయిన జగన్మాత కరుణను పొందడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి- ఈర్ష్యని వదిలేయాలి తమకన్నా ఉన్నతంగా ఉన్నవారిని చూసి ఆనంద పడకపోయినా పరవాలేదు కానీ అసూయ పడకూడదు. చాడీలు చెప్పడం ఒకరి గురించి తప్పుగా పుకార్లు పుట్టించడం, కల్పించి మాట్లాడటం, విడగొట్టడం లేనిపోనివి కల్పించి ఒకరి బాధకు కారణం కావ డం ఇటువంటివి చేసే వారు ఎన్ని పూజలు చేసిన ఉపయోగం లేదు. మిమ్మల్ని విసిగించే వారు మీ పట్ల ద్వేషాన్ని అసహ్యన్ని ప్రదర్శిస్తూ మాన సికంగా బాధించే వారిని పట్టించుకోవద్దు. మీరు బాధపడే కొద్దీ వాళ్ళ ఆనం దం ఎక్కువ అవుతుంది. వారు మానసిక రోగులనుకుని వదిలేయండి. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆశించండి, ఇంకొకరి కష్టాన్ని లాక్కోకండి, దొంగతనంగా ఏది తీసుకోకండి, పరాయి సొమ్ముకు ఆశపడకండి. అడ్డదారి లో డబ్బు సంపాదించే ఆలోచనలు, పనులు చేయకండి. ఆహారాన్ని వృధాచేయకండి. వీధి కుక్కలకు అయినా పెట్టండి.
ఇంట్లో అన్నిచోట్లా దుమ్ము ధూళి, మాసిన బట్టలు, తిన్న ఎంగిలి గిన్నెలు, నిద్ర లేచిన పడకలు, భూజు, ధూళి నిండిన దేవుని పటాలు పసుపు లేని గడ పలు, ఇంట్లో వెంట్రుకలు విరబోసుకుని తిరిగే ఆడవాళ్లు, పాచి పట్టి జారే బాత్రూమ్‌లు, పగిలిన అద్దాలు, ఆగిపోయిన గోడ గడియారాలు, స్టీల్‌ సామా న్లు కోసం దాచి పెట్టే వెంట్రుకలు.. నిల్చో బెట్టిన చీపురు కట్ట.. ఎప్పుడూ భర్తని, బిడ్డలను అరుస్తూ ఏడుస్తూ తిట్టు కుంటూ కసురుకుంటూ.. ఓపిక లేని ఆడ వాళ్లు ఇవన్నీ ఇంటికి దరిద్రమే..
భర్తను దిగజా ర్చి మాట్లాడే ఆడవాళ్లు, అలాగే భార్యని చులకనగా చూసే భర్త ప్రవ ర్తన వల్ల ఒకరికి మనసు కష్ట పెట్టడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి నిలువదు. పరాయి స్త్రీని కానీ పరాయి వాళ్ళ భర్తను కానీ ఆశించిన, ఇంకొకరి ద్రోహం చేయడం, మిమ్మల్ని నమ్మిన మీ జీవిత భాగస్వామికి ద్రోహం చేసినవారు అవుతారు. ఆ తల్లి అటువంటి వారిని దగ్గరకు రానివ్వదు. కుటుంబ సభ్యులపట్ల మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ, మీకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ, అసత్యం పలకకుండా ఒకరికి ద్రోహం చేయకుండా కేవ లం నామస్మరణ చేసుకున్నా చాలు. నిత్య దీపారాధన చేస్తూ తెలిసి నంత వరకు ప్రశాంతంగా ధ్యానం, నామస్మరణ చేసుకున్నా ఆ తల్లి కరుణిస్తుంది. ఇంట్లో పిల్లలను, భర్తను పట్టించుకోకుండా పూజలు వ్రతాలు చేసిన ఫలితం ఉండదు. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వహించడమే గొప్ప పూజ. ఇవన్నీ మన చేతిలో పని. మన ప్రవర్తన మార్చుకుంటే ఆ తల్లికి సులభంగా దగ్గర కావచ్చు.
సేకరణ: దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement