Wednesday, November 20, 2024

వ్యాసుని నైరాశ్యం…నారదుని సలహా

మహాభారతం, అష్టాదశ పురాణాలు రచించినా వ్యాసు డిలో ఉత్సాహం కలగలేదు. నైరాశ్యం చోటుచేసుకుంది. అప్పుడు నారద మహ ర్షి వ్యాసుని వద్దకు రాగా ఆయన తన నైరాశ్యాన్ని వివ రించాడు. అప్పుడు నారదుడు భగవత్‌ సంబంధం, భక్తి గూర్చి చెప్పని కావ్యం కావ్యమేకాదని అన్నారు. హరినామస్మరణ లేని ఎలాంటి కావ్యమైనా, పురాణ మైనా వృధా అన్నారు. లోకంలో బోధ చేయకపో యినా తెలుసుకునే విషయాలు అర్ధకామ్యాలు. నేటి కలియుగంలో మానవులకు సంస్కార బ లం, బుద్ధి బలం తక్కువగా ఉంటుంది. ఆయుర్దాయం తక్కువ, అర్ధకామ్యాలపై ప్రచోదన అధికంగా ఉంటుంది. ఇంద్రియాలను నిగ్ర హంచుకుకోలేని బలహనత ఉంటుంది. అది జన్మ జన్మల నుంచి వెంటాడుతుంది. మరుజన్మలో కూడా ఇంద్రియ లౌల్యం వదలదు. ఫలితంగా తరించే అవకాశం లభించదు. భగవత్‌ భక్తితో మాత్రమే ఆ వ్యధ తీరి మోక్షం లభిస్తుందన్నా రు. అందుకు తన కథనే ఉదహరించారు.
గత జన్మలో వేదవేదాంగాలు చదివిన ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తన తల్లి దాసీగా పనిచేసేద న్నారు. ఆమెతో పాటు ఐదేళ్ల వయసుగల తాను వెళ్లే వాడినన్నాడు. ఒకసారి నలుగురు సన్యాసులు చాతు ర్మాస్యానికి వీరి ఇంటికి వచ్చారు. ఆ ఇంటి యజమాని నారదుడితో స్నానం చేసి ఆ సన్యాసులకు చిన్నచిన్న సేవలు చేయాలని ఆదేశించాడు. నారదుడు వారికి నిష్కామంగా సేవ చేసేవాడు. వారు సంతుష్టులై తాము తినగా మిగిలిన ఆహా రాన్ని నారదుడికి ఇచ్చేవారు. వారు అన్నింటా పరబ్రహ్మాన్ని చూ సే సన్యాసులు. ఉదయం లేచిన తరువాత భగవంతుని అర్చించ డం, వేదాలు వల్లె వేయడం, దానిమీద చర్చ, భక్తిగీతాలు పాడుతూ సొగసుగా నాట్యం చేయడం చేసేవారు. అవన్నీ నారదుడు చూసి ఆనందించడమేకాక భక్తి పారవశ్యానికి లోనయ్యేవాడు. చాతుర్మాస్యం పూర్తి అయి వారు వెళుతూ నారదుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నారు. తమకు చేసిన సేవకు సంతృ ప్తులై కరుణతో కృష్ణపరమాత్మ మీద ద్వాదశాక్షరీ మహామంత్రం ఉపదేశం చేసారు. సత్పురుషుల సాం గత్యంవల్ల నారదుడి హృదయం పరిశుద్ధం అయిం ది. ఆ తరువాత విష్ణునామ స్మరణ చేసుకుంటూ తల్లి తోపాటు ఆ పండితుని ఇంటికి వెళ్లేవాడు. ఒకసారి నారదుని తల్లి పాలు పితుకుదామని పెరట్లోకి వెళ్లగా పాము కరచి చనిపోయింది. దాంతో ఉన్న ఒక్క బం ధం తెగిపోవడంతో నారదుడు హరినామస్మరణ చేసుకుంటూ అరణ్యంలోకి వెళ్లాడు. భగవంతుని స్మరణతో భయంలేకుండా అరణ్యంలో సంచరిస్తున్నాడు. దాహం వేస్తే నీరు తాగి రావి చెట్టు క్రింద కూర్చుని భక్తితో ద్వాదశక్షారీ మహా మంత్రం జపించడం ప్రారంభించాడు. మహావిష్ణు వు దర్శనం కోరుకున్నాడు. వెంటనే నారదుని భక్తిప్రపత్తులకు మెచ్చి లీలామాత్ర దర్శనం లభించింది. వెంటనే ఆ మూర్తి నుంచి మాటలు వినిపించాయి. నీ భక్తిని మెచ్చాను. నీకు ఉత్తర జన్మలో నారదుడుగా బ్రహ్మ మానసపుత్రుడిగా పుట్టేవరం ఇస్తున్నానని పలికాడు. మహతి అనే వీణ ఇస్తాను. దానితో నీవు #హరి నామం పాడుతూ అన్ని లోకాలు తిరిగే వరాలు ఇస్తున్నాన ని తెలిపాడు. సంతుష్టుడైన బాలకుడు దే#హం విడిచే వరకూ #హరినామస్మరణ చేస్తూ పర్యటన లు చేస్తూ గడిపారు. శరీరం విడిచిన అనంతరం బ్రహ్మలోకం చేరారు. కల్పాంతం జరిగి, కొత్త కల్పం ప్రారంభమయ్యేనాటికి నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. ప్రజాపతు లతోపాటు మానసపుత్రుడిగా నారదుడిని సృష్టించారు. అనంతరం మహతి ఇచ్చాడు. అప్ప టినుంచి వీణతో నారాయణ స్మరణతో అన్ని లోకాలనూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కేవలం హరినామస్మరణతో దాసీపుత్రుడైన తనకు ఇంతటి ఉత్కృష్ట జన్మ లభించిందన్నారు నారదు డు. దాంతో వ్యాసుని నైరాశ్యం పోయింది. భక్తికి ఆలవాలమైన భాగవత రచనకు పూనుకున్నా డు. భగవంతుని విశేషాలు, బ్రహ్మాండాల ఉత్పత్తిపై, భగవత్‌ భక్తుల కథలను భాగవతంలో పొందుపరుస్తానని నారదునితో చెప్పాడు.
నారదుడు ఈ భాగవతాన్ని విన్నవారు, చదివిన వారు ఉత్తర జన్మలో మోక్షం పొందుతా రని వరం ఇచ్చారు. ఎన్నో జన్మలనుంచి ఇంద్రియ లోలత్వంతో ఆ చక్రంలో తిరుగుతున్న జీవు లకు భాగవతం వింటే తరించి జన్మరాహత్యం పొందుతా రన్నారు. దాంతో వ్యాసుడు ఆచమనం చేసి శ్రీమద్భాగవత రచనకు గంటం పట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement