కొలిచే వారికి కొంగు బంగారం, కోరిన వారికి కోరికలు తీర్చే మహిమాన్వితుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్ర హ్మణ్యస్వామి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిర్వహించే స్వామి వారి కల్యాణ వైభవం తిలకించేందుకు రెండు కళ్ళు చాల వు. ఇలా నేడు దేశవ్యాప్తంగా స్వామివారికి కళ్యా ణాలు జరిగే ఆల యాలు అనేకం ఉన్నప్పటికీ ఏ ఆలయం మహాత్యం ఆ ఆలయా నిదే. వీటిల్లో భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన పుణ్య క్షేత్రాల్లో దివ్యమైన దివిసీమలో వేంచేసి యున్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పరమ పవిత్రమైన స్థలం. మోపిదేవి కృష్ణా జిల్లా కేంద్రం మచిలిపట్నంకి పశ్చిమంగా సుమారు 30 కి.మీ దూరంలోను విజయవాడ నుండి తూర్పుగా 65 కి.మీ దూరంలో,రైలు మార్గంలో వచ్చేవారికి రేపల్లెకి 13 కి.మీ. దూరంలో తూర్పుగా వేంచేసియున్న పరమ పవిత్రమైన ప్రాచీనమైన మోపిదేవి ఆలయంలో పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన కుమారస్వామి ఒకేచోట కొలువై ఉన్నారు. ఇది ఈ ఆలయం విశిష్టత. ఇలా తండ్రి తనయులు ఇద్దరూ ఒకేచోట కొలు వై ఉన్న దేవాలయం భారతదేశంలో ఇక్కడకాక మరెక్కడా లేదు.
మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తాపన స్కందపురా ణంలో కూడా కనిపిస్తుంది. ఈ స్వామిని కొలుస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, వివాహం కానివారికి వివాహం జరుగుతుందని తరతరాలుగా భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనేకాక అనేక ప్రాంతాల్లోని వారు తమ బిడ్డలకు తొలిసారిగా సంవత్సరం లోపల స్వామివారి సన్నిధిలో మేనమామలతో మూడుకత్తెరలు వేసినాక పూర్తిగా తలనీలాలు సమర్పించుట ఈ ఆలయంలో ఆచా రం. ఆడపిల్లలైతే చెవులు కూడా ఆ సందర్భంగానే కుట్టించటం ఆనవాయితీ, తొలిగా ఉయ్యాలలో వేయుటము, అన్నప్రాశన చెయ్యటం ఇక్కడ ఆచారం. ఎన్నో విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రా నికి సంబంధించిన స్థల పురాణంలోకి వెళితే…
పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం (సుబ్రహ్మణ్యస్వామిగా పిలుస్తారు) ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశంలో ఒక్క మోపిదేవిలో మాత్రమే దర్శించి తరించే అదృష్టం ఉంది. ప్రాచీన మహిమాన్వితమైన చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రాశస్త్యం గురించి స్కందపురాణంలో ”దేవతల వినతి మేరకు మేరుపర్వతం గర్వమణచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరా రట. ఆ క్రమంలోనే అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న ప్రస్తు తం మోపిదేవి పేరు పూర్వం మోహినీపురం. అక్కడకు చేరి సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలి ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటుపక్కనే దివ్యతేజస్సు విర జిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కని పించాడు.” పుట్ట నుంచి దివ్య తేజస్సు వెలువడటాన్ని గమనిం చిన ఆ మహాముని ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తన జ్ఞానదృష్టితో గ్రహంచిన అగస్త్య మహర్షి ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ప్రతిష్టించి పూజాధికాలు నిర్వహించటం జరిగింది. ఈ విషయం తెలుసుకొన్న దేవతలందరూ ఇక్కడకు చేరుకొని స్వామి వారిని దర్శించి తరించారట. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే స్థానిక కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఆయన ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించి నట్లు చరిత్ర వలన తెలుస్తోంది.
తూర్పుదిశగా వుండే ఈ ఆలయ గర్భగుడిలో సర్పాల చుట్ట పై శివుడు లింగరూపంలో ఉన్నారు. ఈ సర్పాల చుట్టనే పాన పట్టం అని పిలుస్తారు. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు పాల తో కార్తికేయు డిని అభిషేకిస్తా రు. ఈ గర్భగుడి లో దేవతా సర్పం రూపంలో స్వామి వారు సంచరిస్తారని భక్తుల విశ్వాసం. కాలక్రమంలో ఆనాటి మోహినీపురమే మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో కొలువై ఉన్నాడని స్థలపురాణం పేర్కొంటోంది. అయితే కార్తికేయుడే శివలింగం రూపంలో వెలిశాడన్న మరో నమ్మకం కూడా ఉంది. ఏదిఏమైనా ఇలా కార్తికేయుడు, శివుడు ఒకే ఆలయంలో కొలువై ఉండటం చాలా అరుదైన విష యం. అందువల్లే ఈ క్షేత్రానికి అత్యంత మహిమలు ఉన్నాయని ప్రతీతి. ఇక స్వామివారిని పూజించినవారికి అన్ని శుభాలే జరుగు తుండటంతో దేవరకోట సంస్థానాధీశులూ, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ స్వామివారికి భక్తులయ్యారు.
మోపిదేవి ఈ ఆలయం లోపల ఉన్న పుట్టలో స్వామికి ప్రీతి పాత్రమైన పాలు, గుడ్లు వదలి సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం అవుతుందని రాష్ట్రంలోనేకాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని స్వామియందు భక్తి భావం కలిగిన భక్తుల నమ్మకం. నమ్మకమే కాదు దృష్టాంతం కూడా. ఈ పుట్ట మట్టిని పుట్టబంగా రంగా భావిస్తూ దాన్ని చెవుల తమ్మిలకు అద్దుకుంటారు. ఇలా ధరించడం వలన కోర్కెలు తీరటంతోపాటు ఏవిధమైన పీడలు, వ్యాధులు దరికి రావని, పైగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల అచంచల విశ్వాసం. దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి రోజు రాష్ట్రంనుండే కాక దేశం నలుమూలల నుండి భారీ సంఖ్య లో భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకుని స్వామిని దర్శించి తరి స్తారు. స్వామివారి మహిమలు వివరించటం కంటే స్వయంగా తెలుసుకు తీరాలి. ఇతర రోజుల్లో స్వామివారి అభిషేకాలు, ఇక్కడ నిర్వహించే రాహుకేతు పూజలకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉండటం విశేషం. నేడు స్వామి వారి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహి స్తారు. ఇది భక్తులకు కడు రమణీ యద..
- చలాది పూర్ణచంద్రరావు
9491545699