Friday, November 22, 2024

విశ్వరూప గణపతి

వేదవ్యాస భగవాసుని శిష్యుడైన సూతమహర్షి ”మహానుభావా! సృష్టికి ఆదిగా ఎవరు అమృతస్వ రూపుడై పరబ్రహ్మ మగు చున్నాడో వారి గురించి తెలియచేయమని” ప్రార్థించాడు.
అంత వ్యాసభగవానుడు ”అమృతమయమైన యోగమార్గమును తెలియచేయు శ్రీ గణశ గీతను నీకు తెలియచేసెదను. వరేణ్యుడు అను రాజు ఒక సారి శ్రీ గణపతిని ప్రశ్నించగా ఇది చెప్పబడినది” అని గణశగీతను వివరించెను.
విఘ్నేశ్వర మహాబాహో సర్వవిద్యా విశారద
సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగంమే వక్తు మర్హసి.
విఘ్నేశ్వరా! మహాబాహు! సకల విద్యల యందు ఆరితేరినవాడా! సకల శాస్త్రము ల రహస్యములను తెలిసినవాడా నాకు అమృతమయమైన యోగమును చెప్ప మని వరేణ్యుడు ప్రార్థించాడు.
శివే విష్ణౌచ శక్తౌచ సూర్యేమయి నరాధిప
యా భేద బుద్ధిర్యోగ: స సమ్యగ్‌ యోగోమ తోమయ
ఓ రాజా! శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, నా యందు భేద బుద్ధి లేక ఉండుటయే అమృత యోగ ము. మొట్టమొదట నేను అనేక రూపములు దాల్చి భూమిని సృష్టించాను. పంచభూతములు నానుండే జనించినవి. శాశ్వతానంద స్వరూపుడను నేనే! ఎవ డు మమకార అహంకారములను విడిచి సకల కామ ములను పరిత్యజించి, ఫలితమును నాకు వదిలి సకర్మలను ఆచరించునోవారు ముక్తిని పొందుదురు.
స్థూలమైన దేహముకంటె ఇంద్రియములు, వాని కంటె మనస్సు, దానికంటే బుద్ధి, దానికంటే ఆత్మ ఉత్తమమైనది. ఆ ఆత్మ స్వరూపము నేనేనని గ్రహిం చు. ఆద్యంతములు లేని నాశనరహితుడను. సమస్త దేవగణములు ప్రళయకాలమందు నాయందే ల యమును చెందుచున్నారు. తిరిగి జనించుచు న్నారు. జ్ఞానమార్గమున ఉత్తమ మానవులు ఏయే భావములతో నన్ను పూజించుచున్నారో వారికి ఆయా గుణఫలములను ప్రసాదించుచున్నాను.
భక్తి, శ్రద్ధ లేనివాడు, అంతటా సంశయ దృష్టి కల వాడు, ఈ లోకమున శుభమును, జ్ఞానమును పొందలేడు. కావున చిత్తశుద్ధితో పంచభూతాత్మక మైన నన్ను పూజించినవారు అష్ట ఐశ్వర్య సంపన్ను లై తుదకు కళ్యాణ వైరాగ్యముతో నా నిజరూపము ను తెలిసికొని ముక్తిని పొందుతారు. కావున నిష్కా ములై కర్మలను ఆచరించవలెను. జీవకారుణ్యము ను చూపుచూ ప్రకృతి పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉందు రో వారు నన్ను తెలిసికొన్నట్లు భావింతును. మితా హారులై, సోమరితనమును వదలి ఫలమును ఆశిం చక సత్కర్మలను ఆచరించువారు నాకు ప్రియము ను చేకూర్చును. వారికి ఎటువంటి విఘ్నములు కలుగకుండ కార్యసిద్ధిని కలుగచేయుదును.
భూమి, అగ్ని, ఆకాశము, అహంకారము, జల ము, మనస్సు, బుద్ధి, వాయువు, సూర్యచంద్రులు, యజమానుడు ఈ పదకొండూ నా ప్రకృతియే అని గ్రహించుము. భూమిలోని పరిమళము, అగ్నిలోని తేజము, సూర్యచంద్రులలోని వెలుగు, జలము లోని రసము నేనేనని తెలిసికొనుము.
స్నానవస్త్రాద్యలంకార సుగంధ ధూపదీపవై:
నైవేద్యై: ఫలతాంబూలై దక్షినాభిశ్చ అర్చయేత్‌.
ఎవరు నన్ను స్నానము, వస్త్రము, అలంకారము, పరిమళ ధూపము, దీపము, నైవేద్యము, ఫలము, తాంబూలము, దక్షిణలచేత ఆరాధించెదరో వారికి నా కటాక్షము కల్గును.
అంత వరేణ్యరాజు ”ఓ గజాననా! సర్వవ్యాపక మైన, సుందరమైన నీ యథార్థ స్వరూపమును జూ పుమని” ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు అతనికి దివ్య నేత్రములను ప్రసాదించాడు. గణింప శక్యముకాని ముఖములు, పాదములు, కరములు కలిగి మనోహరమైన, గొప్పదియైన, దివ్యమయిన ఆభరణములతో, దివ్యమైన వస్త్రములతో, దివ్య మాలలతో, అనేక నేత్రములు, కోటి సూర్యుల కిర ణములతో ప్రభావమైన ఆయుధములతో గల గణ పతి విశ్వరూపములో ఆ వరేణ్యుడు దర్శించెను.

  • వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
    80746 66269
Advertisement

తాజా వార్తలు

Advertisement