Saturday, November 16, 2024

విశ్వగురుడు శ్రీదత్తాత్రేయుడు

బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులైన త్రిమూ ర్తుల వర ప్రభావంతో… సప్తర్షులలో అగ్రగణ్యు డైన అత్రి మహర్షి మహా పతివ్రత అనసూయ దంపతులకు శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తుల స్వరూపుడు, త్రిముఖ దేహుడుగా మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అవతరించి దత్తాత్రేయ భగవా నుడిగా, విశ్వగురువుగా లోకారాధకుడయ్యాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారుడు కావడం తో దత్తుడి రూపం మూడు శిరస్సులతో మహో జ్వలంగా, మహిమాన్వితంగా, దివ్య తేజస్సుతో భా సించింది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వా లు మూర్తీభవించి ఆవిర్భవించాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఎంతో మహిమాన్వితుడు. ఆదర్శ మూర్తి. జగద్గురు అయినందువల్లే సనాతనంగా ఆయన ను శ్రీ మహావిష్ణువు అంశితుడిగా ఆరాధిస్తు న్నారు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారం 6వది అని భాగవత పురాణం చెబుతోంది. శ్రీ దత్తాత్రేయుని కారణజన్మనూ, అవతార వైశిష్ట్యాన్ని, సకల లోకాలకు ఆయన చేసిన మహాపకారాలను అనేక పురాణాలు, కావ్యాలు వివరిస్తు న్నాయి. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశాడు. తద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ప్రకృతిలోని ప్రతి వస్తువునూ, ప్రతి జీవినీ అలాగే తనకు ఎదురైన ప్రతి అనుభవ పరిస్థితినీ గురువులుగా భావించాడు. ముఖ్యంగా ఇరవై నలుగురినీ గురువులుగా స్వీకరించి సేవించాడు. జీవిత పాఠాలెన్నో నేర్చుకున్నాడు. భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్చ, ఆకాశం నుం చి నిస్సంగత్వం (కోరిక లేకపో వడం) నేర్చుకున్నాడు. ఈవిధంగా ప్రకృతి నుంచి తెలుసుకున్న విజ్ఞాన భాండాన్ని, అనుభవసారా న్ని ప్రపంచానికి పంచిన క్రమంలో.. అగ్ని నుంచి నిర్మలత్వాన్ని, సము ద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మొహత్వాన్ని గ్రహించాలని చెప్పాడు. కొండ చిలువులా భ్రాంతిలో పడకూడద న్నాడు. స్పర్శకు దూరంగా ఉండమన్నాడు. మిడత నుంచి, ఏనుగు నుంచీ పట్టుదలనూ, చేప నుంచి త్యాగనిరతిని నేర్చుకోవాలన్నాడు. మానావమానాల సమ స్పందన అలవర్చుకోవాలన్నాడు. సాలెపు రుగు నుంచి సృష్టి, స్థితి, లయకారుడు పరమాత్మయేనని తెలుసుకోవాలన్నాడు. చంద్రుడి నుంచి వృద్ది, క్షయాలు, శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలన్నాడు. ఆర్తులను కాపాడే చింతన ను నీటి నుంచి అవగాహన చేసుకోవాలన్నాడు. చీమలా జిహ్వ చాపల్యానికి లోను కారాదని తెలుసుకోవాలన్నాడు. ఇలా అన్నిటినీ తన గురువులుగా ప్రకటించి వాటి నుంచి నేర్చుకున్న అపార అను భవంతో జ్ఞానానందమయుడయ్యాడు. తాను నేర్చుకున్న విజ్ఞాన సంపదను ప్రపంచానికి పంచి జగద్గురువు అయ్యాడు. దత్తాత్రేయస్వామి… సతీమదాలస ముద్దుల పుత్రుడు అల ర్కుడికి యోగ విద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యా మంత్రం త్రిపురా రహస్యం, ప్రహ్లాదునికి ఆత్మ జ్ఞాన రహస్యాన్ని, ఆధ్యాత్మిక విద్యను ప్రబో ధించాడు. యదు మహారాజుకు స్వశరీర పవిత్రత, సుబ్రమణ్యస్వామికి ఆధ్యాత్మిక విద్యోపదేశం, కార్తవీర్యార్జునుడికి ధాతు విద్యా ప్రక్రియను, రస శాస్త్రాన్నీ, ఆదిశంకరులకు సహస్రనామోపదేశం చేశాడు. ఆధ్యాత్మిక సిద్ధి, నిష్కామ బుద్ధి, యోగ విద్య ఉపదేశాలను ముఖ్యంగా లోకాలకు చాటాడు. ఈ క్రమంలో అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు. గొప్ప అవధూత, మహా జ్ఞాని, చిరంజీవి అయ్యాడు. మధ్య భాగంలో అజ్ఞానాన్ని తొలగించే లోక గురుమూర్తిగా శ్రీ దత్తుడు ముల్లోకాలను రక్షించాడు. ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడిగా ఆరా ధించబడ్డాడు. జన్మ, కర్మ, గుణ, రూప, మాయ, నాశనాలు లేని సర్వాంతర్యామి అయ్యాడు. దత్తా త్రేయుడు 16 అంశలు కలవాడు అనీ, దత్తపురాణం చెబుతోంది. అలాగే దత్తాత్రే యుడు ఉగ్ర దేవుడి గా గరసంహిత చెబుతున్నది. కాగా శ్రీ దత్తుడికి ఇష్టమైన గురువారం రోజు అత్యంత ప్రతికరమైన మేడి వృక్షాన్ని పూజించి ఆయనక కృపకుపాత్రులవుతున్నారు.

– తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌
9949789939

Advertisement

తాజా వార్తలు

Advertisement