Wednesday, November 27, 2024

గ్రామ సంరక్షణలో గ్రామదేవతలు

ఆషాఢమాసం ఈనెల పంతొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసంలోనే చాలా గ్రామాల్లో ”గ్రామ దేవత”ల ఆరాధనోత్సవాలు, జాతరలు నిర్వహస్తుంటారు. తెలంగాణలో ”బోనాలు” పేరున గ్రామదేవతలు జాతర జరుగుతుంది. ఎందుకంటే, వర్షాకాలం ప్రారంభమవుతుంది. రైతులు అప్పుడే వ్యవసాయ పనులకు సం సిద్ధులవుతారు. కొత్తగా వివాహమైన, ఆడబిడ్డలు, పుట్టింటికి వస్తారు. వీరు మహాలక్ష్మీ స్వరూపులే కదా! జ్వరాలు, అంటువ్యాధులు బారినపడే రోజులు. అందుకే రక్షణ కొరకు గ్రామ దేవతల ఆవిర్భావం. మన దేశంలోను, మన రాష్ట్రంలోను గ్రామీణ ప్రాంతాలే ఎక్కు వ. గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమం నిమిత్తం గ్రామదేవతలు ఆవిర్భవించారు. గ్రామ దేవతల ఆవిర్భావానికి మూలం మాతృస్వామిక వ్యవస్థ. ఈ గ్రామదేవతలు గురించి…
గ్రామాల్లోని ప్రజలను రక్షిస్తూ, పొంగు, తట్టు వంటి అంటువ్యాధులు (అమ్మవారే అని భావన) నుండి రక్షణ, భూత, ప్రేత పిశాచాల నుండి కాపాడుటకు, పాడి పంటల అభివృద్ధికి, గ్రామ పొలిమేరల్లో కాని, కొన్ని ప్రదేశాల్లో గ్రామ కూడలిలో కాని కొలువై ఉన్నారు. వీరం దరు స్త్రీ మూర్తి స్వరూపులే. ఎందుకంటే మాతృమూర్తి తత్త్వం. జగన్మాతకు అందరూ బిడ్డ లే కదా! ఒక్కో గ్రామదేవతకు ఒక్కో చరిత్ర ఉంటుంది. జగన్మాత పార్వతి దేవి సహస్రనా మాలలో కొలువై ఉన్న గ్రామదేవతలు పూర్వం ఉగ్రరూపంతో ఉండి, రక్త పానం చేస్తూ, జీవు ల మాంసాన్ని భక్షిస్తూ ఉండేవారు.
ప్రజలు తమను పట్టించుకోకపోయినా, అలక్ష్యం వహంచినా రోగాల బారిన పడేటట్లు, మరణించేటట్లు, భయపెట్టేవారు. తరువాత దశలో ”శాంత స్వభావంతో ఉన్న శిష్ఠ దేవత ల” ఏర్పాటు జరిగింది. దాంతో అంతవరకు ఉగ్రరూపంతో ఉన్న గ్రామదేవతలు శాంతస్వ భావులై, ప్రజల సంక్షేమం కోసమే కొలువై ఉండి, జాతరలు, తీర్థాలు అందుకుంటున్నారు.

ఎలా ప్రారంభం అయింది?

పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదార్లు సౌకర్యం, రవాణా సదుపాయాలు ఉండేవి కావు. కంచిలోని కామాక్షి అమ్మ, మథురైలోని మీనాక్షి అమ్మ, విజయవాడలోని కనక దుర్గ మ్మ వంటి బహు దూరంలో ఉన్న అమ్మవారి ఉత్సవాల్లో కాని, దర్శనానికి కాని వెళ్ళడానికి, దర్శించడానికి వ్యయ ప్రయాసలు పడేవారు. దాంతో అమ్మను ఎక్కడెక్కడ నెలకొల్పి, ఉత్స వాలు, జాతరలు చేస్తూ ఉండడం అలవాటై గ్రామదేవతలుగా స్థిరపడ్డారు.
కొన్ని సందర్భాల్లో గ్రామంలోని యువతి. అనారోగ్యంతోనో ఆత్మహత్యల వల్లనో మర ణించిన సందర్భంలో, గ్రామం మీద మమకారంతో, కుటుంబ మమకారంతో, గ్రామం లోని పెద్దలకో, తల్లిదండ్రులుకో కలలో గరగలతో, లేదా జుట్టు విరబోసుకుని తిరుగుతూనో ఉన్నట్లు కనపడి గ్రామదేవతగా వెలుస్తున్నారు. ”మీరు ఆరాధించండి.” అంటూ చెప్పే వారు. ఉదాహరణకు ముమ్మిడివరం మండలంలోని ఒక గ్రామంలో యువతి తనకు కాబో యే భర్త మంచి సౌందర్యవంతుడై ఉండాలని, ఎన్నెన్నో కలలు కంది. తల్లితండ్రులు సంబం ధం చూసి, వివాహం చేసే సందర్భంలో, పెళ్ళిపీటల మీద తనకు కాబోయే భర్తను చూసి, లేచి వెళ్ళి ఆత్మాహుతి చేసేసుకొంది. తరువాత తల్లితండ్రులకు, గ్రామ మునసబు గారికి కల లో గరగలతో కనపడి ఆరాధించమని చెప్పింది. అప్పటినుండి ఆమె గరగలతో కనపడి నందున ”గరగలమ్మ”గా గ్రామదేవతగా కొలువై ఉంది. కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతా ల్లో చిన్నచిన్న పాకలు వేసి ఏ కొయ్యతోనో, రాతితోనో ఒక రూపం తీర్చి కొండమ్మగానో, నూకాలమ్మగానో, నామం పెట్టి గ్రామ దేవతగా ఆరాధిస్తున్నారు.

నామాలలో వైరుధ్యం

పెద్దాపురంలో మరిడెమ్మగా, భీమవరంలో మావుళ్ళమ్మగా, ద్వారకాతిరుమల వద్ద కుంకుళ్ళమ్మగా, విజయనగరంలో పైడితల్లిగా, సూళ్ళూరుపేటలో చెంగాళమ్మగా, విశాఖ పట్నంలో కనకమహాలక్ష్మిగా, అవనిగడ్డలో అంకాలమ్మగా… ఇలా ప్రతిచోటా ఏదో ఒక నామంతో కొలువై ఉండి రక్షిస్తూ ఉన్నారు. ఏ పేరుతో పిలిచినా పలికే దేవత ఆ జగన్మాతయే. అయితే మన సంప్రదాయాలలో భాగంగా ప్రజలు కొయ్యలోను రాతిలోను దేవతను దర్శిం చే సంస్కృతి మనది.
పంచభూతాల పేర్లతో కూడా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఆకాశానికి ప్రతిగా కొండ మ్మగా, జలదేవతకు ప్రతిగా గంగాలమ్మ, పృథ్వి (భూమి)కి ప్రతిరూపంగా అన్నం పెట్టే అన్నమ్మ నూకాలమ్మ (నూకలు అంటే బియ్యం), అగ్నికి సూర్యచంద్రుల తేజస్సును చెపుతుంటాము. అందుకే సూరమ్మ, పున్నమ్మ, వాయువుకు ప్రతిరూపంగా కరువలమ్మ (కరువలి అంటే పెద్ద గాలి) ఇలా నామధేయాలతో ఆరాధిస్తున్నారు. గమనిస్తే ప్రస్తుతం ప్రతీ గ్రామంలో నూకాలమ్మగానో, గంగాలమ్మగానో, గాజులమ్మగానో ఏదో ఒక పేరుతో కొలువై ఉన్నారు. అందుకే, ప్రతీ సంవత్సరం జాతర పేరుతో ఉత్సవాలు, సంబరాలు చేస్తుండడం పరిపాటి. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పేరుతో గ్రామదేవతల ఆరాధన జరుగుతుం ది. బతుకమ్మ పండుగ దసరా రోజుల్లో వస్తే, బోనాలు పేరిట అమ్మవారి ఉత్సవ కార్యక్రమా లు ఈ ఆషాఢమాసంలోనే జరుగుతాయి. బోనం అంటే భోజనం. అన్నం, పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయలతో కూడిన అన్నాన్ని (బోనాన్ని) కొత్త కుండలో కాని, రాగి గిన్నెలో కాని పెట్టి తలపై పెట్టుకొని, ఊరేగింపుగా మహళలు ఆ గ్రామ దేవతకు సమర్పిస్తారు.
కొండకోనల్లో నివసించే ప్రజలు తమకు అందుబాటులో ఉన్న పండు, కాయ, కూరగాయలు, పుష్పాలు ఇలా ఏదో ఒకటి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు కొత్త పంట రాగానే గ్రామంలో కొలువై ఉన్న దేవతకు ఉత్సవాలు నిర్వహంచిన తరువాతే ఆ పంటను అనుభవిస్తారు. ఉదాహరణకు మామిడి చెట్టు కాయలు కాసినా వెంటనే కోయరు. అలాగే చింత, ధాన్యం అన్నిటికీ గ్రామదేవతకే అర్పించే తాము తింటారు.

- Advertisement -

ధూప దీప నైవేద్యాలు

కొన్నికొన్ని ప్రాంతాల్లో గ్రామదేవతలకు పూజారులు ఉండి నిత్యారాధన, జరుగుతోం ది. కొన్నిచోట్ల పరిస్థితుల్లో రజకులో బలిజ కులస్తులు, లేక హరిజనులో పూజారులుగా ఉం డి ప్రతీరోజూ ధూప దీపాలు వెలిగించి, ఏదో ఒక నైవేద్యం సమర్పించి, గుడి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతారు. సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి అసలు తాళా లు వేయరు. అమ్మవారికి భక్తులకు మధ్య అడ్డు ఏదీ ఉండకూడదని అమ్మ ఆలయం అధికా రులకు స్వప్నంలో చెప్పింది. అందుకే అమ్మవారి గుడి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటా యి. అలాగే గ్రామంలో ఉన్న గ్రామదేవతకు కూడా తెరచే ఉంటాయి. ఆలోచిస్తే జగన్మాత రూపంలో కొలువై ఉన్న ఆమెకు బిడ్డకు మధ్య అడ్డు ఉండకూడదని.
ప్రతివారు అమ్మవారికి సందర్భానుసారంగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. పోలాల అమావాస్య, కోరలమ్మ పౌర్ణమి వంటి అమ్మ వారి పూజలు ఇళ్ళల్లో చేస్తూంటారు. ఏది ఏమైనా జగన్మాత తన బిడ్డల కోసం ఎన్ని అవ తారాలు ధరించి, రక్షిస్తోంది కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement