విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం. పైడితల్లి ఉత్సవాలకు తలమా నికం. రెండున్నర శతాబ్దాలకు పైబడి సిరిమానోత్స వం జరుగుతోంది. పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా విజయనగరం ప్రజలు, పూసపాటి రాజుల ఇలవేల్పుగా భాసిల్లు తోంది. దసరా (విజయ దశమి) పండుగ అయిన తరువాత వచ్చే మంగళవారం ఈ ఉత్సవాన్ని చేస్తారు.
అమ్మవారి ఆత్మకథ
చారిత్రాత్మకంగా ఈమె పెద్ద విజయరామరాజు చెల్లెలు. పసి ప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బి లిపై యుద్ధ సన్నాహాలు చేయ డం ఆమెను కలతపెట్టింది. బు స్సీ కుట్రకు లొంగిపోయిన విజ య రామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్క చేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపా ల్ని ఫణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడా రు. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హచ్చరిం చింది. ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టు కొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభి స్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది.
విజయనగరం మూడు లాంతర్లు కూడలి వద్ద ఆ పెద్ద చెరువు ఒడ్డునే వనం గుడిగా పైడితల్లి అమ్మవారి దేవాలయం 1757లో నిర్మించారు. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్ప ల స్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. దాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆనాడు ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మూడు లాంతర్ల సెంటర్‌దగ్గర మరో ఆలయం కట్టారు. దీనినే చదురుగుడి అంటారు. ఇలా పైడిమాంబ నిత్య పూజలు అందుకునే పైడి తల్లిగా అవతరించారు. రెండు ఆలయాలైన వనంగుడి, చదురు గుడిలో ధ్వజస్థంభాలుండవు. పైడితల్లి అమ్మవారు ధ్వజస్థంభాన్నే సిరిమాను రూ పంలో ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తారు. పైడితల్లి పూజారిని ఆవహంచి ప్రజలకు, రాజ కుటుంబీకులకు ఆశీర్వాదం అందిస్తారు.
చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసిన అప్పలస్వామి నా యుడు అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నా రు. ప్రస్తుత పూజారి బంటుపల్లి వెంకటరావు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహంచి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.
జాతర
అమ్మవారి జాతర సందర్భంగా జరిపే సిరిమానోత్సవంలో పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కు ర్చీలో పూజారి కూర్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవం లోని ప్రధాన భాగం.
అమ్మవారి జాతరలో సిరి మాను సంబరం కీలకమైన ఘ ట్టం. పతీ సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగు తోంది. పేరుకి గ్రామ దేవతే అయినా ఆతల్లి కీర్తి మండలాలు, పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది. భక్తులనువిశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటినుంచి చివరివరకూ అన్నీ రసవత్తరమైన సన్నివేశాలే. సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధా నమైన అంశాలుంటాయి. సిరిమాను ఉపరిత లంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆక ర్షణలు, సిరిమాను తిరుగుతున్నంతసేపూ భక్తు లు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోం ది. 33 మూరలు ఉండే సిరిమాను కోసం అం తటి మాను లభించడమే విశేషం. తల్లి మహమ కు అదే పెద్ద తార్కాణం. చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమా ను ముందు సాగే బెస్త వారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చూసేందుకు జనం ఎగబడుతుంటారు.
గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. కాలక్రమేణా సంస్థా నాలు, రాజ్యాలు పోవడంతో 1956వ సంవత్సరం నుంచి పట్టపుటేను గును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొం దించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కచెల్లెళ్లు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతుంటారు. బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముందు నడవగా వేషధారులు భక్తిపారవశ్యంతో కదంతొక్కి పరిగెడు తుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివితీరా చూ సి భక్తి భావంతో మమేకమవుతుంటారు. ఈ రోజు ఆలయ పూజారిలోకి అమ్మవారు ప్రవేశించే ఊరేగే ఈ ఉత్సవాన్ని తిలకిస్తే కోరిన కోర్కెలు తీర తాయని భక్తుల నమ్మకం. అం దుకే అశేష సంఖ్యలో ప్రజలు ఈ ఉత్సవానికి విచ్చేస్తారు.