జ్ఞానము ఉనికిని తెలుసుకోవడమే జ్ఞానాన్వేషణ. అయితే ”ఇంతకాలం మనం అజ్ఞానంలో ఉన్నామా?” అనే సందే హం సర్వసాధారణంగా వస్తుంది. అది నిజమేకదా! మనం వాస్తవానికి అజ్ఞానంలోనే జీవిస్తున్నాము. అయితే జ్ఞానం అంటే ఏమిటి? మనం లౌకిక జ్ఞానంతో జీవిస్తూ, సుఖసంతోషాలకై వెంప ర్లాడుతున్నాము. సంతానానికి సంపద పోగుచేయాలనే తపనతో, అధర్మానికైనా భయపడటం లేదు. ఇహపర సౌఖ్యాలకు మూలమై న ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి చేసే తపస్సు, యజ్ఞ యాగాదు లు జ్ఞానాన్వేషణలో భాగమే. భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ”నహ జ్ఞానేన సదృశం పవిత్ర మిహ మిద్యతే ” అన్నాడు. అంటే విద్యలలోకెల్లా పవిత్రమైనది జ్ఞానమే.
జన్మ సాఫల్యతకు, పునరపి జననం—పునరపి మరణం అనే జనన మరణాల చక్రంలో చిక్కుకోకుండా ఇహపర సౌఖ్యాలు పొం దుటకు, మోక్షం సిద్ధించడానికి ఆత్మజ్ఞానం, భగవతత్త్వం తెలుసు కోవడమే జ్ఞానం. జన్మలలో ఉత్తమమైన మానవజన్మ సార్ధకతకు, మోక్షం పొందడానికి, మనలో నిగూఢమైన అజ్ఞానాన్ని తొల గించుకొని దైవచింతన పొందేందుకు జ్ఞానం అవసరం. నిర్మలమై న, మనస్సుకు, నిర్భీతత్త్వం పొందడానికి జ్ఞానం. తైత్తిరీయోప నిషత్తులో వరుణ మ#హర్షి పుత్రుడు భృగువు ఒకనాడు తన తండ్రిని సమీపించి జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఎవరు? వివ
రించమని కోరాడు. అపుడు వరుణ మహర్షి ”ప్రాణం, ఆహారం, జ్ఞానేంద్రియాలు, మనస్సు వాక్కు ఇవే పరమాత్మ. ఈ సకల జీవకోటి ఎలా పుడుతుందో అలా పుట్టిన జీవులు ఎలా జీవి స్తున్నా యో, తిరిగి ఆ జీవులు అన్నీ మరణించాక ఎవరిలో లీనమవుతు న్నాయో ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మను, ఆయన తత్త్వా న్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం పొందడానికి ప్రయత్నించు” అని చెప్పాడు. అగ్ని కట్టెలను ఎలా బూడిద చేస్తుందో, ఆ మాదిరి గా జ్ఞానమనే అగ్నిని బాగా ప్రజ్వలింప చేస్తే, సమస్త కర్మలను భస్మం చేసేస్తుంది. జ్ఞానం పొందడానికి పరిపూర్ణమైన పండితుడును గురువుగా పొంది, శుశ్రూష చేయాలి.
మూడు సుగుణాలు ముఖ్యమని గీతాచార్యుడు వివరిం చారు. అవి 1) శ్రద్ధ 2) తదేక నిష్ఠ 3) ఇంద్రియ నిగ్ర#హం.
శ్రద్ధ అంటే గురు వాక్యము, శాస్త్ర వాక్యములందు నమ్మకం. సూర్యుడు లోకానికి వెలుగులు ప్రసాదిస్తున్నట్లే, గురువు మనలోని అజ్ఞాన, అహంకారాన్ని తొలగించి, జ్ఞానం వైపు మార్గం చూపుతా డు. చిన్నతనంలో తల్లిదండ్రులు బిడ్డలను జ్ఞానం మార్గం వైపు నడిపిస్తారు. శ్రద్ధ ఉంటేనే అభ్యాసనా ఫలితం సిద్ధిస్తుంది. తదేక నిష్ఠ అంటే ఏకాగ్రతతో, పట్టుదలతో పొందాలి. మనస్సు చంచల మైనది. ఇంద్రియా లు ద్వారా మనసు బయట ప్రపంచంవైపు తిరుగుతూ, ఉంటే ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞానం పొందలేడు. పోటీ పరీక్షలలో ఉత్తమ శ్రేణి పొందేందుకు విద్యా ర్థి చేసే అభ్యసనం విధానంలాగా, అభ్యసనం చేయా లి. జ్ఞానం పొందడానికి వివేకం, సత్ప్రవర్తన ఉండాలి.
”తస్మాత్ యత్ఫురుషో మనసా అభిగచ్చతి
తత్ వాచావరతి, తత్ కర్మణా కరోతి”. అని ఉపనిషత్తు వాక్యం. అంటే మనిషి ఏది ఆలోచిస్తాడో, అదే వాక్కుగా వస్తుంది. ఏది వాక్కుగా వెల్లడవుతుందో అదే పని చేస్తాడు.
అంటే క్రియకు (కర్మకు) మనస్సే కారణం. మంచి ఆలోచన లు సత్కర్మలకు, రాగద్వేషాలు, జుగుప్స వంటి మనసుతో ఆలో చిస్తే దుష్కర్మలకు దారితీస్తుంది. వాటినని అధిగమించి జన్మరా హత్యం సిద్ధింపచేసుకోవడానికి జ్ఞానాన్వేషణ అవసరం. జ్ఞానవం తుడు ఐహక సుఖాలు వదులుకొని, తదేక ఆధ్యాత్మిక చింతనతో ఉంటాడు. నిర్మల మనసును పొందుతాడు. అంతేకాక, త్రిగుణాల లోని తమో, రజో గుణాలు వదిలి సాత్త్విక గుణంతో జీవిస్తాడు. సిద్ధార్థుడు స్వతహాగా రాజవంశీయుడైనా, ఒకసారి వ్యాహాళికి వెళ్ళి, జీవితం అంటే రోగాలతో, జనన మరణాలతో వేదన పడ వలసిందేనా? అసలు పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవాలనే భార్య, కుమా రుడులను వదిలి, బుద్ధగయలో ధ్యానం ద్వారా జ్ఞానం పొంది బుద్ధుడు అయ్యాడు. రమణ మహర్షి యుక్త వయస్సులోనే జ్ఞానా న్వేషణ నిమిత్తం అరుణాచలం చేరి, విరూపాక్ష గుహలో ఎన్నో సంవత్సరాలు తపస్సుచేసి, జ్ఞానాన్ని పొందారు.
అందుకే ఆయన దగ్గరకు వెళ్ళిన వారికి ”నువ్వు ఎవరివో తెలుసుకో” అనే బోధించారు. అది తెలుసుకోవడమే జ్ఞానం.
13వ శతాబ్దంలోనే సదాశివ బ్రహ్మంద్ర స్వామి కూడా సన్య సించి జ్ఞానం పొందారు. ఇలా ఎంతోమంది మనకు ఆదర్శనీయు లు. రైతు తన పొలంలో కలుపు మొక్కలు ఏరి వేసి, పంటకు బలా న్ని చేకూరుస్తున్న రీతిలో, మన మనసులోని చెడు ఆలోచనలు జ్ఞానంతో మరుగున పడిపోతాయి. మంచి ఆలోచనలతో, సత్య వాక్కుతో, ధర్మబద్ధంగా జీవిస్తుంటే, మనలో చిత్తశుద్ధి, పరిజ్ఞానం వస్తాయి. జ్ఞానాన్వేషణ దిశగా తీసుకునిపోతాయి.