Friday, November 15, 2024

విధుశేఖర భారతీ తీర్థస్వామి జన్మదినం

ఆదిశంకరులు స్థాపించిన శృంగగిరి మఠానికి 1989 నుండి తంగి రాల సీతారామ ఆంజనేయులు 36 వ పీఠాధిపతి భారతీ తీర్ధ స్వామి, అయన ఉత్తరాధికారిగా కుప్ప వేంకటేశ్వర ప్రసాదశర్మ ”విధుశేఖర భారతీ తీర్థ స్వామి” గా 23 వ జనవరి 2015 న నియమితులయ్యారు.
శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ శ్రావణ శుక్ల పంచమి నాగ పంచమి రోజు, జూలై 24, 1993న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో కౌండిన్య గోత్రా నికి చెందిన కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధాని, శ్రీమతి సీత నాగలక్ష్మి దంప తులకు వేంకటేశ్వర ప్రసాద శర్మగా జన్మించారు. ప్రసాద శర్మ కుటుంబీకులు ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా అనంతవరంకు చెందినవారు.
తండ్రి వేదాధ్యయన కేంద్రాల్లో ఉద్యోగం చేయడం వెరసీ ప్రసాదశర్మ భవిష్యత్తును నిర్ధేశించాయి. వేదా భ్యాసం దిశగా ఆసక్తిని కలిగించాయి. చిన్న వయస్సు నుండే, శ్రీ ప్రసాద శర్మ శ్రీకృష్ణుని పట్ల ప్రగాఢమైన భక్తిని ఆయన దేవుని జగద్గురువుల మార్గదర్శకత్వంలో, ఆయన వ్రాత, మాట్లాడే సంస్కృతంలో వేగంగా ప్రావీణ్యం సంపాదించారు. శృంగేరి విద్వాన్‌ శ్రీ తంగిరాల శివకుమార శర్మ సంస్కృత కవిత్వం, సాహత్యం నేర్పించారు.
జగద్గురువుల మార్గదర్శకత్వంలో, శ్రీ ప్రసాదశర్మ మీమాంస శాస్త్రాన్ని కూడా అభ్యసించారు. జగద్గురు వులచే రాత్రిపూట జరిగే చంద్రమౌళీశ్వర పూజకు హాజరయ్యేవారు. శర్మ చదువుసంధ్యల్లో చూపించే శ్రద్ధా సక్తులను గమనించారు పీఠాధిపతులు. పీఠానికి ఉత్తరాధికారిగా శర్మను ప్రకటించాలన్న నిర్ణయం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement