తిరుమల, ప్రభన్యూస్ ప్రతినిధి: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి గృహాల వద్ద ఆయనకు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి, కలెక్టర్ ఎం.హరినారాయణన్, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. రిసెప్షన్ అధికారులు బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఉపరాష్ట్రపతి తిరుమలలోనే బసచేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శిం చుకుంటారు. తర్వాత పుష్పగిరి మఠంలో జరగనున్న తన మనవరాలి వివాహానికి హాజరవుతారు. అనంతరం తిరుమల నుంచి రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్ర యానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళతారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం వద్ద వెంకయ్యనాయుడుకు ఉప ముఖ్యమంత్రి నారా యణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారా యణ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ ఎం.హరినారాయణన్, డీఐజీ ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement