Sunday, November 17, 2024

గృహస్థాశ్రమంలో వెూక్షసిద్ధి!

జన్మలన్నింటిలో మానవజన్మ ముఖ్య మైంది. పవిత్రమైంది. బాల్యం, కౌ మారం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్ర మం, వానప్రస్థానం, సన్యాసం. ఇందులో ము ఖ్యంగా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం, వాన ప్రస్థం, సన్యాసం. చాలామంది మోక్ష సిద్ధి కేవలం వానప్రస్థం లోను , సన్యాసం వల్ల కలుగుతుంది అనే భ్రమ లో ఉన్నారు. అది అపోహ మాత్రమే. గృహ స్థాశ్రమంలో ఉంటూనే మోక్షాన్ని పొందవచ్చు. గృహస్థాశ్రమంలో పితృఋణం, దైవ ఋణం, తీర్చుకోవడానికి మంచి మార్గం. వ్యాసమహర్షి గృహస్థాశ్రమం గురించి చెపుతూ-
” దయాశ్రద్ధా కమా లజ్ఞా త్యాగశ్శాన్తి: కృతజ్ఞతా
గుణా: యస్యభవన్త్యే తే గృహస్థో ముఖ్య ఏ వేషం”
అన్నారు. అంటే దయ, శ్రద్ధ, ఓర్పు , సిగ్గు , వివేకం, త్యాగం, దానం, కృతజ్ఞత మున్నగు లక్ష ణాలు కలిగిన గృహస్థుడు ఉత్తముడు.” అని అర్థం. పరాశర ముని ”వానప్రస్థులు, బ్రహ్మ చార్యులు , సన్యాసులు మొదలగువారు గృహ స్థునిపైనే ఆధారపడే తమతమ ధర్మాలను నెర వేర్చుకొంటున్నారు.
వ్యాసమహర్షి తన పుత్రుడైన శుకుడుతో ”నాయనా! నీవు నీ విద్యలన్నీ పూర్తి చేసావు. ఇంక గృహస్థాశ్రమం స్వీకరించి దేవతలను, పితృదేవతలను తృప్తిపరుచు. సంసార సుఖాల ను అనుభవించు.” అన్నాడు.
దానికి శుకుడు ”తండ్రీ! అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఒకటి ఉందా? ప్రతీవారి ముఖంలోను దు:ఖ స్పర్శ తప్పదు కదా! మీ కోరిక మేరకు వివాహం చేసు కొని సంసారం లో ప్రవేశిస్తే భార్యకు వశవర్తిని కావలసిందేగదా! అపుడు సుఖం ఎక్కడది? మలమూత్ర సంభూతమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోని జుణ్ణి. నాకు ఏ విధ మైన కోరికలు లేవు. సంసారం అంటే నాకు భయం. తత్త్వబోధ చేసి నన్ను కాపా డు. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకు పోవడం ప్రారంభిస్తే దానికి అంతు ఉండదు. ఏ సుఖం ఉండదు. గృ#హస్థాశ్రమం, అంటారే అస లు గృహ శబ్దానికి అర్థం ఏమిటి?
” గృహ్లాతి ఇతి గృహమ్‌” పురుషుడుని బం ధించివేస్తుంది. కనుక అది ఒక చెరసాల. దాని వల్ల సుఖం లేదు కదా! అనగానే , వ్యాసుడు ” పుత్రా! గృహం బంధనాగారం కాదయ్యా! మనస్సే అన్నిటికీ మూలం. కాబట్టి గృహస్థాశ్ర మంలో ఉండి బంధ రహితంగా ఉండి, మోక్షా న్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జిం చి, వేదోక్త విధులను ఆచరిస్తూ, సత్యవచనం, ధర్మం ఆచరిస్తూ , శుచిగా జీవించినట్లయితే గృహస్థుడుకి కూడా మోక్షం సిద్ధిస్తుంది. బ్రహ్మ చారి, వానప్రస్థుడు, సన్యాసి ఈ మూడు ఆశ్ర మాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహ స్థుడినే ఆశ్రయి స్తారు. అంతేకాక సృష్టిలోని కొన్ని జీవులు కూడా గృహస్థుడును ఆశ్రయించే వృద్ధి చెందుతాయి. వారందరికీ చేస్తున్న అన్నదానం ఎంతో ఉత్త మం. అందుకే అగస్త్యుడు, అత్రి, వశి ష్ఠుడు వంటి ఎందరో మహర్షులు గృహస్థాశ్ర మం స్వీకరించారు. ధర్మబద్ధంగా- వేద మార్గం లో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్ష ము, ఉత్తమ జన్మ ఏది కోరుకున్నా లభిస్తుంది.
శుకా! ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమం అధిరోహించాలని. నువ్వు ప్రస్తుతం బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవే శించి గార్హ పత్యాగ్ని సముపాశించి, దేవతలను, పితృదేవతలను, నీ ఆరాధనతో సంతృప్తి పరు చు. సంతానం పొంది తదుపరి వానప్రస్థం, ఆ పై సన్యాసం ఆశ్రమాలు స్వీకరించవచ్చు.
గృహస్థాశ్రమంలో ఇంద్రియ నిగ్రహంతో మెలగాలి. అందుచేత నువ్వు ఇంద్రియ నిగ్రహం కోసం తపస్సు చేయి. విశ్వామిత్రుడు మూడువేల సంవత్సరాలు నిరాహారుడై ఘోర తపస్సు చేసా డు. ఇంద్రియాలను జయించాడు. అయినప్ప టికీ మేనకను మోహించి, శకుంతలకు జన్మని చ్చారు. నా తండ్రి పరాశురుడు గొప్ప మహర్షి. అయినా నావ మీద నదిని దాటుతూ పడవ నడుపుతున్న దాశరాజు కుమార్తె సత్యవతిని మోహించాడు. అందువల్లనే నేను జన్మించాను. కాబట్టి నువ్వు వివా#హం చేసుకో.” అన్నాడు.
ఇదంతా విన్న శుకుడు” తండ్రీ! నువ్వు వెయ్యి చెప్పు. లక్ష చెప్పు. సంసారంలో పడితే చింతన వేదన తప్ప మరోకటి కాదు. నేను మాత్రం గృహ స్థాశ్రమం స్వీకరించనుగాక స్వీకరించను. ఇం ద్రుడు త్రిలోకాధిపతి అయినా, ఆ పీఠాన్ని కాపా డుకోవడానికి ఎవరు తపస్సు చేస్తున్నా దు:ఖమే. ఎన్ని విఘ్నాలు కలిగిస్తుంటాడో! సాక్షాత్తూ లక్ష్మీ వల్లభుడు విష్ణుమూర్తి సుఖ పడుతున్నాడా? ఎప్పుడూ జగడాలు, యుద్ధాలు , అవతారాలు ధరించడమే కదా!” అంటూ చెప్పుకొచ్చారు.

  • అనంతాత్మకుల రంగారావు, 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement