పునర్జన్మలేని మోక్షం పొందడమే మానవుల జీవిత లక్ష్యంగావాలని పెద్దలు అంటారు. అటువంటి బ్రహ్మానందాన్ని కలిగించే ఆల యం వేదనాయకి సమేత విశ్వనాథస్వామి కొలువైవున్న ఆలయం.
కుంభకోణానికి సమీపములో వున్న దేవరాజపురం. కాలక్రమేణా ఈ వూరి పేరు తెప్పెరు మానల్లూర్‌గా మారింది. ఈ ఆలయపు ఆచార వ్యవహా రాలు, కట్టుబాట్లు మిగిలిన దేవాలయాలకు భిన్నంగా చాలా వ్యత్యాసంగా వుంటాయి. ఈ ఆలయంలో కొలువై వున్న దేవతామూర్తుల రూపాలు, భం గిమలు భిన్నంగా వుంటాయి.
పౌరాణిక యుగంతో సంబంధంకల ఈ ఆల యానికి స్వామివారి దర్శనానికి మరుజన్మ లేనివారు మాత్రమే రాగలరని ప్రతీతి.
ఆదికాలంలో ఈ అనంత విశ్వమంతా ప్రళయం లో మునిగిపోయినప్పుడు ఈ క్షేత్రంలో మాత్రం ఒక చుక్క నీరు కూడా లేకు ండా సురక్షితంగా నిలచివుంద ట. ఆ విశేషం తెలిసి అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చిన ప్పుడు ఆయన వేసిన ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క తా మరపుష్పం పుష్పించింది. అదిచూసి విస్మయం చెం దిన బ్రహ్మదేవుడు తన జ్ఞాన దృష్టితో తెలుసుకోవడా నికి ప్రయత్నించాడు. కాని బ్రహ్మదేవునికి ఏమీ అంతు చిక్కలేదు. వెంటనే బ్ర#హ్మదేవుడు పరమేశ్వరుని ప్రా ర్ధించగా విశ్వనా థస్వామిగా జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడు.
బ్రహ్మదేవుడు మహా విష్ణువుని ఈ క్షేత్ర మహమ తెలియచేయమని వేడుకున్నాడు.
మహావిష్ణువు బ్రహ్మదేవుడు ”మాయ, మానవ, మృగ” రూపాలలో అవతరిస్తే ఈ క్షేత్ర మహమ తెలు సుకోగలడని తెలిపాడు.
పిదప బ్రహ్మదేవుడు గణపతిని కూడా అడుగగా ”ఈశ్వరాజ్ఞ లేనిదే ఏ మి తెలియచేయలేన”ని చెప్పాడు. దాంతో మరింత జిజ్ఞాస పెరిగిన బ్రహ్మ దేవుడు పరమేశ్వరుని ప్రార్ధిస్తూ తపస్సు మొదలెట్టాడు.
తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు మహాగణపతిని బ్ర#హ్మదేవునికి ఈ క్షేత్ర మ#హమని గురించి తెలుపమన్నాడు.
ఇంద్రుడు మాయా, మానవ, మృగ రూపం ధరించగా, గణపతి అష్ట దిక్పాలకులను కపాలాలుగా మార్చి తన నడుముకి కట్టుకున్నాడు.
తరువాత విఘ్నేశ్వరుడు ఆ క్షేత్ర మహమని బ్ర#హ్మదేవునికి వివరిం చాడు. మాయా స్వరూపిణి అయిన ఆదిశక్తి క్షేత్రం యిది. దేవి మహమలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి.
సకల మాయ, మంత్ర తంత్రాలకు అధిదేవత ఆయిన ఆదిపరాశక్తి దేవీ తపశ్శక్తితో ప్రపంచంలోని సమస్త దైవ శక్తులను ఒక కలశంలో బంధించి కృతయుగం, త్రేతాయుగాలు రెంటిని పరిపాలించినది. ఎంతైనా మాయా నిధి ఒక స్త్రీయే కదా..
కలశంలోని గణపతిని వెలుపలికి తీసుకుని వచ్చినది. అప్పుడు మహా గణపతి మాతా.. అని పిలిచాడు. ఆ పిలుపుకు కరిగిన మాయానిధి తన మాతృత్వాన్ని పంచి ఇచ్చింది.
తరువాత మహావిష్ణువుని కలశం నుండి వెలుపలికి తీసుకు రాగా ఆయన ‘సోదరీ’ అని సంబోధించడంతో మహావిష్ణువుకి తన సోదర స్థానం కల్పించింది.
పిదప కలశం నుండి పరమేశ్వరుని వెలుపలికి తీసుకురాగా పరమేశ్వరుడు ‘కామాంత లోకే నామాంత రూపే’ అని వర్ణించగా మాయానిధి పరమేశ్వరుడే తనకి తగిన నాధుడని నిర్ణయించుకొన్నది.
అది తెలుసుకొన్న మహావిష్ణువు, పరమేశ్వరునితో ”తన మంత్రశక్తితో మనలనే ఆడిస్తున్న మాయానిధితో ఎందుకు అలా సంభాషించావు” అని అడిగాడు.
అందుకు మహశ్వరుడు కొంచెం ఓర్పు వ#హంచమని అన్నాడు. తరు వాత మాయానిధి మహశ్వరుని కలవడానికి వచ్చిన సమయంలో, ”నేను నిన్ను వివా#హం చేసుకోవాలంటే నీవు నాకు లోబడి దాసురాలివి అవుతా న”ని ఒక హామీపత్రం వ్రాసి యివ్వాలి.” అన్నాడు.
మాయామంత్ర విద్యలు తెలిసిన మాయానిధి పాదరసాన్ని తాళప త్రంగా మార్చి, దానిలో ”నేను మీకు దాసురాలని” అని వ్రాసి యిచ్చింది.
ఈశ్వరుని చేతికి ఆ పత్రం యిస్తూ ”ఈ పాదరస పత్రం చేజారకుండా పట్టుకుంటేనే నేను మీకు దాసురాలిని” అని పాదరస పత్రాన్ని కిందకి వదలింది.
పాదరసం పరమేశ్వరుని చేయిజారగా కొంత భాగం గణపతి, మహా విష్ణు వుల చేతికి అందింది. అయినా ఒక పాదరస బిందువు భూమిని చేరింది.
అది చూసి మాయానిధి ఆకాశంలో నిలబడి పరమేశ్వరుని చూసి విక టంగా నవ్వగా ఆగ్రహం చెందిన ఈశ్వరుడు తన త్రినేత్రంతో మాయా నిధి ని భస్మం చేశాడు.
మాయానిధి భస్మము, పాదరసము పడిన ప్రదేశమే దేవరాజపు రం గా వెలసింది. తరువాత అక్కడికి వచ్చిన పార్వతి వేదపఠనంతో పర మేశ్వ రుని సంతుష్టుని చేసింది.” అని గణపతి ఆ క్షేత్ర మహమను బ్రహ్మ దేవునికి వివరించాడు. అందుకే ఇక్కడ కొలువైయున్న అమ్మవారికి వేదనాయకి అని పేరు వచ్చింది.
వేదనాయకి సమేతవిశ్వనాథస్వామి…!
Advertisement
తాజా వార్తలు
Advertisement