కుశదన్వుడు అనే మ హర్షి పెళ్లి కూడా చేసుకోకుండా ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తూ ఉండి పోయాడు. కానీ, లక్ష్మీదేవిని కూతురుగా పొందాలని తపన పడేవాడు. ఓసారి అతను వేదాధ్యయనం చేస్తుండగా ఊర్వశి అటుగా వెళ్తున్నప్పుడు ఆమె సౌందర్యం చూసి ఆయన మనసు ఒక్కక్షణం చలించింది. దాని ఫలితంగా రేతస్కలనమై అందులో నుండి ఒక పాప పుట్టింది. వేదం చదువుతుంటే పుట్టింది కనుక ”వేదవతి” అని పేరు పెట్టాడు. పాపకు పుట్టినప్పటి నుండి నారా యణుడి మీదే ధ్యాస. లక్ష్మీదేవి కదా మరి! ఓరోజు అమ్మవారు హమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే రావణుడు అమ్మను చూసి చెర పట్టాలని చూస్తుంటే అగ్నిలో తన ని తాను ఆహుతి చేసుకుని అగ్ని లోకానికి తన నిజరూపంతో వెళ్ళిపోయి అక్కడుం ది ఆ తల్లి. తర్వాత రావణు డు సీతమ్మను ఎత్తుకె ళ్లడానికొచ్చినప్పుడు అగ్నిదేవు డు సీతమ్మను దాచి, ఈ తల్లిని అక్కడ ఉంచాడు. ఎందుకంటే మానవ రూపంలోనున్న తల్లి కదా! కష్టా లు భరించలేదని. సరే! తర్వాత కథ అంతా తెల్సిందే కదా! చివరకు సీతమ్మ అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను తీసుకొ చ్చి చ్చారు. అప్పుడు సీతమ్మ వేదవతితో ”నాకోసం ఇన్ని కష్టాలు పడ్డావు, ఏమైనా వరం కోరుకో” అని అడిగింది. ”నారాయణమూర్తినే నా భర్తగా పొందాలి” అని అడుగుతుంది. అప్పుడు స్వామివారు ”నేను ఈ యుగం లో ఏకపత్నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. కలియుగంలో నేను అవతరిం చినప్పుడు నా భార్యగా నిన్ను పొందుతాను” అని వరమిచ్చారు. ఇదంతా వేదవ్యాసుడు రాసిన కూర్మ పురాణంలో ఉంది. ఆ క్ష ణం నుండీ వేదలక్ష్మి అనే పేరుతో సూక్ష్మరూపంలో భూ మిపై ఉండిపోయిన అమ్మవారు త్రేతాయు గం నుండి స్వామికోసం వేచిఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement