శ్రీ మహాలక్ష్మి ‘షడ్ లక్ష్ములు’గా అవతరించింది. మొదటిలక్ష్మి అవ తారం వేదలక్ష్మిని గతంలో స్మరించుకున్నాం. శ్రీవత్సలక్ష్మి శ్రీ మహాలక్ష్మి రెండవ అవతారం.
ఈ తల్లి స్వామి హృదయంపై పుట్టుమచ్చ ఆకారంలో ఉన్న లక్ష్మి. అది కూడా లక్ష్మీ స్థానం, లక్ష్మీ స్వరూపం. ఒకసారి భృగు మహర్షి వైకుంఠానికొచ్చారు. ఆ సమ యంలో లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి మధ్య వాదన జరుగుతోందని పురాణ వచనం. అదేమిటం టే… ”లక్ష్మీ కలియుగం వచ్చింది. మనం అవ తరించాల్సిన సమయమొచ్చింది. ఈసారి నువ్వు కిందకెళ్లు. నిన్ననుసరించి నేనూ వస్తాను” అని చెప్పారు స్వామి. ”అదేంటి స్వామీ! ప్రతీ అవతారంలోనూ మీరే ముందు వెళ్తారు. నేను తర్వాత వచ్చి, మిమ్మల్ని వివాహం చేసుకుని మీతో దుష్టుల్ని శిక్షింప చేస్తాను. మరిప్పుడు నన్నెందుకు ముందుగా వెళ్లమంటు న్నారు?” అని అడిగింది తల్లి.
”దేవీ! ఇప్పటిదాకా మనం ఎత్తిన అవతారాల్లో దు ష్ట శిక్షణ చేసేసి మళ్లీ వైకుంఠానికి వచ్చేశాం. కానీ, ఇప్పుడలాకా దు. కలియుగంలో దుష్టుల్ని శిక్షించాలంటే భూమిపై ఎవరూ మిగలరు. ఎందుకంటే ప్రతివారిలో ఏదో ఒక దుర్గుణాలుంటాయి. మనం చేయాల్సిం ది వాళ్ల మనసులు మార్చి, వాళ్ల వల్ల మన భక్తులకు అపకారం జరక్కుండా కాపాడాలి, అది మన బాధ్యత. కనుక నువ్వెళ్లు, నేను తర్వాత వస్తాను. ఈ అవతారంలో నాకు ప్రత్యేకంగా పేరు ఉండదు, నీ పేరే నాపేరు. ”శ్రీ”నివా సుడు”గా అవతారమెత్తుతాను” అని చెప్పారు.
”స్వామీ! నీ ఎడబాటు నేను భరించలేను. నేను ముందు వెళ్లడం, ఎప్పుడో మీరు రావడమేమిటీ?” అని బాధపడుతుంది అమ్మ.
”దేవీ! లేదు, నువ్వెళ్లు, నేను మానవావతారంలో వస్తాను. అప్పటిదా కా మనిషిలా ఉంటాను. నిన్ను కల్సుకున్నాక నా ప్రకాశం నాకు వస్తుంది” అని చెప్తుంటారు స్వామి. ఇంతలో భృగుమహర్షి వచ్చి స్వామి వక్షస్థలాన్ని కాలుతో తన్నాడు. వెంటనే స్వామి ఆయన పాదం చేతులలోకి తీసుకుని ఒత్తుతున్నారు. అంతే, అమ్మవారికి ఆగ్రహమొచ్చేసింది. ”నేను నివాస ముండే స్థానమది, అక్కడ అతను తంతే, మీరు ఏమీ అనరా?! పైగా ఆ మహర్షి కాళ్లుపడతారా? ఇదేనా మీ రు నాకిచ్చే గౌరవం?”అని కోపం గా వెళ్లిపోబోతూ, ”తమో గుణ భూయిష్టుడై మహర్షి నన్ను కాలు తోతన్నాడు కదా! మళ్లీ నా శుద్ధసత్వ స్వరూపాన్ని పొం దాకే వైకుంఠానికొస్తాను” అని వెళ్లి పోయింది.
చూడండి..! అమ్మవార్ని కిందకు పంపేందుకు స్వామి వారు భృగు మహర్షితో చేసిన లీల. అమ్మ వారు భూమిపై కొచ్చి మొదట అమెరికా వెళ్లారు. ఇదేంటీ! ఎప్పుడూ వినలేదే అంటారా?! అవును, అమ్మవారు కపిల మహర్షి ఆశ్రమానికెళ్లారు. దాన్నే కపిలారణ్యం అంటారు. అది పాతాళ లోకంలో ఉంది. అంటే, ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియాలో యాష్ హిల్ అనే ప్రదేశముంది. అదే సగరపుత్రులంతా బూడిదైన ప్రదేశం. అందుకే ఆ పేరొచ్చింది. అమ్మ వారు కాలిఫోర్నియాలో కూర్చుని తపస్సు చేసు కుంటున్నారు. అప్పుడు అగస్త్యుడు, మిగతా మునుల తో వచ్చి, ”తల్లి! నువ్విలా పాతాళలోకంలో ఉండిపోతే ఎలాగమ్మా? దయుంచి మాకొక ఉపకారం చేసి పెట్టు!” అని వేడుకున్నారు. ”ఏమిటి నాయనా?” అనడిగింది తల్లి.
”అమ్మా! భూమిపైన పద్మావతీపురమనే అద్భుత ప్రదేశముంది. అక్కడ సతీదేవి నేత్రాలు పడినచోటు. బ్ర#హ్మదేవుడు ఓసారి ముగ్గురు మా నసపుత్రుల్ని సృష్టించాడు. గయుడు, లవనుడు, కోలాసురుడు. వీళ్లంతా రాక్షసులయ్యారు. గయుడు, లవనుడు స్వామివారి చేతిలో చచ్చారు. కోలాసురుడు, వాడి కొడుకైన కరవీరుడుతో కల్సి పద్మావతీ పురాన్ని ధ్వం సం చేస్తూ మాపైన ఆరాచకాలు చేస్తున్నారు. నువ్వు వచ్చి, వాళ్లను చంపి, అక్కడే కొలువుండు తల్లి!” అని వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు కాలిఫోర్నియా నుండి ఇండియా వచ్చేశారు. అందుకే కాలిఫోర్నియా దాదాపు మినీ ఇండియాలాగే ఉంటుంది. అమ్మ భూమిపైకి వచ్చి ఆ ఇద్దర్నీ సంహరించింది. వాళ్లిద్దరూ చనిపోతూ ”మాతా! మాకు బుద్దొ చ్చింది. మీ చేతుల్లో పోతున్నాము, మా జన్మ ధన్యమైంది. ఈ క్షేత్రం మా పేరుతో నిలబడాలి, మీరిక్కడే ఉండి, భక్తుల్ని అనుగ్రహించు తల్లి!” అని వేడుకు న్నారు. ”తథాస్తు!” అని వరమిచ్చి, ‘మహాలక్ష్మీ’ స్వరూపంలో వెలిశారు.
వరదాయిని శ్రీవత్స లక్ష్మి!
Advertisement
తాజా వార్తలు
Advertisement