పాపన్నపేట (ప్రభన్యూస్): శక్తి స్వరూపిణి వనదుర్గా భవాని మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముననే వేదపండితులు వనదుర్గా భవాని మాత మూలవిరాట్ విగ్రహానికి అభిషేకం నిర్వహించి అతిసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆదివారం ప్రభుత్వ సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కోలాహలంగా మారింది. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ తమ సిబ్బందితో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు కరోనా నియమాలు పాటించేలా చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, సూర్యశ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, మహేష్, శ్రీనివాస్‌రెడ్డి, నరేష్, దీపక్‌రెడ్డి, సాయిరెడ్డి, బ్రహ్మం, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement