Tuesday, November 26, 2024

విశాఖ శారదాపీఠంలో వనదుర్గ యాగం పూర్ణాహుతి

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠంలో మూడు రోజులపాటు- నిర్వహించిన వనదుర్గ యాగానికి శుక్రవారం పూర్ణాహుతి నిర్వ హించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మా నందేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో పండితులు ఈ క్రతువును చేపట్టారు. యాగంలో భాగంగా 21 పారాయణలు జపించి, 21 హోమాలను నిర్వహిం చారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు ముందు ప్రతి ఏటా వన దుర్గ యాగం చేపట్టడం ఆనవాయితీ. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ, వార్షికోత్స వాలు నిర్విఘ్నంగా సాగాలని ప్రార్ధిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభమై 11వ తేదీ వరకు విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్స వాలు జరగనున్నాయి. పీఠం ఆధిష్టాన దేవత శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి అంగ దేవతగా వనదుర్గ అమ్మవారు వెలిసింది. రాజశ్యామల అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే వనదుర్గ అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ వనదుర్గ అమ్మవారు మంత్ర స్వరూపకంగా పూజలు అందుకుంటోంది. దశ మహావిద్యలో వనదుర్గ యాగానికి విశేష ప్రాధాన్యత ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement