Tuesday, November 26, 2024

జీవుడికి ముక్తినిచ్చేవైరాగ్య భిక్షా…శిక్షాస్మృతులు!

మహాభారత గాథలలో విదురుడు అత్యంత కీలకమైన పాత్రధా రి. ఆయన తనకు అత్యంత ప్రియుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కథలు వినడంలో విసుగు, విరామం ఎరుగడు. ఎల్లవేళలా ఆయన కథలు వినడం అంటే విదురుడుకు ఇష్టం. మహనీయుడైన మైత్రే య మ#హర్షిని- ”మునీంద్రా! మనోవ్యథలను మరపించి మానిపిం చే పుణ్య శ్లోకుడైన పురుషోత్తమ పరమాత్ముని కథా పీయూషం (అమృతం) చెవులనే దోసిళ్లతో ఎంత తాగినా నాకు తగిన తృప్తి కల గడం లేదు, తనివి తీరడం లేదు. విమలమతీ! విష్ణుభక్తుడైన ధ్రువు ని అశేషమైన వంశ విశేషాలు వివరించ”మని కోరాడు.
విదురుడి కోరిక మేరకు మైత్రేయ మహర్షి ధ్రువుని వంశంలో మరో ధ్రువతారగా వెలిగే, చక్రధారి మహావిష్ణువు అంశావతారమై న ‘పృథు’ చక్రవర్తి విచిత్ర, పవిత్ర చరిత్రను వివరించాడు.
ధ్రువుని వంశంలో జన్మించిన ‘అంగుడు’ అనే పేరుగల అవనీ పతికి (రాజ శ్రేష్ఠునికి) చాలాకాలం వరకు సంతతి కలగలేదు. యజ్ఞపురుషుడైన వెన్ను (విష్ణువు)ని ఆరాధించగా ఆ రాజచంద్రునికి ‘వేనుడు’ అనే కు మారుడు కలిగాడు. కాని వాడు అన్ని విధాల అత్యంత హనుడయ్యాడు. వేనుని మాత సునీథ మృత్యువు కూతురు కావటం వలన మనుమడికి తాత బుద్ధులే అలవడ్డాయి. (ఇక్కడ మృత్యువు అంటే అధర్మ వంశంలో పుట్టినవాడు. అంతేకాని ధర్మరూపుడైన ‘మృత్యుదేవత’ కాదు.) కిరాతుని వలె క్రూరుడై, పాపపు మార్గంలో సంచరిస్తూ సర్వులకూ సర్వదా మనస్తాపాన్ని కలిగిస్తున్న కన్నకొడుకును అంగరాజు ఎన్నో విధాలుగా దం డించి కూడ భంగపడ్డాడు. పాత్రత (యోగ్యత) లేనివానిపట్ల మన ప్రయత్నాలు ఫలించవు. బక ము (కొంగను)ను తెచ్చి ఎంత నేర్పినా శుకము (చి లుక) వలె పలుకలేదుగా! అన్ని యత్నాలు వ్యర్థం కాగా ఖిన్న హృదయుడై ఇలా విలపించాడు.
”ఇలాంటి కుపుత్రుని కనటం, కలకాలం కు మిలిపోతూ మనటం కన్నా, బిడ్డలు లేకపోయినా భూమి మీద బ్రతికినంత కాలం పరువుతో బతక డం మంచిది కదా! విచారించగా వైరాగ్యం కలిగిం చే కుపుత్రుడు కలగటమే, కేశవ భగవానుని కరుణ గా కనిపిస్తోంది. అదే మంచివాడైతే మోహాన్ని పెం చి, వైరాగ్యాన్ని త్రుంచి, మాయా సంసారంలో ముంచుతాడు. ఇక ఆ బంధనాలు తెంచుకోవడం

ఇంచుకైనా సాధ్యం కాదు’ ఇలా విచారించి విజ్ఞానవం తుడై ఒకనాటి అర్ధ రాత్రి అంగుడు అంతా వదిలించు కొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రథమంగా పుత్ర సంతానం లేకపోవడం, పుత్రుని పొందాలనే అను తాపం, తర్వాత ప్రారబ్ద ఫలంగా కుపుత్ర ప్రాప్తి, వాని మీద మాతామహుని (తల్లితండ్రి) ముద్ర- స్వభావ ప్రభావం, దానివలన భరించలేని మనస్తాపం, అన్ని టిని మించి ఆఖరికి వీటన్నింటిలో విష్ణుదేవుని విశేష కృపను వీక్షించి వైరాగ్యం పొందటం- ఇవన్నీ మాన వునికి ముక్తి కలిగించే జ్ఞాన, వైరాగ్య భిక్షా- శిక్షా స్మృతులు!
ఇక రాజులేని రాజ్యంలో అరాజకత్వం రాజ్యమే లింది. పశువుల వలె ప్రవర్తిస్తున్న ప్రజలను చూచి మంత్రులు, పురోహతులు, మునులు అయిష్టంగానే దుష్టు డైన వేనునికి పట్టం కట్టారు. చండశాసనుడైన వేనుడు మత్తవేదండం (మదించిన ఏనుగు) వలె నిరంకుశంగా సంచరిస్తూ సజ్జనులను కించపరచేవాడు. యజ్ఞ, దాన, హోమాలను నిషేధించాడు. మునులు బోధించిన వేద ధ ర్మాలను వేనరాజు తోసిరాజన్నాడు. తన అధర్మమే ధర్మ మన్నాడు. ”మునులారా! నేనే యజ్ఞనారాయణుడను, మగని మీద మమత లేని మాయలాడి రంకు మగనిపై వలపు ఒలకబోసినట్లు, మీరు కూడా మహారాజునైన నన్ను కాదని మరెవరిమీదనో మరులు (ప్రేమ) గొని మసలుతు న్నారు. దేవతలంతా ధరణీపతి దే#హంలోనే కొలువై ఉం టారు. కాన, భూపతియే భగవంతుడు. నన్నే సేవించండి. నాకే బలులు అర్పించండి” అని శాసించాడు.
యజ్ఞపతి అయిన ఇందీవర శ్యాముని, ఇందిరా రమ ణునే నిందించే ఈ నికృష్టుడు ఇక నేలమీద నిలువరాదని మునులు పెల్లుబికిన కోపంతో ఒక్కపెట్టున #హుంకరించా రు. ఆ హుంకారానికి అసుర అంతకుడైన విష్ణుని నిందిం చిన వేనుని ప్రాణాలు అనంతవాయువులో ఐక్యమైపోయా యి. సుతుని మరణానికి దు:ఖించిన సునీథ యోగశక్తిచే అతని శరీరాన్ని చెడిపోకుండా కాపాడింది.
వేనరాజు మరణించగా రాజ్యంలో మరల అరాజక త్వం ఆరంభమైం ది. పైశాచికత్వం ప్రబలింది. వేనరాజులో వేనుడు వైదిక ధర్మాన్ని కాలరాచి, మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసే దుర్మార్గుడు. నాస్తికుడు, ప్రజలను మూఢుల్ని చేసే మతవిశ్వాసా లను, యజ్ఞాల్లోని జీవహంసనూ వ్యతిరేకించే వాడు. తన ధర్మ పరిపాలనతో రాజ్యాన్ని, ప్రజ లను సంరక్షించ వలసిన రాజే ధర్మాన్ని, కర్మలను అవ హేళన చేసిన వేనుని జీవితం ఇలా అర్థాంత రంగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement