సనాతన ధర్మపథంలో గమ్యం ఆత్మసాక్షాత్కారము. ఆత్మను ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకొనగలరని వేదము తెలియజేసింది. వ్రతాలు, నోములు, ఉపవాసా లు, యజ్ఞాలు, యాగాలు, దానాలు మొదలైనవి ఎన్ని చేసినా ఆత్మానుభూతిని పొందలేని వారు తిరిగి జనన మరణ చక్రభ్రమ ణములో పడిపోవాల్సిందే. రుగ్వేదాంతర్గత మైన కైవల్యోపనిష త్తునందు ఈ ఆత్మతత్వమును విశ్లేషించుట జరిగినది. పర మాత్మ స్వరూపుడైన బ్రహ్మదేవుని అశ్వలాయను డు ఈవిధంగా ప్రశ్నించాడు.
అధీహి భగవాన్! బ్రహ్మ విద్యాం వరిష్టాం
సదా సద్భి: సేవ్య మానాం నిగూఢమ్!
యాయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య
పరాత్పరం పురుషం యతి విద్వాన్!!
భగవాన్! ఉన్నతమయినది సదా సజ్జనులచే, బ్రహ్మ జ్ఞాను లచే ఆచరింపబడునది, రహస్యమైనది అయిన దేనిని అనుష్టిం చడం వలన సర్వ పాపములు సమసిపోయి పండితుడు పరమ పదమును చేరగలడో ఆ బ్రహ్మ విద్యను నాకు ఉపదేశము చేయు ము అని ప్రార్థించాడు. అంత బ్రహ్మ పితామహుడు, బ్రహ్మ విద్య ను శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగములను అనుష్టించిన లభించగలదని అశ్వలాయునికి తెలిపెను. కర్మ వల్ల, సంతానము వల్ల, ధనము వల్ల అమృతత్వము లభించదు. త్యాగము ద్వారా మాత్రమే అమృ తత్వము లభించును. లౌకిక విషయములను త్యాగము చేసి స్వర్గము కంటే మిన్నయైన హృదయ కుహురంలో ప్రకాశి స్తున్న ఆ పరమాత్మను యతీశ్వరులు మాత్రమే పొందగలరు.
అమృతత్వమే ఆత్మ స్వరూపము. అది అచింత్యము, అవ్య క్తం, అనంతం, మంగళకరము, ప్రశాంతం, అమృతం, బ్రహ్మ కంటే సనాతనము, ఆది మధ్యాంతరహితము, ఏకము, సర్వ వ్యాప్తి, సచ్చిదానందము, రూపర హితము, పరమాద్భుతమై నది. అటువంటి ఆత్మ స్వరూపమే పరమాత్మ.
ఆత్మ సాధకులు ఏకాంత ప్రదేశంలో సుఖాసీనులై శిరస్సు, మెడ, నిటారుగా, సమముగా నుంచి, శుచిర్భూతులై దేహాత్మ భావనను విడిచి సమస్త ఇంద్రియాలను నిరోధించి గురు ధ్యాన ముతో ప్రారంభించి నిర్మలము, శుద్ధము, శోక రహితము, ఆనంద ధామము అయిన హృద య పద్మవాసియైన ఆ పరమాత్మను ధ్యానిస్తారు. అతడే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇం ద్రుడు, నాశరహితుడు, ప్రాణము, అగ్ని, పరమ స్వరూపుడు, చంద్రుడు, కాలము. భూత కాలంలో ఏది ఉందో భవిష్యత్ కాలంలో ఏది వుండ గలదో అదియే ఆ నిత్యమై న ఆత్మ, సమస్త భూతములను తనలోను, తనను సమస్త భూత ములలోను దర్శించువాడు. ఆ పరబ్రహ్మను చేరుచున్నాడు.
ఇదియే ఆత్మ సాక్షాత్కారము. పరబ్రహ్మమైన ఆత్మ మాయ వలన శరీరము ధరించి జీవుడుగా సమస్త కార్యములను చేయు చున్నాడు. ఇదియే సృష్టి ప్రహేళిక. స్వప్నమందు జీవుడు మాయ వలన సృష్టించుకొన్న లోకములో సుఖదు:ఖాలను పొందుతు న్నాడు. సుషుప్తిలో సర్వ మూ విలీనమై తమస్సుచే సుఖ రూపిగా మారుచున్నాడు. తిరిగి జీవుడు జన్మాంతర కర్మ యోగము వలన మేల్కొనుచున్నాడు. ఈవిధంగా జాగ్రద, స్వప్న, సుషుప్తి యను మూడు అవస్థతో ఆత్మజీవునితో క్రీడించుచున్నది. తిరిగి అవస్థలన్నీ ఆత్మలోనే లయమగుచు న్నాయి.
ఆత్మ నుండే ప్రాణము, మనస్సు, సర్వేంద్రి యములు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, విశ్వము, భూమి, సమస్తము ఉత్పన్నమగుచు న్నాయి. సమస్తము ఆత్మయందే జనించి, స్థితి పొంది, తిరిగి ఆత్మలోనే లయమగుచున్నాయి. ఆ ఆత్మయే అద్వైత బ్రహ్మ. సదా చైతన్య స్వరూప మైనది. అటువంటి సర్వ సాక్షియైన పరమాత్మను తనలోనే దర్శించుకొనుటను ఆత్మానుభూతి అని, కైవల్యమని ఉపనిషత్తులు విశదీకరిస్తున్నాయి. విద్యలన్నింటిలో బ్రహ్మ విద్య బహు క్లిష్టమైనది. దీన్ని క ఠోపనిషత్తు వివరించింది.
అణోరణీయాన్ మహతో మహీయాన్
ఆత్మ స్యజంతో: నిహితో గుహాయమ్!
తమ క్రతు: పశ్యతి వీత శోకో ధాతు ప్రసాదాత్ మహిమాన మాత్మన:
చి అణువుకంటే చిన్నది, పెద్ద వాటికంటే పెద్దది అయిన ఈ జంతువు ఆత్మబుద్ది అనే గుహలో దాగి ఉంది. దీన్ని తెలుసుకో వలనంటే సర్వ సంకల్పాలు, కర్మలు వదిలి ఎటువంటి శోకము, చింత లేక ధాతువులయిన మనసు, ఇంద్రి యాలను శాంతింప జేసి, వాంఛారహితుడై ఉండాలి. అప్పుడే ఆత్మ జ్ఞానం లభిస్తుం దని శ్రీ శంకరులు తెలియజేసారు. ఆత్మ జ్ఞాని హృదయమే వైకుంఠము.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269