Tuesday, November 19, 2024

వాగ్భటుని అష్టాంగ హృదయం

శ్లో|| భోజనాగ్రే సదాపధ్యం, లవణార్ద్రక భక్షణమ్‌,
రోచనం దీపనం వహ్న, జిహ్వా కంఠ విశోధనమ్‌.
తా: భోజనాత్పూర్వము అల్లము, సైంధవ లవణము కలిపిన మిలితిని నజీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. గొంతు నాలుక పరిశుద్ధమై, రుచి కలుగుతుంది.
శ్లో|| భుక్త్వాశతపదం గచ్చేత్‌, తాంబూలంతదనంతరమ్‌,
వామపార్శ్వేతుశయనం, ఔషధై: కింప్రయోజనమ్‌.
తా: భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూల సేవనము చేసి, ఎడమ వైపున శయనించుచో యిక ఔషధములెందుకు? (ఆరోగ్యవం తుడై యుండునని భావము.)
శ్లో|| అనాత్మవంత: పశువత్భుంజతేయో? ప్రమాణత:,
రోగానీకస్యతే మూలమ్‌, అజీర్ణం ప్రాప్ను వంతి#హ.
తా: ఎవరైతే మితమనేది లేకుండా ఎల్లప్పుడూ ఏదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణ వ్యాధికి గురవుతారు. అజీర్ణమే సర్వరోగములకును మూలము. (మాన వులు ఆయా వేళలయందే మితముగా భుజించవలెను.)ఇటువంటి సనాతన ఆరోగ్య సూత్రములను గురించి వాగ్భటుని అష్టాంగ హృదయం వివరిస్తోంది.
బృహత్త్రయీస్‌ అంటే ఆయుర్వేదంలోని ‘గ్రేటర్త్రయం’ అంటే ‘చరక సంహత’, ‘సుశ్రుత సంహత’, ‘అష్టాంగ సంహత’ (హృదయ, సంగ్రహ) అనేవి. వ్యాధి, చికిత్స వివరాలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద ప్రాథమిక అంశాల వివరాలను పొందేం దుకు బంగారు సూచనలు, ప్రామాణిక గ్రంథాలు. ఆ బృహత్‌ త్రాయి చరక, సుశ్రుత, వాగ్భటులు. భారతీయులమైన మనకు అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వా లలో ఒకటి ఆయుర్వేద శాస్త్రం. ప్రపంచ వ్యాప్తంగా విధాన నిర్ణేతల అత్యంత ముఖ్యమైన ఆందోళనలలో ప్రజారోగ్యం ఒకటిగా ఉన్న సమయంలో ఇది తప్పనిసరిగా బలోపేతం చేయబడాలి. ఆహార (ఆహారం) మరియు విహార (జీవనశైలి) సమతుల్యం చేయవలసిన అవసరం చాలా ముఖ్యమైనది. రోజువారీ, కాలానుగుణ నియమావళిపై ఇటువంటి శాస్త్రీయ వివరణలు ప్రాచీన భారతదేశం నుండి అనేకమంది వైద్యులచే సంకలనం చేయ బడ్డాయి. సాధారణ వైద్యం (కాయ చికిత్స) అలాగే శస్త్రచికిత్స (శల్య- తంత్రం) పట్ల వారి ప్రాథమిక సహకారం కారణంగా చరక, సుశ్రుతల గురించి తెలుసుకున్నాము. కానీ, మూడవ పండితుడు బహుశా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు, ఎందుకంటే అతను వివిధ ఆయుర్వేద సిద్ధాంతాలను సంశ్లేషణ చేయడం, వాటిని విశేషమైన కవితా నైపుణ్యంతో వివరించడం చేశాడు. ఇతడే వాగ్భటుడు.
వాగ్భటుడు అత్యంత ప్ర భావవంతమైన రచయితలలో ఒకరు, శాస్త్రవేత్త, వైద్యుడు. ఆయుర్వేద సలహాదా రు. అంతేకాదు ఒక సుప్రసిద్ధ భారతీయ ఆయుర్వే ద వైద్యుడు. వాగ్భటుడు. క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందినవాడని చెబుతారు. ఆయన జీవితకాలం 135 సంవత్సరాలు.
చరక సుశ్రుత కాశ్యప సంహ తల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృ తమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే… ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృద యం’. వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవారు లఘు వాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహత’లని అంటారు. ఈ సంహతల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రి దోషాల్లో ఒకటైన కఫా (శ్లేష్మం) న్ని అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది.
సంస్కృతంలో అష్టాంగ అంటే ‘ఎనిమిది భాగాలు’. ఆయుర్వేదంలోని ఎనిమిది విభాగాలను సూచిస్తుంది. జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, చెవి-ముక్కు- గొంతు, సర్జరీ, టాక్సికాలజీ, జెరియాట్రిక్స్‌, అప్రోడిసియాక్‌ థెరపీ.
వాగ్భటుడు చరకుని శిష్యుడు. వాగ్భట అష్టాంగ సంగ్రహ ముగింపు శ్లోకాలలో, సింద్ల³ో (నేడు పాకిస్తాన్లో) నివసించాడని. సింహగుప్తుని కుమారుడు, అవలోకిత శిష్యుడు అని చెప్పబడింది. అష్టాంగ సంగ్రహం ప్రారంభంలో శివుణ్ణి పేరుపేరునా స్పష్టంగా స్తుతించడం ద్వారా అష్టాంగ హృదయ సంహతలోని ప్రారంభ శ్లోకంలో ”అపూర్వమైన గురువు” పేరుతో శివుణ్ణి స్తుతించడం ద్వారా అతను వైదికుడు అని తెలియవస్తోంది. అత ని కుమారులు, మనుమలు, శిష్యులు అందరూ వైదికులు కావడం వల్ల, అతను వైది కుడిగా ఉండేవాడు అని మాత్రమే తెలుస్తోంది తప్ప వ్యక్తిగతంగా అతని గురించి పెద్దగా తెలియరాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే ఈ ఉన్నతమైన ఆలోచన భారతీయ చరిత్ర లో కీలకాంశం, వాగ్భట రచనలు ఈ భావాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి.
వాగ్భటుడు- అంటే ”పదాలతో యోధుడు” అని అర్థం.
వాగ్భటుని రెండు పుస్తకాలు మొదట 7000 సూత్రాలతో సంస్కృతంలో వ్రాయ బడ్డాయి. వాగ్భట ప్రకారం, 85 వ్యాధులను వైద్యుడు లేకుండా నయం చేయవచ్చు. కేవలం 15 వ్యాధులకు వైద్యుని అవసరం ఉంటుంది అని తెలియవస్తోంది. చరక, సుశ్రుత, వాగ్భటుల ను వృద్ధ త్రయం అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement