Friday, November 22, 2024

ఉపనిషత్‌ వైభవము


మన భారతీయ సనాతన సంప్రదాయంలో విద్యలు పర- అపర అని రెండు విధాలు. అపర అని తెలుపబడే వేదాల ద్వారా మానవుడు ధర్మం-అర్థం-కామం అనే మొదటి మూడు పురుషార్థాలను పొందవచ్చు. సంపాదించవచ్చు. అలాగే పర విద్యగా పరిగణింపబడే ఉపనిషత్తుల ద్వారా, నాలుగవ పురుషా ర్థమైన మోక్షాన్ని సాధించవచ్చును.
ఉపనిషత్తు అంటే ఏమిటి?
గురువు తన సమీపంలో కూర్చున్న శిష్యునకు అనుగ్రహ పూర్వకంగా ఉపదేశించిన జ్ఞానరాశి అని భావం. ఉపనిషత్తులు ఆయా వేదాల చివరి భాగాలుగా ప్రకాశించడం వల్ల వీటికి వేదాం తమనే వ్యవహారమేర్పడినది. ఉపనిషత్తులు నిర్దేశించే మార్గము ను శ్రుతిప్రస్థానమని ఆర్యులు, పెద్దలు అంటుంటారు.ప్రాచీన బుషులు-బుషి పుత్రులు ఒకచోట చేరి ఆత్మ అంటే ఏమిటి? జీవు డంటే ఎవరు? జీవేశ్వరుల సంబంధం ఏమిటి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎచటికి వెళతాము? అను ప్రశ్నలను గురించి దీర్ఘమైన చర్చలు జరిపారు. వాటి వలన వచ్చిన సమాధానములే ఉపనిషత్తులు జగద్గురువైన ఆది శంకరాచార్యు ల కాలమున సర్వాంగీకారము పొందాయని ప్రతీతి.
దశోపనిషత్తుల నామములు
1.ఈశావాస్యోపనిషత్తు. 2.కేనోపనిషత్తు. 3.కఠోపనిషత్తు. 4.ప్రశ్నకోపనిషత్తు. 5.ముండకోపనిషత్తు 6.మాండ్యుకోపనిష త్తు. 7.తైత్తరీయ ఉపనిషత్తు. 8.ఐతరేయొపనిషత్తు. 9.ఛాందోగ్యో పనిషత్తు. 10.బృహదారణ్యకోపనిషత్తు. వీటికి ఆదిశంకరాచార్యు లు భాష్యములు రచించి దేశానికి అం దించారు. రాయప్రోలు లింగన సోమయాజి శంకర భాష్యానుసారం సరళమైన భాషలో తెనిగిం చి, దాదాపు ఏబది ఏండ్ల క్రితమే ప్రకటించా రు. ఉప నిషత్‌ చంద్రిక అనే పేరు తో ఆరు భాగాలుగా సంపుటాలుగా ముద్రింపబడి నవి. ఇందు మాండుక్యోపనిషత్‌ అనువ దింపబడినది. దీని సారాంశము మోక్ష్రపా ప్తికి మాండూక్యం ఒక్కటే చాలు అను ప్రశ స్తియే దీని విశిష్టతను చాటుతుంది. ఉపని షత్తు అధర్వ వేదానికి సంబంధించినది.
మాండ్యుకోపనిషదర్థ సారాంశము ఇందులో నాలుగు ప్రకరణములు న్నాయి. పన్నెండు మంత్రములు గలిగి పరిమాణముచే ఉపనిష త్తులన్నింటికంటె అత్యల్పమైనది. ఇది సర్వ వేదాంత సార సంగ్ర హము. విషయము ప్రీఢము గాంభీర్యముగా నుండి గరిష్ఠమై అలరారుచున్నది. మాండుక్యమేక మేవాలం-ముముక్ష్యూగాం విముక్తియే అని తెలుపబడినది. అనగా ముక్తిని గోరు వారి మోక్ష వ్యాప్తికి మాండూక్యమొక్కటే చాలునని ముముక్షువులందరూ తెలుసుకొని ప్రశంసించినారు. పరాపర బ్రహ్మ వ్యాప్తి సాధనము ఓం కార తత్వము. మూడు రీతులుగా మంద- మధ్యమ- ఉత్త మాధికారులకు తేలికగా అర్థమగునట్లుగా వివరింపబడినది. గౌడ పాదాచార్యులు ఈ ఉపనిషదర్థమును కారికలను పేరుతో విశదీ కరించి, అద్వైత తత్వమును ప్రకాశింపజేసినారు.
ఈ కారికలు ఆగమ- వైతధ్య- అద్వైత- అలాత శాంతులని నాలుగు ప్రకరణములు. ప్రథమ ప్రకరణము ఆగమ ప్రధాన మై, ఆత్మతత్త్వమును, ఓంకార తత్త్వము నిర్ణయింపబ డినది.
వైతధ్య ప్రకరణమున ద్వైతోపషమనము తెలుపబడినది. అద్వైత తత్త్వము తృతీయ ప్రకరణ మున విచారింపబడినది. అద్వైత తత్త్వాసంగత ములునగు మతాంత రములు ‘అలా తశాంతి” ప్రకర ణమున త్రోసివేయ బడినది. మంగ ళ శబ్ద జాల ములు
శ్రుతి, స్మృత్యాత్మకములగునవి గాన నిరంతరము శుభ కృత్యములను చూచుచూ గురు- శిష్యులి రువురూ భావన చేసి, మేము భయులము – దీర్ఘాయుష్మంతులమై చక్కగా జీవింతుము గాకయును, శాంతి మంత్రము ఉపనిషత్తు ఆరంభమున పఠిం పబడుచున్నది. శబ్దములన్నియు వాచకములు. పదార్థములన్ని యు శబ్ద వాచ్య ములు. శబ్దములన్నియు ఓం కారముకంటే వేరుగావుగనుక అవి ఓంకార స్వరూపముల గుచున్నవి.బ్రహ్మము ఓంకార శబ్ద వాచ్యము. పరోక్షముగా దోచు బ్రహ్మ మే య పరోక్షమగు ఆత్మ. అవస్థాత్రయమైన జాగ్రత్‌- స్వప్న- సుషుప్తులను ఉపాధి విశేషములందు ‘ఆత్మ’ విశ్వతైజస ప్రాజ్ఞులను సంజ్ఞచే మూడు పాదముల వ్యవహరించబడుచున్నాడు. అవస్థా త్రయము తొలగి నప్పుడు సర్వ ద్వైత భావము ఉపశమించి తూరీయుడౌతాడని వ్యాఖ్య వివరణ.సర్వేశ్వరుడు ప్రాజ్ఞుడు. జాగ్రదవస్థలో ప్రజ్ఞ బాహ్య విష యములనావరించి, తేజోరూపమున అనుభవించును. ఇదే తైజ సావస్థ. ఇది కేవలము మానసికము. గాఢనిద్రయందు ఇంద్రి యాలు పనిచేయవుగాన అజ్ఞానము మాత్రము అనుభూతమౌ తుంది. విషయ వాసనలన్నీ ఘనీభవించి సూక్ష్మరూపము దాల్చి యుండును. ప్రజ్ఞానము మాత్రము నిల్చి ఉంటుంది. కేవల సుఖము మాత్రము అనుభవంలో వుండును. ఇది ప్రాజ్ఞావస్థ. ఈ మూడు అవస్థలలో ప్రాజ్ఞునిచే తోముఖుడంటారు. సుషుప్తి సుఖ ము ఉపాధి సహితముగాన నిత్యముగాదు. ప్రాజ్ఞుడే సర్వేశ్వ రుడు- సర్వజ్ఞుడు. అంతర్యామి. సర్వభూతము లకు ఉత్పత్తి స్థితిల య హేతువగుచున్నాడు. తురీయమనగా సమాధి స్థితి. ఇది మనోవాగతీతము. తురీ యము- శాంతము- శివము అద్వైతము. తురీయము యొక్క నాల్గవ పాదం విశ్వతైజసము- ప్రజ్ఞ. అవస్థ వీటిని దాటినపుడే తురీయ ప్రాప్తి జరుగుతుంది. తురీయము నందు మానసిక వాసనలుండవు. జాగ్రదాదులున్నప్పుడు తత్త్వ మును గ్రహింపలేరు. ధర్మ సామ్యముచే ఓంకారోపాసనము వివరించారు ఉపనిషత్తులో. ఓంకారము అకార- ఉకార- మకా రములను మాత్రా త్రయాత్మకమంటారు. వీటి పర్యవ సానమే ఓంకారం. పాదత్రయములో విశ్వుడు ప్రధముడు. అకారము ప్రధమము. ఉకారము ప్రధానముగ చేయు ఓంకారోపాసన వలన జ్ఞాన సంతతి కల్గును.
ఉపాసకులకు జగత్తు యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. పరమార్థ తత్త్వం తెలుస్తుంది. ఓంకారం ప్రణవంగాన మునులు ఉపాసన చేస్తారు. మననం చేయువాడే ముని. ఓంకారోపాస నము చేయువాడు సర్వవంద్యుడవుతాడు. ఓంకారము శాంతము- శివ ము- అద్వైతము. ప్రణ వము పర- అపర బ్రహ్మ వ్యాప్తి సాధనమై అలరారుతుంది.ఈ మాండూక్యోపనిషత్తు ఓంకార స్తోత్రముతో ఆగమ ప్రకరణము ముగిసి జీవులు సుఖశాంతులు పొందుచున్నా రని తెల్పుచున్నది. అద్వైత ము మంగళకరమని ఆదిశం క రులు భాష్యంలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement