Tuesday, November 26, 2024

అద్వితీయం… అవెూఘం… ఆంజనేయం!

ఈ విశాల విశ్వంలో సేవకుని ధర్మం మిక్కిలి కష్ట సాధ్యమైన ది. యోగి తన శరీరమును స్థిరంగా ఉంచి, మనస్సుపై విజయాన్ని సాధించవలసి ఉంటుంది. కానీ సేవకుడైతే తన ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని స్వామి మనస్సుకి, బుద్ధికి అనుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. సేవకునకు తనది అం టూ ఏమీ ఉండదు. తనదిగా చేసుకొనడానికి కూడా ఏమీ ఉండదు. అంతా స్వామిదే అనుకుంటాడు. రాత్రి, పగలు స్వామి సుఖాన్ని గురించిన చింతనే మదిలో ఉంటుంది.
భృత్సకార్యం- హనుమతాకృతం- సర్వమశేషత:
సుగ్రీవ స్యే దృశోలోకే- నభూతో న భవిష్యతి
జగత్తునందు సేవకులు మూడు రకాలుగా ఉంటారు. స్వామి తనకు అప్పగించిన కార్యంతోబాటు మిగతా కార్యములను గూడా నేర్పుతో నెరవేర్చువారు ఉత్తమ సేవకులు. స్వామి అప్పగించిన పనిని పూర్తి చేసుకొనివచ్చువారు మధ్య ములు. శక్తి సామర్ధ్యాలు కల్గి ఉండి కూడా స్వామి కార్యమును చక్క గా ఎవరు చేయరో, బొత్తిగా వెట్టిచాకిరి అని తలచి త్రోసి పుచ్చువారు అధములు. కావున మన హనుమ శ్రీరామునకు ఉత్తమోత్తమ సేవ కుడు. అందుకే శ్రీ రాముడు హనుమపట్ల కృతజ్ఞత తెలుపుతూ ఇలా అన్నాడు. ”హనుమా! నేను నీ ఉపకారాల నుంచి, సేవల నుంచి జన్మజన్మాంతరాలకు విముక్తుడను కాజాలను.”
హనుమ సీతమ్మను లంకలో చూచి వచ్చినప్పటి నుంచి ఆమె కు అమితమైన భక్తుడైనాడు. సీతను చూసిన విషయం, అక్కడ తాను చేసిన పనులు అన్నీ రాముడికి వివరించాడు. సీతమ్మ ఇచ్చి పంపిన చూడామణి రాముని చేతిలో వుంచినాడు. లంకలో హను మ పడిన ఆవేదనను విని శ్రీ రాముడు విలపిస్తూ, హనుమా! ఈ దుష్కరమైన కార్యాన్ని నీవు తప్ప దేవతలు- యక్షులు- గంధర్వు లు మొదలైన వారెవ్వరూ సాధించలేరు.
శత యోజన సముద్రమును దాటే శక్తి గరుత్మంతునికీ, హను మకీ వాయుదేవునకు మాత్రమే ఉంది. సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చాక హనుమ నన్ను కొనేశాడు. నన్ను రుణగ్రస్తునిగా చేశాడని రాముడు ఆవేదన చెందినాడు. హనుమ రుణాన్నుండి నేను ఎప్ప టికీ రుణ రహితుణ్ణి కాజాలను. శ్రీరాముని ఆవేదనాభరితమైన మాటలు విని భగవాన్‌ హనుమను పలు రీతులుగా ప్రశంసించాడు.
”హనుమా! నీవు చేసిన ఈ ఉపకారానికి ఎంతటి బహుమాన మిచ్చినా సరిపోదు. అయినా ఇవ్వడానికి నా దగ్గరేముంది? ప్రస్తు తం నా దగ్గర ఒక కౌగిలింత మాత్రమే ఉంది. అంటూ హనుమను గట్టిగా తన గుండెను హత్తుకున్నాడు శ్రీ రాముడు. ఆ ఆలింగము ను పొంది హనుమన తన సర్వమూ లభించినట్లుగా మురిసిపోయి నాడు. ఉపకార స్వభావమే సేవా ధర్మముగదా! అలాగే హనుమ సుగ్రీవుని సేవా కార్యాన్ని పూర్తి గా నెరవేర్చినాడు. జగత్తుల ఇలాంటి సేవకుడు అద్యావధి జనించలేదు. జనించడు గూడాను. ఇక్ష్వాకు వంశమునే రక్షించావ”ని హనుమను ప్రశంసించినాడు శ్రీరాముడు. శ్రీరామునకు ప్రాణ ప్రియుడైనాడు. నిజమైన భక్తుడైనాడు. హనుమ పవనకుమారుడు. రుద్రుని అవతారు డు. విఘ్న నాశకుడు. శోకాన్ని నశింపజేయువా డు. దీన రక్షకుడు. ప్రతి పాలకులకు అధ్యాపకు డు. ఆయన పనులన్నీ సేవాభావంతో శ్రీరాముని అనుగ్రహం కొరకే జరుగుతాయి. శ్రీరామ కార్య మునాచరించుటకు హనుమ అన్ని వేళలా సంసి ద్ధుడై ఉంటాడు. ఉపకారము చేయుటలో ఈయ నకు ఈయనే సాటి. భయపడడం గానీ, వ్యాకు లత చెందడంగానీ, ఈయనకు తెలియదు. సర్వ సమర్ధుడు ఈ వానరవీరుడు.
హనుమ ఆజన్మ బ్రహ్మచారిగా తన దివ్య శక్తితో ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించగల డు. నిజమైన బ్రహ్మచారికి ఏవిషయం అసా ధ్యంకాదు. బ్రహ్మచారులలో అగ్రగణ్యుడు గాన, తన బ్రహ్మ చర్య శమ-దమ త్యాగ- తితిక్ష- ప్రజ్ఞ, విలక్షణ బుద్ధి కేశలం చేత శ్రీరాముని సేవ లో నిమగ్నమై, ఆచరణలో చూపి శ్రీరాముని వశపరచుకున్నాడు. సీతాన్వేషణ సమయంలో ఆయన చూపిన
బుద్ధి కుశలతకు శ్రీరా ముడు ప్రభావితుడై, సర్వ కాలాలకూ హనుమంతునకు అనుకూలు డై ఉన్నాడు. శ్రీరాముని కార్యమును సాధించేవరకూ విశ్రమిం చలేదు. సేవాధర్మం అంటే ఆయనదే.
రామకార్య దురంధరుడై, తన పురుషార్థమును విడువరాదని తలచిన హనుమ నిరాశ చెందక లంకలో సీత కొరకు అణువణువు నూ తరచితరచి వెదకి తన కార్యమును సాధించుటలో కృత కృత్యు డైనాడు. సేవాభావంతో ఎంతో మహిమగలదని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు శ్రీరాముని దూత హనుమ. లంకలో సీతమ్మ సంశ యాన్ని తీర్చుటకు ఆమెకు మనసారా నమస్కరించి తన విశ్వరూ పాన్ని చూపి, ఆమెకు విశ్వాసం గల్గించిన సేవాదురంధరుడు. స్వామి కార్యాన్ని చేయడం నిజమైన సేవకులు తమ భాగ్యంగా భావి స్తారు. స్వామి సేవ చేయడంలో పరమానందానుభూతి కలు గని సేవకులు సేవకులు కాదు. జీతం తీసుకొనే దాసులు మాత్రమే. దాసులు స్వార్ధ బుద్ధితో సేవ చేస్తారు. కానీ సేవకునకు సేవ చేయడా నికి అవకాశం లభిస్తే చాలు. అట్టివానికి సేవ చేయడంలో ఒక అపూ ర్వమైన ఆనందానుభూతి కలుగుతుంది.
లక్ష్మణ మూర్ఛవేళలో సుగ్రీవుడు హనుమ శక్తిసామర్ధ్యాలను ప్రశంసిస్తూ ”హనుమ ఒక్కడే లక్ష్మణుని మూర్ఛ నుండి లేపగలడు. హనుమ శ్రీరాముని పట్ల అచంచల భక్తి- శ్రద్ధ- అనురాగం గల వాడు. ఇతడే ఈ కార్యాన్ని కూడా సేవా భావంతో చేసి మన అందరి దు:ఖాన్ని పోగొడతాడు.” అన్నాడు సుగ్రీవుడు. అలాగే హనుమ సంజీవని దేచ్చి లక్ష్మణునికి జీవం పోశాడు. రో మరో మాన రామనా మమును నింపుకొని, పావన నామ సంకీర్తనలో పులకితమై, రామదూతగా, ఆదర్శ సేవకునిగా త్రేతాయుగంలో నిలిచి, చిరంజీవిగా రామునిచే ఆశీర్వదింపబడిన హనుమ మహా వీరుడు. అంజనా నందనుడు. శ్రీరామచంద్రుని కృపకుపాత్రుడైన వాడు. రామ సంకీర్తనా ప్రియుడు. ఆదర్శ సేవకుడు.

– పి.వి. సీతారామమూర్తి; 9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement