అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్రస్వరూపం. ఆమె సింహముఖం తో ఉంటుంది. ప్రత్యంగిరామాతను అమ్మ వారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధ ర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతి గా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు.
పూర్వం హరణ్యకశిపుడిని చంపేందుకు, విష్ణువు నరసింహస్వామిగా అవతరించి, హరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడి సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం చల్లారలేదట. దాంతో బ్రహ్మాది దేవతల కోరిక మీద శివుడు, శర భేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఎదిరిం చి ఓడించి ఆయన కోపాన్నితగ్గించి, అవతార సమా ప్తి చేశాడు. ఆ సమయంలో అమ్మవారు శూలిని, మహా ప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శర భేశ్వరుడికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మ వారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించి స్తుతించారట. అందుకనే ఆ రుషులిద్దరి గుర్తుగా ఈమెను ప్రత్యంగిరా అని పిలు స్తుంటారు. ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తల పెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు పీడి స్తున్నాయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిం దనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మ వారిని పూజి స్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు.
నికుంబల హోమం
ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసినవాళ్లు ఎంతటి విజయాన్నయినా అందుకుంటారట. అందు కనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమా న్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది.
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని అయ్యావడి ఊరిలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు.
హోమానికి పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చి లాంటి 108 రకాల వస్తువులను ఉప యోగిస్తారు. హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం అమ్మ వారి మహమ. ప్రత్యంగిరాదేవి సింహ ముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహ అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రు నాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరు క్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరాదేవి ఉగ్ర స్వరూపి ణి. ఆమెని పూజించేటప్పుడు మద్యపానం, మాంసా హారం తినడం లాంటి పనులు చేయకూడదు.
వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి. శత్రుసంహా రం, దారిద్య్ర నివారణ, ఆరోగ్యం కోసం ప్రత్యంగి రాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని శాస్త్ర వచనం.
సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండు మిరపకాయ లు, తెల్ల ఆవాలు, నల్లఉప్పు, శొంఠి, సమిధల వంటి రాజద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషే కాలూ హోమాలూ నిర్వహస్తారు.
ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని ‘చంద్ర ఘంట’ (నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇలా తనను పూజించిన ఎందరో పురాణ పురుషుల ను అన్నివిధాలా కాపాడి రక్షించిన దేవత ప్రత్యంగి రాదేవి. రూపం ఉగ్రంగా ఉన్నా ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచి కాపాడుతుంది. దుష్టులకు, ఇతరులకు హాని చేయాల నుకునే వారికి ఉగ్రరూపిణి. వారు చేసే పాపకార్యా లను తిరిగి వారికే ఇస్తుంది. అలాగే మంచి వారికి వచ్చే కష్టాలను తొలగించే వరాలిచ్చే దేవత. నిత్యం లలితాస#హస్రనామం చదివేవారిని దుష్టగ్ర#హ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరాదేవేనని పురాణ వచనం.
– దైతా నాగపద్మలత