Tuesday, November 26, 2024

ఉగ్రస్వరూపిణి ప్రత్యంగిరాదేవి

అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి అవతారం చాలా ఉగ్రస్వరూపం. ఆమె సింహముఖంతో ఉంటుంది. ప్రత్యంగిరా మాతను అమ్మవారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధి పతిగా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు.
పూర్వం హిరణ్య కశిపుడిని చంపేందుకు, విష్ణువు నరసింహ స్వామిగా అవతరించి, హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడి సంహరించిన తర్వాత కూడా నరసింహ స్వామి ఉగ్రరూపం చల్లారలేదట. దాంతో బ్రహ్మాది దేవతల కోరిక మీద శివుడు, శరభేశ్వ రుడనే అవతారంలో నరసింహస్వామిని ఎదిరించి ఓడించి… ఆయన కోపాన్ని తగ్గించి, అవతార సమాప్తి చేశాడు. ఆ సమయంలో అమ్మవారు- శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరుడికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించి స్తుతించారట. అందు కనే ఆ రుషులిద్దరి గుర్తుగా ఈమెను ప్రత్యంగిరా అని పిలుస్తుంటారు. ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు పీడిస్తు న్నాయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మ వారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు.
ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమా న్ని చేసిన వాళ్లు ఎంతటి విజయాన్నయినా అందుకుంటారట. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది.
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని అయ్యావడి ఊరిలో ఉన్న ప్రత్యంగిరా దేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు.
హోమానికి పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చి లాంటి 108 రకాల వస్తువులను ఉపయోగిస్తారు.
హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియ కపోవడం అమ్మవారి మహిమ. ప్రత్యంగిరాదేవి సింహ ముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహ అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధ పడుతున్నవారు, శత్రు నాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు… ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలి తంవస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్ర స్వరూ పిణి. ఆమెని పూజించేట ప్పుడు మద్యపానం చేయడం,
మాంసాహా రం తిన డంలాంటి పనులు చేయ కూడదు.
వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి. శత్రుసంహారం, దారి ద్య్ర నివారణ, ఆరోగ్యం కోసం ప్రత్యంగిరా దేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యం గిర. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని శాస్త్ర వచనం.
సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండు మిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్లఉప్పు, శొంఠి, సమిధల వంటి రాజద్రవ్యాలతో అదీ అమా వాస్యనాడు ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ నిర్వహిస్తారు. ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని ‘చంద్రఘంట’ (నవ దుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభర ణంగా ధరించాడట. ఇలా తనను పూజించిన ఎందరో పురాణ పురుషు లను అన్నివిధాలా కాపాడి రక్షించిన దేవత ప్రత్యంగిరాదేవి. రూపం ఉగ్రంగా ఉన్నా ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచి కాపాడుతుంది. దుష్టులకు, ఇతరులకు హాని చేయాలను కునే వారికి ఉగ్రరూపిణి. వారు చేసే పాప కార్యాలను తిరిగి వారికే ఇస్తుంది. అలాగే మంచి వారికి వచ్చే కష్టాలను తొలగించే వరాలిచ్చే దేవత. నిత్యం లలితాసహస్రనామం చదివే వారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని పురాణ వచనం.

సేకరణ: దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement