భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఇలా ఒక్కో ఆల యానికి ఒక్కోవిధమైనటు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలా అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మనదేశంలో ఎన్నో అష్టాదశ శక్తి పీఠాలుగా అమ్మవారికి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి.
ఈవిధంగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలలో అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం ఒకటి. భక్తులు కోరిన కోరికలను నెరవేర్చుతూ దివ్యక్షే త్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం.
ఈ ఆలయంలో పర మేశ్వరుడు మేఘనాథ స్వా మిగా, జగన్మాత పార్వతీదే వి లలితాంబికగా ఆవిర్బ éవించారు. ఈ దివ్యక్షేత్రం తిరుమీయచూర్ ఆలయం. ఇది తమిళనాడులోని తిరు వరూర్ జిల్లాలో వుంది. పరమేశ్వరుడు స్వయంభు వుగా వెలిశారు. పాండాసు రుడనే రాక్షసుడును వధిం చడానికి జగన్మాత యజ్ఞ గుండం నుంచి శ్రీచక్ర రథం పై ఆశీనురాలై లలితాంబిక నామధేయంతో ఆవిర్భవిం చింది. అతన్ని సంహరించి ఉగ్రరూపంలో వున్న ఆమె ను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తప స్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు. లయకార కుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలిగా మారింది. అనంతరం వాక్దేవతలను సృష్టించి తనకు సహస్రనా మాలతో పూజచేయమని కోరింది. ఈ సహ స్రనామాలనే లలితాస్తోత్రముగా పిలుస్తారు. ఇలా ఇద్దరూ తమ అభ యహస్తాలతో భక్తులను దీవిస్తూ కొలువుతీరివున్నారు.
ఇక్కడ ఆ ఆలయంలో అమ్మవారి ముందు నెయ్యి వుంటుంది. అందులో అమ్మ వారి ప్రతిబింబం భక్తులకు కనిపిస్తుంది. అలా కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి నట్లే. భక్తులు అమ్మవారిని నేతిలో దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఉన్న కష్టాలు తొలగిపో వడమే కాకుండా భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు రావని భక్తుల విశ్వాసం. పరమేశ్వరుడికి, అమ్మవారికి నైవేద్యం గా అన్నం సమర్పిస్తారు. ఆ నైవేద్యం ఆ తర్వాత భక్తు లకు ప్రసాదంగా పంచుతారు. ఈ ప్రసాదం తీసుకోవటం వల్ల ఏవిధమైన ఆరోగ్య సమస్యలు ఉండవని భక్తులు భావిస్తా రు. ఎవరైనా తమ 80వ, 90వ జన్మదిన వేడుక లను స్వామి సన్నిధిలో చేసుకుంటే ఎంతో పుణ్యమని నయ నార్, తిరుజ్ఞాన సంబంద నార్ ఈ ఆలయ చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు దీర్ఘాయుష్షుకు ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తమిళ మాసమైన చితిరాయ్ (ఏప్రిల్-మే)లో సూర్య కిరణాలు నేరుగా ఆల యంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి. సూర్యభగవానుడిని పరమేశ్వరు డు శాపం నుంచి ఇక్కడే విముక్తుడిని చేశాడు.
లలితాంబిక సన్నిధిలో లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని శుభాలు కలుగుతాయి. జీవితం లో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలిత పారాయణం చేయాలని ఎందరో భక్తులు తపిస్తారు.
ఉగ్రరూపిణి జగన్మాతశాంతమూర్తిగా మారిన క్షేత్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement