Friday, November 22, 2024

టీటీడీ పవిత్రత గాలికి

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో: టీటీడీ ధర్మకర్తల నిర్ణయాలు పవిత్రతను తగ్గించేలా.. వివాదాస్పదంగా ఉన్నాయని, పీఏసీ చైర్మన్‌ ఉర వకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపిం చారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టీటీడీ వ్యవహారంలో.. పాలకవర్గం చేసిన నిర్ణయాలను తప్పు పట్టారు. కేశవ్‌ మాటల్లోనే.. వైసిపి పాలకులు వచ్చిన ప్పటి నుంచి ఇలాంటి ధోరని కనిపిస్తోందన్నారు. దేశంలో టీటీడీ కి ప్రత్యేక స్థానం ఉందని, అయితే.తిరుమల ప్రాధాన్యత ను తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు.బోర్డ్‌ నిర్ణయాలు పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని,బోర్డ్‌ సమావేశం లో ధరలు పెంచిన విధానం స్వామిని సామాన్యుడికి దూరం చేయడమేనన్నారు. బోర్డులో ఉన్నవారంతా వ్యాపారులే అందుకే వ్యాపార ధోరణి కనిపిస్తోందని, పీఠాధి పతులు, తాత్త్విక వేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు ఉంటే ఇలాంటి ఆలోచన వచ్చేదా అన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని కోవిడ్‌ ఆంక్షలు తిరుమల వెళ్లే వారికి విధిం చారు. దీంతో సామాన్యులను దేవుడికి దూరం చేయడం కాదా అని ప్రశ్నించారు. రోజు పండుగ వాతావరణం లో జరిగే ఉత్సవాలను ఏకాంతం చేశారని, .కోవిడ్‌ తగ్గక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలన్నారు. .హిందుత్వ అని చెప్పుకునే పార్టీలు ఎందుకు ఊరికే ఉన్నారు.శ్రీశైలం, కాళహస్తి లో యథావిధిగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని,తీరు వీధుల్లో జరగాల్సిన ఉత్సవాలు ఏకాంతంగా చేస్తు న్నారని, మీరు చేపట్టిన పౌర్ణమి సేవ ప్రచారం కోసం బయట చేస్తున్నారని అన్నారు..మీరు ఏదేవుడినైన మొక్కండి మా దేవుడి ప్రాధాన్యం తగ్గించే కుట్రలు చేయొద్దని కోరారు. సమాన దర్శనం లేదు.. సమాన భోజనం పేరుతో హోటళ్లు మూసివేశారు. దీంతో తిరుమలకు వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు.ఒక్కసారి లక్ష మందికి భోజనం అంటే వచ్చిన నిధులు తిరుమల లొనే పె-్టట- కుట్ర అని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement