Friday, November 22, 2024

శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ

తిరుమల : తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి టిటిడి అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి అధికారులకు శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ శ్రీ మారిముత్తు, ప్రధానార్చకులు శ్రీ సుందరభట్టర్‌ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తమిళ కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆణివార ఆస్థానం సందర్భంగా ప్రతి ఏడాదీ శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి వై.స్వర్ణలత, శ్రీవారి ఆలయ పార్‌పత్తేదార్‌ శ్రీ పి.ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement