తిరుమల, ప్రభన్యూస్: తిరుమలలోని రావిచెట్టు సెంటర్‌లో ఉన్న పాత అన్నదానం కాంప్లెక్సు, చుట్టుపక్కల ఉన్న హోటళ్ళను టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. పాత అన్నదానం కాంప్లెక్సులో లగేజి కౌంటర్ నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. గతంలో ఈ భవనంలో అన్నదానం ఎలా చేసేవారని, భక్తులను ఏ మార్గంలోలోనికి అనుమ తించి ఏ మార్గంలో బయటకు పంపేవారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావిచెట్టు సర్కిల్లోని హోటళ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న భక్తులతో వసతి, సర్వదర్శనం ఎలా జరిగిందనే వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఛైర్మన్ దంపతు లు ధర్మగిరి వేద పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రమణ్య అవధానిని పరామర్శించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై శస్త్ర చికి త్స చేయించుకున్నారు. అంత కుముందు ఛైర్మన్ దంపతులు శ్రీభేడి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు.
తిరుమలలో ఆహారం విక్రయించరాదు: టీటీడీ ఛైర్మన్
తిరుమలలో ఎక్కడా ఆహారం విక్రయించకుండా, టీటీడీనే భక్తులం దరికీ ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తుందని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు గురువారం బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశామని అన్నారు. ఈ ఏర్పాట్ల కోసమే పాత అన్నదానం కాంప్లెక్సును పరిశీలించానని తెలిపారు. అధికారులతో చర్చించి ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పా శివసుబ్రమణ్య అవధాని కరోనా సమయంలో లోక కళ్యాణంకోసం తిరుమల నాదనీరాజన వేధికగా అనేక పారాయణాలు, ప్రవచనాలు చేశారని ఆయన తెలిపారు. అనారోగ్యానికి గురైన ఆయన్ను పరామర్శించినట్లు తెలిపారు.
పాత అన్నదానం కాంప్లెక్స, హోటల్స్ నిర్వహణపై టీటీడీ చైర్మన్ ఆరా
Advertisement
తాజా వార్తలు
Advertisement