Tuesday, November 26, 2024

పర్యావరణహిత క్షేత్రంగా టీటీడీ

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరిన తిరుమలను పర్యావరణహిత, ఇంధన సామర్థ్య యాత్రా స్థలంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, పర్యావరణ హిత ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు టీటీడీ ముందుకొచ్చింది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఆంధ్ర ప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) సహకారంతో ఈ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను టీటీడీ అమలు చేయనుంది. అలాగే టీటీడీ పరిథిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మిద్దెలపై 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు కేంద్రాలను న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, జాతీయ స్థాయి ఏజెన్సీల సహకారంతో ఏర్పాటు- చేయాలని యోచి స్తోంది. ఇంధన సామర్ధ్య కార్యక్రమాలలో భాగంగా తిరు మల, తిరుపతిలో ఎలక్ట్రిక్ర్‌ రవాణా సదుపాయాలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. టీటీడీ ఏటా 68 మిలి యన్‌ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్తు కాగా.. 70 శాతం (435 లక్షల యూనిట్లు-) కరెంటు-ను ఏపీఎస్పీడీసీఎల్‌ సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీ విద్యుత్‌ బిల్లులపై ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఇంధన సామర్ధ్య కార్యక్ర మాలు అమలు చేయడం ద్వారా విద్యుత్‌ బిల్లులతో కనీసం 10 శాతం ఆదా చేయాలని భావిస్తుంది. అనగా రూ 4 నుంచి రూ 5 కోట్లు- దశల వారీగా ఆదా చేయాలని టీటీడీ యోచి స్తోంది. దీనిలో భాగంగా పాత పంప్‌ సెట్ల స్థానంలో ఇంధన సామర్ధ్య పంపుసెట్లు-, 5 వేల సాధారణ ఫ్యాన్ల స్థానంలో సూపర్‌ ఎఫిషియంట్‌ బీఎల్డీసి (బ్రష్‌ లెస్‌ డైరెక్ట్‌ కరెంటు) ఫాన్స్‌ వంటి ఇంధన సామర్ధ్య ఉపకరణాలను అమర్చను న్నారు. ఇందుకోసం సుమారు రూ.1.35 కోట్లు- వ్యయం అవుతుందని,ఏడాదికి రూ. 62 లక్షల విలువైన 0.88 మిలి యన్‌ యూనిట్లు- విద్యుత్‌ ఆదా అయ్యే అవకాశముందని- భావిస్తున్నారు.
భక్తులకు అత్యుత్తమ సేవలు
జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు-2021 సందర్భంగా శుక్రవారం వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ కార్య నిర్వహక అధికారి కే జవహర్‌ రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి మరియు ఏపీ ఎస్‌ఈసీఎం అధికారులు దీనిపై చర్చించారు. అనంతరం జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ, భక్తులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. వీటితో పాటు- పర్యావరణ హిత ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, నీటి నిర్వహణ కూడా కీలకమని.. ఈ విషయంలో టీటీడీని ఇతర ఆలయాలతో పాటు- ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలని యోచిస్తున్నట్లు- వివరించారు.
చౌకగా నాణ్యమైన విద్యుత్‌:నాగులాపల్లి
వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన, నమ్మ కమైన చౌక విద్యుత్‌ కొనసాగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి చెప్పారు. అదే సమయంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమా లకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంధన సామర్ధ్య సాంకేతికతను పెంపొందించు కోవచ్చున న్నారు. తద్వారా ఇది ఇంధనంపై చేసే ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించడంతో పాటు, విద్యుత్‌ రంగ బలోపేతానికి కూడా దోహద పడుతుందన్నారు. రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి, ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement