Sunday, November 24, 2024

జీవిత సత్యం

అద్దె ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం ‘మా ఇల్లు’ అనే అంటాడు. తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇంటి యజమానితో కూడా అదే అంటాడు
‘ఏమండీ! రేపు మా ఇంటికి రండి…’ అని.
‘మా ఇల్లు’ అన్నాడని యజమాని గొడవపడడు. ఎందుకం టే వ్యవహారం కోసమే అలా అంటారని ఇరువురికీ తెలుసు.
అలాగే ఈ తనువు తనకు అద్దె ఇల్లు లాంటిది. వ్యవహార నిమిత్తం నా శరీరం, నా సంసారం, నా ప్రపంచం, నా దైవం అంటాడు. కానీ యజమాని భగవంతుడు. యజమాని భగవం తుడు అనేది జ్ఞప్తి కలిగి ఉన్నవాడు జ్ఞాని. మరచి ఉన్నవాడు- అజ్ఞాని. అద్దె ఇల్లు పెచ్చులూడితే అద్దెకున్నవాడు ఏమీ చింతిం చడు. ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటాడు. ఇక ఈ శరీ రౖం నిలబడని వ్యాధి వచ్చింది. వదిలేసి మరొక ఉపాధిని

వెతుక్కుంటాడు. అదే పునర్జన్మ.
ఇల్లు మారితే యజమాని మారతాడు. కానీ శరీరం మారితే యజమాని (భగవంతుడు) మారడు. సకల సృష్టికీ యజమాని ఆయనే. సృష్టి యావత్తు భగవంతునికి ఓ సంకల్పం అంతే. ఆ యన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ(లయం) చేసేస్తాడు. అనగా సం కల్ప రాహిత్యంగా ఉంటాడు. నీవు నిద్రలో ఉన్నట్టు. దేవుని సంకల్ప రాహత్యమే జీవునికి జన్మరాహిత్యము. కాబట్టి బంధ మైనా, మోక్షమైనా భగవంతుని సంకల్పమే. అందుకే అన్న మయ్య ఓ సంకీర్తనలో ఇలా అన్నారు-
”మదిలో చింతలు, మైలలుమణుగులు, వదలవు నీవవి వద్దనక”
భగవంతుడు ‘వద్దు’ అనుకుంటే ఉండవు. అంతేగానీ మనం వద్దు అనుకుంటే పోవు.
నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పంలో అంత ర్భాగమే కదా అంటావేమో! ఇక బాధేముంది?
నీ శరీరం భగవంతుని శరీరంలో (సృష్టిలో) అంతర్భాగం. నీ మనస్సు భగవంతుని మనస్సులో (మాయలో) అంతర్భా గం. జీవుని బంధ మోక్షములు దేవుని లీలావిలాసములు. శరీ రం ఉంటే ఉండనీ… ఊడితే ఊడనీ… బంధం ఉంటే ఉండనీ… మోక్షం వస్తే రానీ… ఏదైనా సరే ఉంటే ఏమి? లేకుంటే ఏమి? అని ఉండటం జ్ఞాని లక్షణం. జ్ఞాని లక్షణం కలగాలంటే మనం శ్రీ#హరిని నిత్యం స్మరణ చేయాలి. అప్పుడే మనం ముక్తికి అర్హత సాధిస్తాం.

  • డా. సిహెచ్‌.హరిబాబు 9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement