Wednesday, November 13, 2024

తృణావర్తుడు

ఒక రాక్షసుడు. ఒకనాడు యశోదాదేవి చిన్న కృష్ణుని తన తొడపై కూర్చుం డ బెట్టుకొని ముద్దాడి దేహాన్ని నిమురుతూ ఉండగా, బాలకృష్ణుడు బరువెక్కిపో యాడు. భూమిని ఉద్ధరించడానికి పుట్టిన మహాపురుషుడేమో అని అనుకొన్న ది. ఆ సమయంలో కంసుడు పంపిన తృణావర్తుడు అనే రాక్షసుడు భూమిమీద కు వచ్చి అకస్మాత్తుగా సుడిగాలియై బిసబిస అని శబ్దం చేస్తూ, అందరూ ఆశ్చర్య పడుచుండగా, కమ్ముకొని వీచి బాల కృష్ణుని ఎత్తుకొని పోయాడు. గోపకులంతా సుడిగాలికి రేగిన దుమ్ము కళ్ళనిండా క్రమ్ముకొనిపోగా గుండ్రంగా తిరుగుచూ క్రింద పడ్డారు. యశోద కలవరపడి కలత చెందింది.
గట్టిగా కేకవేసి ఓ! బిడ్డా! అని అన్నది. ఆవులాగా నేలపై పడింది. అలా బాలు ని పైకి ఎత్తుకొని పోయిన రాక్షసుడు ఆ బాలుని బరువు మోయలేక పోయాడు. బాలుడు తన రెండు చేతులతో తృణావర్తుని కుత్తుకనాళాన్ని బిగియపట్టాడు. కొండవలె వ్రేలాడాడు. పురభంజనుడైన శివుని బాణంతో కూలిపోయిన పురం వలె అవయవాలన్నీ విరిగి రాళ్ళమీద పడ్డాడు. అప్పుడు గోపకాంతలు జరిగిన దంతా చూచి, రాక్షసుని వక్షస్థలం మీద ఉల్లాసంగా బరువులేక వ్రేలాడుచున్న బాలకృష్ణుని ఎత్తుకొని వచ్చి ఏడుస్తున్న యశోదాదేవికి ఇచ్చారు. ఇతడు సుడి గాలి రాక్షసుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement