ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులను శరన్నవ రాత్రులు లేక దేవీ నవరాత్రులు లేక దుర్గా నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులలో త్రిమూర్తుల భార్యలైన దుర్గ, లక్ష్మి, సరస్వతులను త్రిశక్తులుగా ఆరాధిస్తాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి ప్రతీకలైన వీరు ముగ్గురూ శుంభ, నిశుంభర, ధూమ్రాక్ష, మధుకైటభ, రక్తాశు, జిహ్వాది, రక్తసిక్త, మాయా, బల అనే తొమ్మిది మందిని సంహరి స్తారు. ‘దేవి’ అనగా త్రిపుర సుందరి. ఆది పరాశక్తి . దేవి అంశములే దుర్గ, లక్ష్మి, సరస్వ తులు. చివరి రోజు మహా త్రిపుర సుందరి మహషాసురుని సంహ రిస్తుంది. అదే విజయ దశమి.
చీకటి అజ్ఞానముకు చిహ్నం. మానవత్వంలో ప్రవేశించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము, మనస్సు, చిత్తము, అహంకారమనే చీకట్లను పారద్రోలి, జ్ఞాన ప్రకాశము ను అనుభవించు నిమిత్తమై చేసే ఆరాధనా ఉత్సవమే నవరా త్రులు. నవరాత్రులకు సంబంధించి ఓ పురాణ గాథ ఉంది. మ#హషాసురుని ప్రోత్సాహంతో పైన చెప్పిన తొమ్మిది మంది రాక్షసులు బ్ర#హ్మను గురించి కఠిన తపస్సు చేసి అనేక వరాలు పొందుతారు. దానితో అహంకారం పెరిగిపోయిన ఆ తొమ్మిది మంది రాక్షసులు ముల్లోకాలను భయభ్రాంతులను చేస్తారు. ఒక్క స్త్రీ వలన తప్ప, యితరుల వలన మరణం సంభవించ కుండా ఉండటం రాక్షసులు పొందిన వరాల్లో ఒకటి. స్త్రీ అయితే అబల కాబట్టి ఆమె వలన తమకు హాని ఉండదనే ధీమా రాక్షసులది. ముల్లోకవాసుల ప్రార్ధనలు మన్నించి, రాక్ష సులకు బ్రహ్మ యిచ్చిన వరాలను దృష్టిలో ఉంచుకుని త్రిమూ ర్తులు తమ శక్తులు అన్నింటినీ సమన్వయం చేసి దేవికి ప్రసా దిస్తారు. తమ ఆయుధాలను కూడా దేవికి ఇచ్చారు. ఇదీ ఆ పురాణ కథ.
తొమ్మిది రకాలైన దుష్ట ప్రవృత్తులు ప్రవేశించునపుడు, మానవుని హృదయంలో నిరంతరం రాజసిక, తామసిక ప్రవృ త్తులు విలయ తాండవం చేస్తాయి. తొమ్మిది విధాలైన దుష్ట ప్రవృత్తులు తొమ్మిది మంది రాక్షసులకు ప్రతీకలు. అప్పుడు ఆత్మ చైత న్యం మానవునికి, అతనిలోని ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులను ప్రోది చేసి దుష్టప్రవృత్తులను అణచివేసే శక్తిని అంది స్తుంది అనేదే నవరాత్రుల అంతరార్ధమని పెద్దలు చెబుతారు.
వేదాల ప్రకారం దుర్గాదేవి శక్తికి ప్రతీక. దుర్గాదేవి ఈ నవ రాత్రులలో తొమ్మిది వేర్వేరు రూపాల్లో అలంకరింపబడి పూజింప బడుతుంది. అందుచేత నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలు కష్టాలను నివృత్తి చేస్తాయి అనేది విశ్వాసం.
అమ్మవారి ఆలయాల్లో ఒక్కో ఆలయంలో ఒకో పద్ధతిలో (ఒక్కో రకమైన రూపాలంకరణలో) అమ్మవారిని రోజుకో రూ పంలో అలంకరించి అర్చిస్తారు.
విజయవాడలోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని మొదటిరోజు పాడ్యమి నాడు, స్వర్ణ కవచాలంకృత కనక దుర్గగా, రెండోరోజు బాలాత్రిపుర సుందరిగా, మూడోరోజు గాయత్రీ దేవిగా, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా, అయిద వ రోజు లలితాత్రిపుర సుందరిగా,, ఆరవరోజు మహాలక్ష్మిగా, ఏడవ రోజు మహా సరస్వతీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గా దేవిగా, తొమ్మిదవ రోజు మహషాసుర మర్దినిగా రోజుకో రూ పంలో అలంకరించి అర్చిస్తారు. దశమినాడు రాజరాజేశ్వరిగా పూజించి అర్చిస్తారు.
శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో, అమ్మ వారిని నవదుర్గలుగా తొమ్మిది రోజులు పూజిస్తారు. మొదటి రోజు శైల పుత్రి: (హమాలయాల కుమార్తె. ప్రేరణ యొక్క దేవత). రెండవ రోజు: బ్రహ్మచారిణి (తపస్సు చేస్తూ బ్ర#హ్మచర్య స్థితి. పవిత్ర అధ్యయన దేవత). మూడవ రోజు: చంద్రఘంట (చంద్రుణ్ణి హారంలో ధరించిన, సాధన యొక్క లేక ఆనందం యొక్క దేవత). నాలుగవ రోజు: కూష్మాండ (కాఠిన్యాన్ని శుద్ధి చేసే దేవత). ఐదవ రోజు: స్కందమాత (స్కంధుని తల్లి. దైవ త్వాన్ని పెంపొందించే దేవత).
ఆరవరోజు: కాత్యాయని (దేవతలకు సహాయం చేయడానికి అవతరించిన ఋషి కాత్యాయనుని కుమార్తె. సదా పవిత్రతను ఇచ్చే పవిత్ర దేవత). ఏడవ రోజు: కాళరాత్రిగా (అహంకారాన్ని అధిగమించే… రాత్రి దేవత). ఎనిమిదవ రోజు: మహాగౌరి (శివుని భార్య. గొప్ప ప్రకాశ వంతమైన దేవత).
తొమ్మిదవ రోజు: సిద్ధిధాత్రి (సిద్ధి ప్రదాత. ఆధ్యాత్మిక శక్తు లను యిచ్చే దేవత. పరిపూర్ణతను ప్రసాదించే దేవత). ఇలా తొమ్మిది దేవతా రూపాలలో అమ్మవారిని అలంకరించి అర్చి స్తారు. ఈ అమ్మవారి పేర్లన్నీ పరమాత్మ ఆత్మచే వెల్లడించ బడ్డాయనేది విశ్వాసం. విజయదశమినాడు శ్రీ భ్రమరాం బికా దేవిగా ఆరాధిస్తారు.
ఈ నవరాత్రులలో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు పూజలుచేసి, సాయంకాలం ముత్తైదువులకు తాంబూలాలతో పేరంటాలిస్తారు. ఆశీస్సులు తీసుకుంటారు. తొమ్మిది మెట్ల వరుసలలో బొమ్మల కొలువును ఏర్పాటు చేయటం ప్రశస్తమని పెద్దలు చెబుతారు. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు పిల్లలలో సృజనాత్మకతకు దోహదం చేస్తుంది. ఆధ్యా త్మికత, సామాజిక తత్త్వాలను పరోక్షంగా పాదుకొలుపుతుంది.
విశిష్టతలు, విశేషాలు, సంప్రదాయకత, ఆధ్యాత్మిక నేప ధ్యం, సందడీ సమారో#హం మిళితమైన దేవీ నవరాత్రులు హందువులందరికీ ప్రశస్తమైన పర్వదినాలు.
– రమాప్రసాద్ ఆదిభట్ల, 93480 0666
త్రిశక్తుల ఆరాధనోత్సవమే నవరాత్రులు
Advertisement
తాజా వార్తలు
Advertisement