Friday, November 22, 2024

త్రిమూర్త్యాత్మకం సూర్యాంజనేయుల బంధం!

ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు- ఆంజనేయస్వామిలది గురుశిష్యుల సంబంధం. వాల్మీకి రామాయణం, ఇతర పురా ణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవి వరంగా తెలియజేశాయి. హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు.

బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం

#హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉద య భానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్య బింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశా నికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయ త్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమ య్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

సూర్యుని శిష్యరికం

బాల్యంలోనేగాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమం తుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూ ర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యను అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమం తునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి అంగీకరిం చాడు సూర్యుడు. #హనుమంతుడు సూర్యుని వద్ద విద్యను అభ్య సించిన విధానాన్ని ఒక్కొక్క పురాణం ఒక్కొక్క విధంగా చెబు తున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉం చి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేద వేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షాడెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యా భ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జైజ్జ్వల్యమా నంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమాగమంలోనే తన సంభాషణా చాతు ర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని విన యంతోను, సింహకను శక్తితోను, సురసను యుక్తితోను జయిం చగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
సూర్యుపుత్రునితో స్నేహం

- Advertisement -

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్య పుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహా యాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్య పుత్రుడైన సుగ్రీవునికి, సూర్య వంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే.
సూర్యుని మనుమడు: కొన్ని పురాణాల ప్రకారం హను మంతుని తల్లి అంజనాదేవి సూర్యసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కను క సూర్యుడు హనుమంతుడికి తాత.
సూర్యుని అల్లుడు: వాల్మీకి రామాయణంలోహనుమం తుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనే యుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చలాదేవి జన్మించింది.
సూర్యవంశీయుని భక్తుడు: హనుమంతుని ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహద్భాగ్యం #హను మంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడా నికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయ మైనా నాటినుండి #హనుమంతుడు రాముని సేవకే అంకి తమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కని పెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడ య్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపా డాడు. సీతారాములను #హృ దయంలో నిలుపుకోవడం #హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు #హను మంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
త్రిమూర్తుల శక్తి

సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహా విష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూ తుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివ కేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్య బ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకమైనట్టే. సూర్యుని కూడా త్రిమూర్తుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయు లను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణిం చవచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మ కంగా విస్తరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement