Friday, November 22, 2024

త్రిగుణైక శక్తిదాయిని… త్రిపుర సుందరీ!

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే ఆశ్వీయుజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు, తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే ”శరన్నవ రాత్రులు” లేదా ”దేవి నవరాత్రులు” అంటారు.
శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్షఋతువు వెళ్ళి, శరదృతువు ప్రారంభం అవుతుంది. ఈ ఋతువులో చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అం దుకే ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మ కం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో దర్శనమిచ్చే పరాశక్తిని ధ్యానించి పూజిస్తే, సర్వకార్య విజయం సంప్రాప్తిస్తుందనేది కృతి వాక్యం.
నవరాత్రుల రెండవ రోజున బ్ర#హ్మచారిణి తల్లిని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి బెల్లం, పంచదార, పంచామృతాన్ని సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ తల్లి ఆయురారో గ్యాలతో పాటు మీ కోరికలు తీరుస్తుంది. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్ర#హ్మచారిణి. ఆమెకే కన్యాకు మారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తా యి. అమ్మవారు స్వేత వర్ణ దుస్తులను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. బ్ర#హ్మచర్య దీక్షలో అమ్మవారు ఉంటారు. వారణాసిలో మాత్రమే నవదుర్గలకు వేర్వేరుగా దేవాలయాలు ఉంటాయి. వారణాసిలోనే ఈ అమ్మవారి దేవాలయం కూడా ఉంది.
సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్‌|
అతో#హం విశ్వరూపాం, తం నమామి పరమేశ్వరీమ్‌||
నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీ పురాణం చెబుతోంది. ఆ తొమ్మిది శక్తులలో రెండవది బాలా త్రిపుర సుందరీ దేవి (కౌమారీ). ఈ రోజు చిన్నారులకు బాలాత్రిపుర సుందరి అలంకారం చేసి కౌమారీ పూజ చేస్తారు. ఎందుకంటే…అమ్మవారు మూడు రూపాల్లో కనిపిస్తుంది. 1. కుమారిగా బాలత్రిపుర సుందరి, 2. యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి 3. వృద్ధరూ పం త్రిపుర భైరవి. బాలాత్రిపుర సుందరీదేవిది త్రిగుణౖక శక్తి- సరస్వతి విజ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని. నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు, బుద్ధి, అ#హం కారం ఈతల్లి అధీనంలో ఉంటాయి. అభయ#హస్తం, అక్ష మాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుందని విశ్వాసం, షోడశీ విద్యకు ఈమే అధిష్టాన దేవత కాబట్టి ఉపాస కులు త్రిపుర సుందరి దేవి అనుగ్ర#హం కోసం బాలర్చన చేస్తా రు. శ్రీచక్రంలో మొదటి దేవత బాల అందుకే సత్సంతానాన్ని అందించే తల్లి గా బాలా త్రిపురసుందరీ దేవి భక్తుల పూజలందుకుంటుంది. త్రిమూర్తులైన బ్ర#హ్మ, విష్ణు, మ##హశ్వరులను ఆవ#హంచి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని ‘త్రిపురతాపినీ ఉపనిషత్తు’ చెబుతోంది.
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం

బ్రహ్మాండ పురాణం, లలితా స#హస్రంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఇలా పేర్కొన్నాయి. భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళంతా అవిద్యా వృత్తు లకు సంకేతం. వీళ్లంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో #హంసలు లాగే రథంపై వచ్చిన కన్య ఈ 30 మంది భండాసుర పుత్రులను సం#హరించింది. కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సం#హరించిందట. బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదం టూ అప్పటి నుంచీ బాల ఆరాధన చేయడం ప్రారంభించారు. #హంసలు శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ #హంసగా పోలుస్తారు. అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు. ఈ రోజు అమ్మవారు గులాబీరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవా రికి ఈ రోజు నైవేద్యం కట్టెపొంగలి.
బాలత్రిపురసుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపో తుందని. విశ్వాసం. బాలా శబ్దానికి అన్నెము, పున్నెము ఎరుగని బాలిక అని అర్థం. చిన్న పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అటువంటి #హృదయాలలో పరమాత్మిక నివసిస్తుం ది. అలాగే బాలా శబ్దానికి జ్ఞానం అని అర్ధం కూడా ఉంది. బాలాస్వరూపమైన అమ్మవారిని పూజిస్తే జ్ఞానానందంతో ఆత్మానం దా న్ని పొందగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement