Sunday, November 17, 2024

త్రికరణశుద్ధితో త్రిగుణాతీతం

అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ. ప్రతి జీవి పుట్టుక వెనుక ఓ పరమార్థం వుంటుంది. దాన్ని సాకారం చేయాలన్నా, జన్మను సార్థకం చేసుకోవాలన్నా, ఈ భూమిపై నడయాడినంత కాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలన్నా ప్రతి వ్యక్తి త్రిగుణాలు అయిన సత్త్వ, రజో, తవెూగుణాలలో రజో, తవెూ గుణాలు రెండింటిని విసర్జించాలి. అంటే వాటిని జయించగలగాలి. సహజసిద్ధంగా మనిషిలో వాటిని జయించగలిగే శక్తి నిక్షిప్తమై వుంటుంది. దాని ద్వారా త్రికరణ శుద్ధితో ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు త్ర్రిగుణాల తత్త్వ రహస్యాన్ని వివరించారు.

ఈసృష్టి ప్రహేళికలో జీవుడు త్రిగుణాల నుండి తప్పించుకోలేడు. సత్త్వ, రజో, తమోగుణాల కలయిక ప్రతి జీవిలోనూ నిక్షిప్తమై ఉంటాయి. అయితే మానవుడు మాత్రం వీటిని జయించగలిగే శక్తిని కలిగి ఉన్నాడు. త్రికరణ శుద్ధితో ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పరాత్పరుని ఏకత్వ తత్త్వాన్ని తెలుసుకుం టారో వారు త్రిగుణాతీతులవుతారు. మనస్సు, వాక్కు, కర్మ ఇవి త్రికరణాలు. ఈ మూడూ ఏకత్వ భావనను చేరుకోవడాన్నే త్రికరణశుద్ధి అన్నారు. మనసులో జనించిన సత్యమే మాట ద్వారా వ్యక్తమై తుదకు అదే సత్యాన్ని కర్మ ద్వారా వ్యక్తప రచడం. త్రికరణశుద్ధి సత్త్వగుణ సాధనకు మొదటి సోపానం.
లీలా మానుష అవతార రూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు త్రిగు ణాల తత్త్వ రహస్యాన్ని ఉద్ధవగీతలో వివరించారు. మనుష్యుడు త్రిగుణాతీత జ్ఞానాన్ని పొందాలంటే సత్త్వగుణ ప్రధానుడుగా నిలవాలి. సత్త్వగుణ ప్రధానులు తేజస్సుతో వెలుగొందుతారు. శాంత స్వభావులుగా ఇతరులకు శాంతిని చేకూ ర్చుతారు. వారిలో రజో, తమోగుణాలు పరాజయం పొంది ఉంటాయి. వారిలో ధర్మజ్ఞానం పెల్లుబుకుతూ ఉంటుంది. వారి చిత్తము ప్రశాంతముగా ఉంటుంది. వారు నిర్భయులై ఉంటారు. వారు నిరాసక్తులై ఉంటారు.
సత్త్వగుణం ప్రధానమయితే దేవతాబలం పెరుగుతుంది. వారు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తారు. వారు ఎల్లప్పుడూ జాగరూకులై మార్గదర్శనం చేస్తారు. ప్రధానంగా సత్త్వగుణ సంపన్నులు బ్రహ్మజ్ఞానులై ఉంటారు. త్రికరణశుద్ధితో ఉత్తమ లోకాలు పొందుతారు. బ్రహ్మజ్ఞానులు శుద్ధమైన ఆత్మజ్ఞానాన్ని పొంది సత్యలోకానుగతికి అర్హత పొందుతారు. సత్త్వగుణ స్వభావులు అనాసక్త కర్మలను ఆచరిస్తారు. వారు సదా సృష్టి కర్తను స్మరించుచూ కర్మలను సంపూర్ణం చేస్తారు. వారి లౌకిక జీవనం చాలా పవిత్రంగాను, ఆనందదాయకంగాను ఉంటుంది. అనాయాసమైన శుచికర ఆహారాన్ని దైవారాధన చేసి, సమర్పించి భుజిస్తారు. అందువలననే వారు సదా ఆత్మచింతన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ సుఖంగా, ఆనందంగా దైవంలో రమిస్తారు. సత్త్వగుణ వృత్తులు శమం, దమం, తితిక్ష, వివే కం, తపస్సు, సత్యం, దయ, స్మృతి, ఆనందం, త్యాగం, విషయాతీతం, శ్రద్ధ, లజ్జ, ఆత్మచింతన, దానం, వినయం, సరళత. స్త్రీ పురుషులు నిష్కామభావంతో నిత్యనై మిత్తిక కర్మల ద్వారా దైవారాధన చేస్తే వారు సత్త్వగుణ ప్రధానులవుతారు.
ఇక రజోగుణం కలవారు భేద బుద్ధితో ఉంటారు. వీరు అన్నిటియందు ఆసక్తి కలిగి ఉంటారు. ఫలితాన్ని ఆశిస్తారు. వీరు దు:ఖాలు, కీర్తి, సంపదలు కలిగి ఉంటా రు. రజోగుణం సత్త్వగుణాన్ని అణచి వేస్తుంది. చంచల స్వభావం, జ్ఞానేంద్రియా లు మరియు కర్మేంద్రియాలు అసంతృప్తితో వికారం పొందడం, మనోభ్రాంతి, అస్వస్థత, అనారోగ్యం రజోగుణం వలన కల్గుతాయి. అసుర బలం పెరిగి వివాదా ల పాలవుతారు. రజోగుణ ప్రభావులు స్వప్నావస్థలో ఉండి వాస్తవానికి దూరమ వుతారు. రజోగుణం మానవ జన్మను మరల, మరల ఎత్తడానికి కారణమవుతుం ది. రజోగుణ ప్రభావంలో మృతి చెందితే మనుష్య లోకం లభిస్తుంది. వీరికి కోరిక లు ఎక్కువ. ఆత్మను కర్తగా, భోక్తగా విభజిస్తారు. గృహస్థాశ్రమాన్ని కలిగి ఉంటా రు. మమతానురాగాలకు బద్ధులై ఉంటారు. విషయాసక్తి కలిగి కర్మాను రక్తులై ఉం టారు. రుచికరమైన ఆహారాన్ని భుజిస్తారు. రకరకాల పానీయాలు సేవిస్తారు. ర జోగుణ వృత్తులు కోరిక, నిత్య ప్రయత్నం, గర్వం, దు:ఖం, కఠినత్వం, యాచన, భేద బుద్ధి, యుద్ధ ఉత్సాహం, కీర్తి కాంక్ష, హాస్యం, పరాక్రమం, కఠోర శ్రమ.
ఇక తమోగుణం ప్రభావులు నరకాన్ని పొందుతారు. వీరు అజ్ఞానం, సోమరి తనం, మూర్ఖత్వం, దురాశ, శోకం, మోహం, హింస, నిద్ర కలిగి ఉంటారు. జ్ఞానేం ద్రియాలు మరియు కర్మేంద్రియాలు కూడి అసమర్థులు, బుద్ధి మందగించి, చిత్త భ్రాంతికి గురయి మనసు శూన్యమయి వివాదాస్పదుడుగా మారడం తమోగు ణానికి పరాకాష్ట. అపుడు వీరిలో రాక్షసబలం పెరుగుతుంది. తద్వారా మోహం ఆవేశిస్తుంది. తమోగుణ ప్రధానులు అధోగతి పొందుతారు. వృక్షాలుగా, హీన జంతువులుగా అనగా అధోయోనులందు జన్మలెత్తుతారు. వీరు నరకాన్ని చూస్తా రు. వీరి కర్మలు హింసాత్మకంగా ఉంటాయి. వీరు నిత్య సురాపానలోలులై ఇతరుల ను వంచిస్తూ ఉంటారు. అధర్మ కార్యాల పట్ల, సృష్టికి విఘాతం కలిగించడం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. అపవిత్రమైన, అసాధారణమైన దు:ఖాన్ని కలిగించే ఆహారా న్ని భుజిస్తారు. తమోగుణ వృత్తి, క్రోధం, లోభం, అసత్యం, హింస, భిక్షాటన, వితండవాదం, శ్రమ, విరోధం, శోకం, మోహం, విషాదం, దీనత్వం, అతినిద్ర, దురాశ, భయం, సోమరితనం.
శుద్ధమైన ఆత్మజ్ఞాని సాత్త్వికుడు. ఇక జీవులకు కలిగే జన్మలు వారి వారి గుణ కర్మలననుసరించి ప్రాప్తిస్తుంటాయి. మానవజన్మ కలగడం అత్యంత దుర్లభం. కనుక వివేకం కలిగినవాడు గుణాతీతుడై నన్ను ఆశ్రయించడం జరుగుతుంది. సత్త్వగుణ ప్రధానుడై రజో,తమో గుణాలను జయించాలి. తుదకు నిరపేక్ష, నిష్కా మం ద్వారా సత్త్వగుణాన్ని కూడా జయించాలి. ఈ విధంగా ఎవరైతే త్రిగుణాతీ తుడై త్రికరణ శుద్ధితో నన్నే ఆశ్రయిస్తాడో అపుడు ఆ జీవులను నా థామంలో ఐక్యం చేస్తాను. ఆ జీవి ఆత్మ పరమాత్మ అంటే నాలో లీనం అవుతుంది. సంసార చక్ర భ్రమ ణము నుండి విముక్తి లభిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుని గీతోపదేశం చేసా డు. మరి కలి ప్రభావం నుండి తప్పుకోవాలంటే త్రికరణ శుద్ధితో మొదట సత్త్వగు ణ ప్రధానులవడానికి సాధన మొదలు పెట్టడం వివేకం కదా!

  • వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు, 8074666269
Advertisement

తాజా వార్తలు

Advertisement