Friday, November 22, 2024

త్రిభువన భూతికరీ ప్రణమామ్యహం!

ధనం మూలం ఇదం జగత్‌ అన్నది నానుడి. చేతి నిండా డబ్బు వుంటే అనుకున్న ది సాధించడానికి ఉపయుక్తంగా వుంటుంది. కానీ ఆ మహాలక్ష్మి కటాక్షం అందరికీ లభించదు. కష్టపడి పనిచేసే వారికి ఆ అదృష్టం సైతం కలిసి వస్తుం ది. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం మరొక ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతున్నది. ప్రతి పనికీ ఒక అధి దేవత ఉన్నాడని చెబుతూ వుంది. వారిని కొలిస్తే మన కోర్కెలు తీరుతాయని చెప్పబడింది. ధనానికి ప్రతిరూపంగా లక్ష్మీదేవిని చూడటం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటే అన్ని ఆర్థిక సమస్యలూ తీరి, మనుష్యులు మనశ్శాంతితో ప్రశాంత జీవనం గడుపగలుగు తారు. ధనవంతుడే బలవంతుడు, ధనవంతుడే గుణవంతుడు. ఆర్థికంగా ఎదగాల నే ఆస్తికులకు తాము చేస్తున్న కృషి ఫలించాలంటే దైవ అనుగ్రహం వుంటే తిరుగుండ దని నమ్ముతారు. ఎవ్వరు ఏ రంగంలో వున్నా వారందరి అభివృద్ధికి తోడ్పడే విధం గా పరమాచార్య జగద్గురు శ్రీశంకరాచార్యుల వారు ఈ జగత్తుకు అందించిన పర మాద్భుత శ్లోకాలు ‘కనకధారాస్తోత్రం’గా మనకు లభించాయి.
ఈ స్తోత్రం ఉద్భవించడానికి ఒక సంఘటన కారణమైంది. కేవలం రెండు మూ డు సార్లు పఠిస్తే చాలు నిరుపేదలను సైతం కుబేరునితో సమానంగా చేయగలదని చె ప్పిన స్తోత్రం ‘కనకధారా స్తోత్రం’. జగద్గురు ఈ స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారు. నిత్యం పారాయణం గావించితే పేదరికం దరిదాపులకు కూడా రాదన్నారు. శ్రీ ఆదిశంకరుల వారు ఒకనాడు బిక్ష కోసం ఒక ఇంటి ముందు ఆగారు. ‘భవతీ బిక్షాందేహి’ అంటూ కేక వేశారు. ఆ ఇంట్లో ఒక పేద బ్రాహ్మణ మహిళ వుంది. ఆమె ఈ కేక విని కలవరప డింది. ఆమె ఇంట్లో ఇవ్వడానికి ఏమీలేదు. సర్వసంగ పరిత్యాగియైన జగద్గురువు ఆది శంకరులవారే ఇంటి ముందు బిక్షకు వస్తే ఏమి చేయాలో ఆమెకు తోచలేదు. చివ రకు ఇంట్లో వున్న ఒక ఉసిరికాయ సమర్పించుకుని తన ధైన్య స్థితిని వివరించి, ఆపై న విలపించింది. ఆమె నిష్కల్మష హృదయాన్ని భక్తి భావాన్నీ దర్శించిన శంకరులవా రు చలించారు. ఆయన హృదయం ద్రవించింది. తక్షణం లక్ష్మీదేవిని ప్రసన్నం గావిం చుకోడానికి ఒక స్తోత్రం చేశారు. ఏముందీ? వెంటనే కనకధార కురిసింది. పేదరాలి ఆనందానికి హద్దుల్లేవు. ఆమె దశ తిరిగింది. జీవన దశే మారిపోయింది. ధనానికి మూలం లక్ష్మీదేవి అయితే, ధనమంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు. ధైర్యం, శౌర్య, విద్య, వివేకం అన్నీ ధనమే.
లక్ష్మీ దేవికి వెలుగంటే చాలా మహాఇష్టం. అందుకే దీపాన్ని లక్ష్మీదేవికీ, జ్ఞానాని కీ చిహ్నంగా చెబుతారు. అంతేకాదు అమ్మవారు ఎల్లప్పుడూ ఆదిశేషువుపై పవళిం చిన శ్రీ మహావిష్ణువు పాదాల చెంత కొలువు తీరి వుంటుంది. లక్ష్మీదేవిని ఆదర్శవంత మైన, వినయ విధేయతలు కలిగిన హైందవ స్త్రీకి నిదర్శనంగా చెబుతారు. ఈమె ఎం త శక్తిమంతురాలైనా విష్ణుమూర్తి పట్ల భయభక్తులతో మెలగుతుంది. బహుశా అందు కేనేమో శ్రీహరి తన అవతారాలన్నిటిలోనూ వెంటబెట్టుకునే వున్నాడు. రాముడికి సీతగా, కృష్ణుడికి రుక్మిణిగా సకల వేళలా అంటిపెట్టుకునే వుంది. ఆయనను అనుసరి స్తూనే వుంది. విశేషమేమంటే, శ్రీహరి సేవలే తన లక్ష్యంగా పెట్టుకున్నా కూడా, మహా లక్ష్మి దేవీ స్వతంత్రంగా పూజలు అందుకుంటూనే వుంది. సకల మానవాళికీ ఆరాధ్య దేవతగా నీరాజనాలు అందుకుంటున్నది.
లక్ష్మీదేవి పాలకడలి నుంచి కాంతులు వెదజల్లుతూ వెలికి వచ్చినప్పుడు ఆమె చేతిలో వికసించిన పద్మం వుంది. లక్ష్మీదేవి దివ్యమాల్యాలు, దివ్యాంబరాలు ధరించి భూషణ భూషితురాలై సకల దేవతలు చూస్తుండగా శ్రీహరి వక్ష స్థలం చేరగా, దేవతాదులందరూ అమ్మవారిని స్తుతించారు.
”నమస్తే సర్వలోకానాం జననీమబ్జ సంభవామ్‌
శ్రీయమున్నిద పద్మాక్ష్మీం విష్ణువక్ష: స్థల స్థితామ్‌”
లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ప్రత్యక్షమై వరం కోరుకోమంది. ఇంద్రుడు వెంటనే ఈ స్తోత్రాన్ని పఠించిన వారిని విడువవద్దని కోరాడు. కరుణాంతరంగి తల్లి అందుకు అంగీకరించింది. ఈ స్తోత్రం చదివిన వారు శ్రీమంతులవుతారని విష్ణుపురాణం ఈ విశేషాలను అందించింది మానవాళికి.
లక్ష్మీదేవి అదృష్టానికీ, శుభానికీ సూచికగా చెబుతారు. అమ్మవారి కటాక్షం లభి స్తుందనే ఆశతోనే మనం పిల్లలకు లక్ష్మి అనే పేరు పెట్టుకుంటాము. ఆ కుటుంబంపై విశ్వాన్నంతటినీ రక్షించే మన తల్లి మహాలక్ష్మి సుఖసంపదలు కురిపిస్తుందని విశ్వసిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement