Saturday, November 23, 2024

త్రిభంగి స్వామి చందనోత్సవం!

ఎటు చూసినా సంపెంగలు, పనస ఫలాల పరిమళాలు విర జిమ్మే సుందర, సుమధుర ప్రకృతి రమణీయతతో విరాజిల్లే శ్రీ వైష్ణవ క్షేత్రం సింహాచలం. నర, వరాహ, సింహ అవతా రాల కలయికతో త్రిభంగి మూర్తిగా సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే ఆప్పన్నగా వెలసిన దివ్యధామం సింహగిరి. నిత్యం చందన అలంకారంతో లింగాకృతిలో భక్తులను అనుగ్రహస్తున్న స్వామి తన నిజరూపంలో, అదీ సంవత్సరంలో కొన్ని గంట లపాటు దర్శనం ఇచ్చే పవిత్రమైన రోజు నేడు.
#హరణ్యకశిపుడి వధ అనంతరం ప్రహ్లాదుని కోరికపై మానవ దేహం, వర#హ వదనం, సింహ వాలంతో సింహ గిరిపై దర్శనం ఇచ్చిన స్వామి వారికి ప్రహ్లాదుడు ఆలయాన్ని నిర్మించి ఆరాధించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కాలక్రమంలో స్వామికి ఆరాధన కార్యక్రమాలు నిలచిపోవ టంతో స్వామి వారిని ఆపాదమస్తకం భూదేవి వ్యాపించి తన లో పదిలంగా కాపాడుకుంది.
అనంతర కాలంలో ఒకనాడు చంద్రవంశ చక్రవర్తి పురూరవుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా వరాహ నృసింహ స్వామి ఉన్న ప్రదేశం వచ్చేసరికి ఆ విమానం కద లిక ఆగిపోయింది. కారణం తెలియక భూమిపై దిగి కార ణ మేమిటా అని ఆవేదన చెందుతుండగా, అశరీరవాణి, ”శ్రీ నరసింహస్వామి వారి మూర్తి వాల్మీకంలో ఉందని, దానిని వెలికితీసి దేవాలయాన్ని నిర్మించవలసింది”గా సూచించ గా, వెంటనే పురూరవుడు అశరీరవాణి ఆదేశానుసారం ఆ ప్రాంతంలో వెదకులాడగా, పెద్ద పుట్టలో ఉన్న స్వామివారి విగ్ర#హం కనిపించింది. ఆయన భక్తిప్రపత్తులతో అశరీరవా ణి పలుకులను ఆచరించి పుట్టమన్ను తొలగించడం ప్రారం భించగానే, మళ్ళీ అశరీరవాణి, స్వామి వారి మీద ఉన్న పుట్ట మన్ను ఎన్ని మణుగుల బరువో అంతే పరిమాణంలో స్వా మికి చందనం పూత పూసి అర్చించవలసిందిగా సూచించిం ది. పూరూరవ చక్రవర్తి అశరీరవాణి ఆజ్ఞను పాటించాడు. పురూరవ చక్రవర్తికి దర్శన భాగ్యం కలిగిన రోజు మాత్రమే భక్తులకు స్వామి నిజరూప దర్శనం ఉంటుంది అని పేర్కొ న్నది. పురూరవ చక్రవర్తి అశరీర వాణి ఆనతికి లో బడి చందన సేవ జరిపారు. నాటి నించి నేటివరకు ప్రతి సంవత్స రం వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు మాత్రమే స్వామి వారు కొన్ని గంటల పాటు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలి గిస్తున్నారు. వరాహ వదనం, మానవ శరీరం, సింహావలం తో త్రిభంగి రూపంలో సుమారు రెండున్నర అడుగుల ఎత్తు లోఉండే స్వామి వారికి ఇరువైపుల పద్మాలను ధరించిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు మనల్ని అనుగ్రహస్తూ ఉంటా రు. భగవద్రామానుజుల వారి ఆరాధనలు అందుకొన్న ఆ దేవదేవుని ఆలయ వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. సింహాచల దేవస్థానంలో గర్భ గృ#హం, ముఖ మండపం, ఆస్థాన మండపం, తిరుచూత్తుమాల (జల మండపం) మం డపం, కల్యాణ మండపం ఉన్నాయి.
చందనోత్సవానికి వారం రోజులు ముందు నుంచే ప్రత్యేక జప, హోమ, పూజలతో చందనం అరగదీసే ప్ర క్రియ బేడి మండపంలో ప్రారంభిస్తారు. ఆ చందనం లో 60 రకాల వనమూలికలు, సుగం ధ ద్రవ్యాలు కలుపుతారు. ఈరోజు స్వామి నిజ రూపాన్ని లక్ష లాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరి గి సాయంత్రం ఆరాధన అనంతరం చందన యాత్రలోనే అపురూపమైన ఘట్టం మొద లవుతుంది. అదే సహస్ర ఘటాభిషేకం. దేశం నలుమూలల నించి వచ్చిన శ్రీ వైష్ణ వ స్వాములు సంప్రదాయంగా శ్రీ సూక్త, పురుష సూక్త, విష్ణు సహస్రనామాలు పఠి స్తూ గంగాధర నుంచీ ఘటాలతో తెచ్చిన జలాలతోస్వామికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందన సమ ర్పణ చేస్తారు. దీంతో చందనయాత్ర ముగు స్తుంది. స్వామి వారికి వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణిమ రోజుల్లో మూడు విడతలుగా తొమ్మి ది మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. అంటే స్వామికి సుమారు 500 కిలోల చందనాన్ని సమ ర్పిస్తారు. ఎంతో వైభవంగా జరిగే ఈ చందన యాత్ర వర్ణించటానికి మాటలు చాలవు, చూసి తీరవలసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement